"సాహూ" నిర్మాతలకి ప్రభాస్ పెట్టిన చిత్రమైన కండీషన్.. వింటే ఆశ్చర్యపోతారు..!

"సాహూ" నిర్మాతలకి ప్రభాస్ పెట్టిన చిత్రమైన కండీషన్.. వింటే ఆశ్చర్యపోతారు..!

బాహుబలి (Baahubali) అంతటి ఘనవిజయం అందుకున్నాక.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. అలా వచ్చిన స్టార్ డమ్‌కి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను చేయబోయే చిత్రాలు తెలుగుతో పాటు తమిళం & హిందీలలో కూడా విడుదల చేయాలనే ఆలోచనను చేశాడు.


అందులో భాగంగానే సాహూ (Saaho) చిత్రం తెలుగుతో పాటుగా తమిళం & హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మితమవుతున్నది. అలా మన ప్రభాస్ హిందీలో తొలిసారిగా సాహో చిత్రం ద్వారా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం సాహూ చిత్ర షూటింగ్ ఆఖరి దశకి చేరుకుంది. వచ్చే రెండు మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఆగష్టు 15, 2019 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది.


ఇక సాహో చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకున్న సందర్భంగా.. ప్రభాస్ తన నిర్మాతలకి ఒక ఆసక్తికర కండిషన్ పెట్టాడట. ఆ కండిషన్ ఏంటో విని వారు కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఇంతకి ఆ కండిషన్ ఏంటంటే - సాహో చిత్ర షూటింగ్ జరిగే సమయంలో ప్రభాస్ వాడిన కారు, బైకుని.. షూటింగ్ అయిపోయాక తనతో పాటు తీసుకెళ్లిపోతానని అన్నాడట.


 


అయితే సాధారణంగా షూటింగ్ కోసం వాడే వాహనాలను ప్రత్యేకించి చేయించడమో లేదా ఎక్కడినుండైనా అద్దెకు తేవడమో చేస్తుంటారు. కాకపోతే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో.. ఈ వాహనాలను ప్రత్యేకించి డిజైన్ చేసి తీసుకువచ్చారు అని తెలిసింది.


షూటింగ్ సమయంలో ఈ వాహనాలను ఎక్కువ సార్లు ఉపయోగించడంతో పాటు.. వాటిపైన ఒక ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడడంతో వాటిని తాను తీసుకుపోతున్నట్లు ఆయన నిర్మాతలకి చెప్పేశాడట. అయితే ప్రభాస్ కోరిక చాలా ఆసక్తికరంగాను.. అదే విధంగా పెద్దగా ఇబ్బందికరంగానూ లేకపోవడంతో నిర్మాతలైన వంశీ & ప్రమోద్‌లు వెంటనే సరే అనేశారట. అలా తాను ఈ సినిమా కోసం నడిపిన వాహనాలకు.. తన గ్యారేజ్‌లో ప్రత్యేక స్థానం కల్పించనున్నాడట  ప్రభాస్.


ఇక ప్రభాస్ అభిమానులు "సాహో" చిత్రం గురించి చాలారోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే మూడు నాలుగు నెలల వ్యవధిలో "చాఫ్టర్స్ అఫ్ సాహో 1 & 2" పేరిట విడుదలైన టీజర్స్‌కు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు ప్రభాస్ కొత్త కండిషన్ వార్త బయటకి రావడంతో.. తమ హీరో అంతలా ఇష్టపడే ఆ కారు & బైక్ గురించిన వివరాలు తెలుసుకోవాలన్న ఆతృతలో అభిమానులు మునిగిపోయారు. మరి త్వరలో దీని గురించిన ప్రకటన లేదా మరింకేవైనా వివరాలు తెలిస్తే వాటిని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండింగ్ వార్తలుగా మార్చేసి.. తమ హీరో పైన ప్రేమని చూపడానికి రెడీగా ఉన్నారు.

Subscribe to POPxoTV

ఇవ్వన్ని పక్కకి పెడితే, సాహో చిత్రం ద్వారా బాలీవుడ్ నాయిక శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) తెలుగులో అడుగుపెట్టనుంది. ఆమె ఈ చిత్రం కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు భాష నేర్చుకునేందుకు సిద్ధమవుతున్నదట. ప్రభాస్ కూడా ఈ విషయంలో శ్రద్ధ కపూర్‌నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ కూడా హిందీ‌లో తన డబ్బింగ్ తానే చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలో ఆయన హిందీ పై పట్టు సాధించేందుకు కోచింగ్ కూడా తీసుకుండడం విశేషం. వీరిద్దరూ చేస్తున్న కృషిని మనం తప్పకుండా అభినందించి తీరాల్సిందే మరి.


ఇక దర్శకుడు సుజీత్ (Sujeeth) కూడా ఈ చిత్రం కోసం చాలా కాలం ఎదురుచూశారనే చెప్పాలి. బాహుబలి చిత్రం విజయం సాధించాక.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఎందరో దర్శకులు క్యూ కట్టిన విషయం తెలిసిందే. అయితే వారందరినీ కాదని.. ప్రభాస్ యువ దర్శకుడైన సుజీత్‌కు డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వడం గమనార్హం. అందుకే ఆయన ఈ ఈ అవకాశం సద్వినియోగం చేయాలని.. అలాగే చిత్రానికి వందశాతం న్యాయం చేయాలని కష్టపడుతున్నట్టుగా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.


సాహో చిత్రం మూడు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న కారణంగా.. ఈ చిత్రంలో ఆయా మూడు పరిశ్రమలకి చెందిన ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. దీనితో ఈ చిత్రంలో మనం ప్రభాస్ & శ్రద్ధ కపూర్‌తో పాటు మరెంతమందో నటీనటుల్ని చూసే అవకాశం లభించనుంది. 


ఇవి కూడా చదవండి


తమిళ స్టార్ విజయ్ తెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఫ్యాన్స్‌కి హీరోనే!


సైనా నెహ్వాల్ పాత్ర పోషించేది శ్ర‌ద్ధాక‌పూర్ కాదు.. ప‌రిణీతి చోప్రా..!


రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??