నా దృష్టిలో విజయ్ దేవరకొండ.. అందరి కంటే గ్లామరస్ నటుడు : అలియా భట్

నా దృష్టిలో విజయ్ దేవరకొండ.. అందరి కంటే గ్లామరస్ నటుడు : అలియా భట్

Alia Bhatt says Arjun Reddy star Vijay Deverakonda is the most glamorous actor of 2019

ప్రముఖ బాలీవుడ్ నటి, మహేష్ భట్ కుమార్తె అలియా భట్ .. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం "RRR" చిత్రంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటించిన అలియా ఇటీవలే ఓ ఫ్యాషన్ షోలో తన అభిప్రాయాలను పంచుకుంది. ఆ షోలో "2019లో మీకు నచ్చిన గ్లామరస్ నటుడు ఎవరు" అనే ప్రశ్నకు ఆమె తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని సమాధానమిచ్చేసింది. అలాగే కథానాయికల విషయానికి వస్తే అనుష్క శర్మకి ఎవరూ సాటిరారని తెలిపింది.

నా ఇంట్లో ఉండేందుకు.. నాకే భయమేస్తోంది : విజయ్ దేవరకొండ

"విజయ్ దేవరకొండ ఒక అమేజింగ్ స్టైల్ ఉన్న నటుడు. దక్షిణాది పరిశ్రమలో ఆయనకు అందుకే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు" అని అలియా భట్ తెలపడం విశేషం. ఇటీవలే 2019లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అందించిన భారతీయ నటులందరినీ ఒక చోటుకి పిలిచి.. ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఓ ఛానల్ వారు నిర్వహించారు. అందులో అలియా భట్‌తో పాటు విజయ్ దేవరకొండ, దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్, విజయ్ సేతుపతి, మనోజ్ బాజ్‌పాయ్, ఆయుష్మన్ ఖురానా, పార్వతి తిరువోతు మొదలైన వారు  పాల్గొన్నారు.

పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

ఈ కార్యక్రమంలోనే పార్వతి తిరువోతు... విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" పై ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు కురిపించింది. ఆ విమర్శలపై తర్వాత ట్విటర్‌లో అనేక వాదోపవాదాలు జరిగాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం "వరల్డ్ ఫేమస్ లవర్" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒక విడుదలైంది. ఆ పోస్టర్ పై కూడా మిశ్రమ స్పందనలు వచ్చాయి. సిగరెట్ పట్టుకొని.. గాయాలతో కనిపించే కథానాయకుడి పోస్టర్ పై పలువురు కామెంట్స్ చేశారు. విజయ్ ఇంకా "అర్జున్ రెడ్డి" హ్యాంగోవర్ నుండి బయటపడలేదని పలువురు ట్వీట్స్ చేశారు

View this post on Instagram

I want a milkshake.

A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on

ఇక అలియా భట్ విషయానికి వస్తే.. ఈ సంవత్సరం ఆమె గల్లీ బాయ్, కళంక్ అనే రెండు చిత్రాలలో నటించింది. అలాగే 2020లో ఆమె నటించిన సడక్ 2, బ్రహ్మాస్త్ర చిత్రాలతో పాటు.. తెలుగులో ఆమె చేసిన RRR చిత్రం కూడా విడుదల కానుంది. సడక్ 2 చిత్రానికి అలియా తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించడం విశేషం. సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, పూజా భట్, మకరంద్ దేశ్ పాండే, ప్రియాంక బోస్, గుల్షన్ గ్రోవర్ ఈ చిత్రంలో నటిస్తుండగా.. జీత్ గంగూలి, అంకిత్ తివారి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన "30 అండర్ 30"లో స్థానం సంపాదించుకున్న ఏకైన భారతీయ నటుడిగా తాను కితాబునందుకున్నారు. అలాగే "మీకు మాత్రమే చెబుతా" సినిమాతో నిర్మాతగా కూడా మారారు. "రౌడీ వేర్" పేరుతో సొంతంగా టెక్స్‌టైల్స్ బిజినెస్ కూడా ప్రారంభించారు. అలాగే హిందుస్తాన్ టైమ్స్ నుండి హాటెస్ట్ స్టైలెస్టా అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు విజయ్. అలాగే గీత గోవిందం చిత్రంలో నటనకు గాను సైమా నుండి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును కూడా పొందాడు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.