ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా ?

Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా ?

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’లో (Bigg Boss Telugu 3) భాగంగా  నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ క్రమంలో కంటెస్టంట్ పునర్నవి భూపాళం (Punarnavi Bhupalam) ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే ఆమె ఎలిమినేట్ అయ్యే సమయంలో.. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే ఆమె హౌస్ నుండి బయటకి వచ్చేటప్పుడు మాత్రం.. రాహుల్ సిప్లిగంజ్‌తో మాట్లాడకుండా వచ్చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్‌ని స్టేజ్ పైకి వచ్చాక.. నాగార్జున తగ్గించే ప్రయత్నం చేశారు.

Bigg Boss Telugu 3: టాస్క్‌లో బాబా భాస్కర్‌ని తోసేసిన వితిక.. ప్రశ్నించిన నాగార్జున ..!

పునర్నవి ఇంటి నుండి బయటకు వెళ్లాక.. ఏమి చేయాలో అర్ధమవ్వక ఏడ్చేశాడు రాహుల్. ఇదే విషయాన్ని పునర్నవికి చెబితే ఆమె నమ్మలేదు. ఇక పునర్నవి కోసం ఒక పాట పాడమని నాగార్జున అడిగితే, ఆ పాట పాడుతూ మధ్యలోనే ఏడ్చేశాడు రాహుల్. దీనితో ఒక్కసారిగా మిగతా ఇంటి సభ్యులు అందరూ రాహుల్ సిప్లిగంజ్‌ని ఓదార్చారు. దీంతో మరలా ఆమెకోసం.. తను ఓ పాట పాడడం జరిగింది. అలాగే వీరిద్దరి కోసం బిగ్ బాస్ చేత నాగార్జున.. మరొక పాటని బ్యాగ్రౌండ్‌లో వినిపించారు. చివరికి ఈ ఇద్దరూ… ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకున్నారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల చేత నాగార్జున చాలా ఫన్నీ గేమ్స్ ఆడించారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా నవరసాలని ఇంటిలో పండించాలని కోరారు. దీంతో తమదైన శైలిలో తొమ్మిది రసాలని ఇంటి సభ్యులు ప్రదర్శించారు. అందులో బాబా భాస్కర్, శ్రీముఖి, మహేష్ విట్టాల ప్రదర్శన చాలా బాగుండడంతో.. ఈ ముగ్గురికి ఫుల్ మార్క్స్ వేశారు. అలాగే బాబా భాస్కర్ చేసిన ప్రదర్శన అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. 

ADVERTISEMENT

ఇక నిన్నటితో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’కి సంబంధించి 11 వారాలు పూర్తయ్యాయి. ఈరోజు నుండి 12వ వారం మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు 8 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఇంకొక మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. దీంతో చివరి వారానికి 5 ఇంటి సభ్యులు మాత్రమే మిగులుతారు.

ఈ క్రమంలో ఈ మూడు వారాలు చాలా కీలకంగా మారనన్నాయి. ఈ మూడు వారాల్లో నామినేషన్స్‌లో లేకుండా ఉండేందుకు.. హౌస్ మేట్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో ఎవరుంటారన్న విషయం.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్ & వితిక 

నిన్నే ఈ వారం నామినేషన్ టాస్క్‌కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఆ వీడియోలో చూస్తే, పార్కింగ్ ట్రాలీస్‌ని ఎవరు ముందుగా పార్క్ చేస్తారో.. వారే నామినేషన్స్ నుండి సేఫ్ అవుతారని తెలుస్తోంది. మరి వారు ఎవరనేది ఈ రాత్రికి గానీ బహిర్గతం అయ్యే అవకాశం లేదు. అలాగే వితిక ఇప్పటికే మెడాలియన్ (Medallion) గెల్చుకోవడంతో.. ఈ మూడు వారాలలో.. ఏదైనా ఒక వారం ఆమె నామినేషన్స్ నుండి సేఫ్ అవ్వచ్చు.

ADVERTISEMENT

మరి వితిక (Vithika) ఈ వారం ఆ అవకాశాన్ని వాడుకుంటుందో లేదో చూడాలి. ఇప్పుడున్న ఇంటి సభ్యులలో ఎక్కువమంది.. బిగ్ బాస్ ఫైనల్‌కి వెళ్లగలిగే సత్తా ఉన్నవారే కావడంతో.. పోటీ తీవ్రంగా ఉంది. చూడాలి.. చివరి వారం వరకు ఎవరు మిగులుతారో..?

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో పునర్నవి ఎలిమినేషన్.. రాహుల్ సిప్లిగంజ్ చేత కన్నీళ్ళు పెట్టించింది. అలాగే పునర్నవి కూడా బయటకు వెళుతూ.. మిగితా ఇంటి సభ్యులలో స్ఫూర్తిని పెంచింది. అదేవిధంగా ఫైనల్‌కి వెళ్ళాలనే తపనని కూడా పెంచగలిగింది. చూద్దాం.. పునర్నవి లేకుండా రాహుల్ సిప్లిగంజ్ ఆట ఎలా ఉంటుందో మరి. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి.. మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..!

Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా?

07 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT