బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : హేమ, టీవీ 9 జాఫర్‌తో బాబా భాస్కర్ కామెడీ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 :  హేమ, టీవీ 9 జాఫర్‌తో బాబా భాస్కర్ కామెడీ

బిగ్‌బాస్ (Bigg Boss 3) తెలుగు సీజన్ 3 మొదలైపోయింది. ఈ సీజన్‌లో పాల్గొనే 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి వచ్చేశారు. అయితే తొలిరోజే ఇంటిలోని సభ్యులకి నామినేషన్ రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. సాధారణంగా రెండవ రోజు నామినేషన్స్ ఉంటాయని మానసికంగా సిద్ధపడిన ఇంటి సభ్యులకి.. వారు ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే నామినేషన్ ఝలక్ ఇవ్వడంతో వారంతా షాక్‌లో పడిపోయారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?


ఇక తొలివారం నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులు - శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, వితిక షేరు.

అయితే ఈ ఆరుగురిలో నుండి ఎవరో ఒకరికి  నామినేషన్స్ నుండి తప్పించుకునే అవకాశాన్ని.. బిగ్ బాస్  ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియలో హేమని మానిటర్‌గా ఇంటి సభ్యుల చేతనే ఎంపిక చేయించడం విశేషం.

దీనితో ఇప్పుడు హేమ నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉంది. ఆ నిర్ణయాన్ని బట్టే.. ఈ ఆరుగురు సభ్యులు ఆఖరి నామినేషన్స్‌లో ఉంటారా లేక మరెవరైనా వీరి స్థానాల్లోకి వస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక హేమ నిర్ణయం రెండవ ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

అయితే ఈ నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు కూడా మంచి సెలబ్రిటీలు కావడంతో.. మొదటివారమే ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారన్న ఉత్కంఠ అందరిలోనూ కలిగింది. మొత్తానికి ఈ సీజన్ మొదలైన మొదటి రెండు రోజుల్లోనే.. ప్రేక్షకులకి కావాల్సినంత ఆసక్తిని తీసుకురావడంలో నిర్వాహకులు సఫలీకృతులయ్యారు అనే చెప్పాలి.

ఇదిలావుండగా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ( Baba Bhaskar) బిగ్ బాస్ హౌస్‌లో చేస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఇంటిసభ్యులనే కాకుండా.. షో చూస్తున్న ప్రేక్షకులని కూడా కడుపుబ్బా నవ్విస్తున్నారు. ప్రధానంగా టీవీ 9 జాఫర్‌తో (TV9 Jaffar) బాబా భాస్కర్ చేస్తున్న కసరత్తులు.. నిన్నటి ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు. అలా కసరత్తులు చేయిస్తూ - "జాఫర్ గారూ.. ఈ షో నుండి మనం బయటకి వెళ్ళిపోయే లోపు పొట్ట తగ్గిపోవాలి" అంటూ చేసిన సరదా కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి.

ఇక బాబా భాస్కర్ అల్లరి ... జాఫర్‌తోనే ఆగిపోకుండా హేమతో కూడా కొనసాగుతోంది. నామినేషన్స్ నిర్ణయం  హేమ (Hema) చేతిలో పెట్టిన తరువాత... "మాతాజీ" అంటూ ఆమె వెనుకనే ఫాలో అవుతుండడం... తన మనసులో మాటని కెమెరా ద్వారా ప్రేక్షకులకి చెబుతుంటే.. దొంగచాటుగా నక్కి వినడం వంటివి చేస్తూ ఆటపట్టిస్తున్నాడు.

 'చంద్రయాన్ 2' ఓ 'బాహుబలి' : ప్రభాస్‌తో పాటు సెలబ్రిటీల ఆసక్తికర ట్వీట్స్

సహజంగా బాబా భాస్కర్ అంటేనే చాలా సరదా మనిషి అని అందరికి తెలుసు. ఆయన డ్యాన్స్ ఎంత బాగా చేయిస్తారో అదే విధంగా ఏదైనా ప్రోగ్రామ్‌కి వస్తే.. అంతే ఫన్నీగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు బాబా భాస్కర్ చేస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తుంటే, ఈ సీజన్‌లో ఈయనే మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్సన్ అని ఒక అంచనాకి రావొచ్చు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో పరిస్థితులు గంటల వ్యవధిలో మారిపోతుంటాయి. అందుకనే ఈ షోలో అంచనాలతో లెక్కించడం అసాధ్యం అనే చెప్పాలి.

అలాగే ఈ బిగ్ బాస్ సీజన్‌లో ఎక్కువమంది టీవీ యాక్టర్స్ ఉండడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు కూడా ఈ సారి బిగ్‌బాస్‌కి పెరుగుతుంది అన్న వాదనలు వినపడుతున్నాయి. అయితే ఈ విషయం మాత్రం ఇంటిలో ఉన్న టీవీ యాక్టర్స్ నామినేషన్స్‌లో ఉన్నప్పుడు.. వారికి వచ్చే ఓట్ల శాతం బట్టి ఒక నిర్ధారణకు రావచ్చు.

ఏదేమైనా... ఈ సీజన్ ప్రారంభమే నామినేషన్స్ ప్రక్రియతో మొదలవ్వడం చాలా ఆసక్తికరంగా ఉంది. మరి చూడాలి రాబోయే 98 రోజులు ప్రేక్షకులకి ఇంకెన్ని ట్విస్టులు & ఝలక్కులు ఇవ్వనుందో ఈ బిగ్ బాస్ షో (Bigg Boss Telugu).

"ఫ్రెండ్‌షిప్ డే" గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ కోసం క్లిక్ చేయండి