(Bigg Boss Telugu Winner Rahul Sipligunj and Punarnavi Bhupalam shared their experiences in Talk Show)
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3” తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన జోడీ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం. ఈ షోలో వీరి మధ్య సాగిన ఘట్టాలు.. వారు ప్రేమలో పడిపోయారేమోనన్న ఫీలింగ్‌ని ప్రేక్షకులకు కూడా కలిగించాయి. చాలామంది అభిమానులు వారు ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా బయటపెట్టారు. అయితే షో నుండి బయటకు వచ్చాక ఇదే విషయాన్ని వీరిరువురి వద్ద ప్రస్తావించగా.. “అలాంటిదేమీ లేదని.. తాము మంచి స్నేహితులం” మాత్రమేనని వారు చెప్పుకొచ్చారు.
ఇటీవలే ఈటీవీలో ప్రసారమైన “ఆలీతో సరదాగా” షోలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట.. నిజంగానే కొన్ని గమ్మత్తైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తొలిసారి పునర్నవిని చూసినప్పుడు మీకు ఏమనిపించిందని రాహుల్‌ని ప్రశ్నించగా.. “ఈ పోరీ ఖతర్నాక్‌గా ఉందిరా భాయ్” అని మనసులో అనుకున్నానని నిర్మొహమాటంగా చెప్పేశాడు రాహుల్. తర్వాత అది సరదాగా చేసే కామెంట్ అని తెలిపాడు. అలాగే పునర్నవి కూడా రాహుల్‌కి సంబంధించి తన ఆలోచనలను బయటపెట్టింది. “ఈ కుర్రాడేంటి ఇంత దిట్టంగా ఉన్నాడు.. అమ్మో.. చాలా జాగ్రత్తగా ఉండాలి” అని తను అనుకుందట.
Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా ?
ఇక ఈ షోలో రాహుల్, పునర్నవిలు తమ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “తను ఎంత గొప్ప సింగర్‌గా ఎదిగినా సరే తన కులవృత్తిని మర్చిపోలేదని.. మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా కూడా రాణించగలనని.. ఇతరుల అందానికి మెరుగులు దిద్దే తన వృత్తి అంటే తనకు ఎంతో ఇష్టమని” తెలిపాడు రాహుల్. ఇక పునర్నవి విషయానికి వస్తే.. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రోజుల్లో నెటిజన్లు తనకు వివిధ రకాలు పేర్లను పెట్టారని చెబుతూ.. వాటిని బహిర్గతం చేశారు అలీ. అందులో పులిహోర రాణి, కోపిష్టి పక్షి అనే టైటిల్స్… ఇంకా ట్రెండింగ్‌లో ఉన్నాయని కితాబు కూడా ఇచ్చాడు.
అలాగే రాహుల్ మాట్లాడుతూ “తాను హౌస్‌లో ఉన్న సమయంలోనే తన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. కానీ ఇంట్లో వాళ్లు తనకు ఆ విషయం చెప్పకుండా దాచారని” తెలిపాడు. తన తల్లిదండ్రులు తమ ప్రాణాల కన్నా.. వారి కొడుకే ఎక్కువని అనుకున్నారని.. అందుకే తన గేమ్ స్పిరిట్‌కు భంగం కలగకుండా ఉండేందుకు తనకు ఆ విషయం చెప్పలేదని పేర్కొన్నాడు. అందుకే తనకు దేవుడి కంటే తల్లిదండ్రులే ఎక్కువని.. అటువంటి గ్రేట్ పేరెంట్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని చెబుతూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు రాహుల్.
నేను తప్పు చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను చేయను : పునర్నవి
అలాగే పునర్నవి కూడా తన సినీ కెరీర్‌లో ఎందుకు అంతగా సక్సెస్ కాలేకపోయిందని… ఆలీ అడిగిన ప్రశ్నకు తన వెర్షన్‌ను వినిపించింది. “నేను 17 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఉయ్యాల జంపాల చిత్రంతో పాపులర్ అయ్యాను. కానీ సినిమాలు చేయడం ఆపి.. కొన్నాళ్లు స్టడీ కెరీర్ గురించి కూడా ఆలోచించాలని భావించాను. ఆ లక్ష్యం కూడా చేరుకున్నాక.. మళ్లీ సినిమాలు చేయాలని అనుకున్నాను. కనుక ఈ రంగంలోని నేను సక్సెస్ కాలేదని ఎప్పుడూ భావించలేదు. ప్రస్తుతం ఈ విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నాను” అని తెలిపింది.
గల్లీ పోరడు గుండెలని గెలిచాడు – బిగ్ బాస్ తెలుగు 3 విజేత రాహుల్ సిప్లిగంజ్