మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం “చిత్రలహరి” (Chitralahari). ఇప్పటికే ఈ చిత్రంపై సినీ అభిమానులకు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట “గ్లాస్ మేట్స్” (Glassmates) ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.
ప్రస్తుతం అదే పాట సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకు మ్యూజిక్ అందివ్వగా.. పూర్తి మాస్ బీట్‌తో చాలా క్రేజీగా ఉందీ సాంగ్. చంద్రబోస్ రాసిన ఈ పాటలోని లిరిక్స్ కూడా చాలా వెరైటీగా ఉండడం విశేషం.
స్కూలుకెళ్లే వరకేరా క్లాస్‌మేట్సు..
రెంటు కట్టే వరకేరా రూమ్‌మేట్సు..
వీకెండ్ వచ్చే వరకే ఆఫీస్‌మేట్సు..
లైఫ్ ఎండయ్యే వరకేరా సోల్‌మేట్సు..
ఎండ్ అంటూ లేని
బెండ్ అంటూ కాని
రియల్ రిలేషిన్ షిప్పేప్పేప్పే..
గ్లాస్‌మేట్సు.. గ్లాస్‌మేట్సు
గలగలగల గలగలగల గ్లాస్‌మేట్సు..
పప్పు రేటు పెరిగితే పెరగనీ పెరగనీ
ఉప్పు రేటు పెరిగితే పెరగనీ పెరగనీ
పెట్రోల్ ధర తగ్గితే తగ్గనీ
ఏ పార్టీ ఓడైనా నెగ్గనీ నెగ్గనీ
మన స్నాక్స్ ఫ్రెష్‌గా ఉండనీ
మన ఐస్ చల్లగా ఉండనీ
మన మంచింగ్ మంచిగుండని
మన గ్లాస్ ఫుల్లుగుండనీ
అంటూ సాగతుందీ పాట. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబులో 1 మిలియన్‌కు పైగా వ్యూస్ సంపాదించుకుంది. పూర్తిగా మందుబాబుల కోసమే ఆ పాట రాశారని మనం ఇట్టే కనిపెట్టేయచ్చు. మైత్రిమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ సమ్మర్‌కి విడుదల చేయునున్నట్లు చెబుతున్నారు నిర్మాతలు.
ఈ గ్లాస్ మేట్స్ పాటని రాహుల్ సిప్లిగుంజ్, పెంచల్ దాస్ కలిసి పాడారు. చిత్రలహరి సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటిస్తుండగా.. నివేత పెతురాజ్, సునీల్, వెన్నెల కిషోర్, పోసాని క్రిష్ణమురళి, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ముద్దుకు… కథకు సంబంధముంది: ‘డియర్ కామ్రేడ్’ కథానాయిక రష్మిక
“సాహూ” నిర్మాతలకి ప్రభాస్ పెట్టిన చిత్రమైన కండీషన్.. వింటే ఆశ్చర్యపోతారు..!
ఫ్యాషన్స్‌లో కూడా “హనీ ఈజ్ ది బెస్ట్” అనిపిస్తోన్న మెహరీన్..!