పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

చాలామంది అమ్మాయిలు.. అబ్బాయిలు కూడా పెళ్లి (Marriage) అయిన తర్వాత బరువు (Weight) పెరిగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. మీరూ అలా పెరిగినవారిలో ఒకరా? అయితే మీరొక్కరే కాదు.. మీలా చాలామంది పెళ్లి తర్వాత బరువు పెరుగుతారట. తాజాగా ఓ సర్వేలో కూడా ఆరోగ్యకరమైన, ఆనందమైన బంధంలో ఉన్న జంటలో భార్యాభర్తలిద్దరూ బరువు పెరుగుతారని తేలింది.


couple eating 1


అవును.. ఆస్ట్రేలియాలోని సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ వారు దాదాపు పదిహేను వందల మందిపై నిర్వహించిన సర్వే ప్రకారం వెల్లడైన నిజం ఇది. అందులో ప్రతి నలుగురిలో ముగ్గురు ఆనందకరమైన బంధంలో ఉన్నవారే. ఈ స్టడీ ప్రకారం రొమాంటిక్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారట. ధూమపానం, మద్యపానం మానేసి వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కొనసాగిస్తోన్నా ఇలాంటివారు బరువు పెరుగుతున్నారట.


దీనికి కారణం ఎక్కువగా నచ్చింది తినేయడమే అంటున్నారు నిపుణులు. అవతలివారిని తమవైపు అట్రాక్ట్ చేసేందుకు సన్నగా, అందంగా కనిపించాల్సిన అవసరం లేనప్పుడు ప్రతిఒక్కరూ నచ్చిన ఆహారం తినడానికి ఇష్టపడతారట. ఇద్దరూ కలిసి నచ్చిన భోజనం తినేస్తారు. ఇలా కొవ్వు పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్లయిన వారి నుంచి 50ల్లో ఉన్నవారి వరకూ ప్రతిఒక్కరినీ ఈ సర్వే పరిగణనలోకి తీసుకుంది. అయితే పెళ్లయిన జంటలు, డేటింగ్‌లో ఉన్నవారు బరువు పెరిగితే ఒంటరిగా ఉన్నవారు మాత్రం వీరితో సమానంగా బరువు పెరగలేదట.


couple eating 2


సాధారణంగా అందరూ లవ్ వెయిట్ అని పిలిచే ఈ బరువు ఎక్కువగా పెళ్లయిన లేదా డేటింగ్‌లోకి అడుగుపెట్టిన మొదటి రెండు నుంచి నాలుగేళ్ల వరకూ ఎక్కువగా పెరుగుతుందట. ఇంగ్లండ్‌లోని 'న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' నిర్వహించిన మరో సర్వే ప్రకారం భార్యాభర్తలిద్దరిలో ఒకరు బరువు పెరిగితే మరొకరు బరువు పెరిగే అవకాశం 37 శాతం పెరుగుతుందట.


ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు దీని గురించి మాట్లాడుతూ.. ఇది బంధంలో ఓ రకమైన సంతృప్తి, ఆనందం వల్ల జరుగుతుంది. బంధంలో అవతలివారితో ఆనందంగా ఉంటే తప్పక బరువు పెరుగుతారు. తాము బరువు పెరిగినా.. తమ అందం పాడైనా.. బంధంలో ఎలాంటి మార్పు రాదని భావించే జంటలు ఇద్దరూ కలిసి నచ్చిన ఆహారం తింటూ బరువు పెరిగిపోతుంటారట.


అయితే పెళ్లయిన వాళ్లందరూ బరువు పెరగాల్సిన అవసరం లేదని వీళ్లు చెబుతున్నారు. తన భాగస్వామితో అన్ని విషయాల్లో సంతృప్తితో ఉన్న వారు మాత్రమే బరువు పెరుగుతారట. బంధంలో గొడవలు లేదా అసంతృప్తి ఉన్నవారు మాత్రం బరువు పెరగరని ఈ సర్వేలో తేలిందట.


couple eating 3


కేవలం భార్యాభర్తల్లో మాత్రమే కాదు.. ఇంట్లో ఒకరు లావుగా ఉంటే మరొకరు కూడా అలా మారే అవకాశం ఉంటుందని కూడా ఈ సర్వే తేల్చింది. అందుకే ఒకవేళ మీ సోదరి లేదా సోదరుడు అధిక బరువుతో బాధపడుతుంటే మీరు బరువు పెరిగే అవకాశం కూడా 40 శాతం ఎక్కువగా ఉంటుందట. మరి, మీరు పెరిగిన బరువుకి మీ సోదరి, సోదరుడు లేదా భాగస్వామి కారణమన్నమాట. ఈసారి మీరు బరువు పెరిగారని వారు మిమ్మల్ని ఏడిపిస్తుంటే వారి వల్లే పెరిగానంటూ ఈ సర్వేని ఒకసారి వారికి చూపించడం మర్చిపోవద్దు.


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.   


ఇవి కూడా చదవండి.


బరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!


పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!


ఈసారి ఎవ‌రైనా బ‌రువు పెరిగావ‌ని చెబితే.. వారికి ధీటుగా బ‌దులివ్వండిలా..!


Images : Giphy