త‌మ త‌ల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భ‌లే ఫేమ‌స్‌ తెలుసా..!

త‌మ త‌ల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భ‌లే ఫేమ‌స్‌ తెలుసా..!

అస‌లు కంటే కొస‌రు ముద్దు అంటూ ఉంటారు పెద్ద‌లు. చాలావ‌ర‌కు ఇది నిజ‌మే.. ముఖ్యంగా ముద్దులొలికే పిల్ల‌ల విష‌యంలో నిజంగా నిజం. అందుకేనేమో కొంత‌మంది సెల‌బ్రిటీ కిడ్స్‌(Celebrity kids).. త‌మ త‌ల్లిదండ్రులతో స‌మానంగా లేదా వారికంటే కాస్త ఎక్కువ‌గానే పాపులారిటీ సంపాదించుకున్నారు. కొంద‌రు త‌మ త‌ల్లిదండ్రుల సోష‌ల్‌మీడియా అకౌంట్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంటే.. మ‌రికొంద‌రు త‌మ ఫ్యాన్‌పేజీల ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. మ‌రి, ఆ బుజ్జాయిలు ఎవ‌రో తెలుసుకుందాం రండి..


arha


అల్లు అర్హ‌, అల్లు అయాన్‌


సెల‌బ్రిటీల పిల్ల‌ల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న పిల్ల‌లు వీరిద్ద‌రు.. అయాన్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి ప్ర‌త్యేక‌మైన సంద‌ర్బానికి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన కొడుకు ఫొటోను పంచుకునేవాడు. హోలీకి రంగులు పూసుకుని, క్రిస్‌మ‌స్‌కి శాంటాక్లాజ్ వేషంలో.. ఇలా ప్ర‌తి పండ‌క్కి విభిన్నంగా త‌యారుచేసి తీసిన ఫొటోల‌ను పంచుకోవ‌డంతో అయాన్‌కి క్రేజ్ పెరిగింది. ఇక అర్హ పుట్టినప్ప‌టి నుంచే అభిమానుల‌ను సొంతం చేసుకుంది. ఈ మ‌ధ్య నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోను అంటూ త‌ను చెప్పిన వీడియో ఎంత ఫేమ‌సైందో అంద‌రికీ తెలిసిందే.


sitara 6552559


సితార‌, గౌత‌మ్‌


మ‌హేష్ బాబు, న‌మ్ర‌తల పిల్ల‌లు వీరిద్ద‌రూ. 1: నేనొక్కడినే సినిమాలో మ‌హేష్ చిన్నప్ప‌టి పాత్ర‌లో కనిపించాడు గౌత‌మ్‌. అంత‌కుముందు నుంచే అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న గౌత‌మ్ ఈ సినిమాతో పాపుల‌ర్‌గా మారిపోయాడు. ఇక సితార త‌న‌ చిన్న‌ప్ప‌ట్నుంచీ ఫేమ‌స్సే. మ‌హేష్ బాబు గారాల‌ప‌ట్టి అయిన సితారకు ఫ్యాన్ అకౌంట్ కూడా ఉండ‌డం విశేషం. చిన్న‌త‌నం నుంచే అమ్మానాన్న‌లిద్ద‌రూ త‌న ఫొటోల‌ను పోస్ట్ చేస్తుండ‌డంతో పాటు సితార అమాయక‌మైన ముఖం, త‌న హావ‌భావాలు అంద‌రినీ ఆకట్టుకోవ‌డంతో తండ్రితో స‌మానంగా క్రేజ్ సంపాదించుకుందీ బుజ్జాయి.


45665182 1994457303944127 179292954504986624 n 7030645


విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌


టాలీవుడ్ క‌థానాయిక మంచు ల‌క్ష్మి ముద్దుల కూతురు విద్యా నిర్వాణ‌. స‌రోగ‌సీ ద్వారా త‌న కూతురికి జ‌న్మ‌నిచ్చిన ల‌క్ష్మి విద్యా నిర్వాణ‌తో చేసిన ప్ర‌తి ప‌నిని సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది. అంతేకాదు.. త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఫ్యాన్‌పేజీలు  కూడా ఉన్నాయి. నిర్వాణ ఏం చేసినా స‌రే.. ప్ర‌తి అడుగునూ ఫొటోలు, వీడియోల రూపంలో అంద‌రికీ తెలియజేస్తుంది.


akira


అకిరా, ఆద్య‌


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రేణు దేశాయ్‌ల పిల్ల‌లు వీళ్లు. త‌ల్లిదండ్రులిద్ద‌రూ విడిపోయినా.. అప్పుడ‌ప్పుడూ ఇద్ద‌రూ పిల్ల‌ల కోసం క‌లుస్తుండ‌డంతో మీడియా దృష్టి ఈ పిల్ల‌ల‌పై ఎక్కువ‌గా ప‌డింది. అంతేకాకుండా రేణు త‌న పిల్ల‌ల‌తో దిగిన ఫొటోల‌ను, వారి ప్ర‌త్యేక సంద‌ర్భాల‌ను త‌న అభిమానుల‌తో ఆనందంగా షేర్ చేసుకుంటుంది. అందుకే వీరిద్ద‌రికీ త‌ల్లిదండ్రుల‌కున్న ఫ్యాన్స్‌తో స‌మానంగా అభిమానులున్నార‌ని చెప్పుకోవ‌చ్చు.


Dq1tWHWVsAIOEq7


అరియానా, వివియానా, అవ్ర‌మ్‌


మ‌న కండ‌ల హీరో మంచు విష్ణు ముద్దుల కూతుళ్లు, కొడుకు వీళ్లు. అరియానా, వివియానా క‌వ‌ల‌లు కాగా.. వాళ్లు అవ్ర‌మ్ కంటే ఆరేళ్లు పెద్ద‌. మంచు విష్ణు మాత్ర‌మే కాదు.. ఆయ‌న భార్య వెరోనిక త‌న పిల్ల‌ల‌కు సంబంధించిన ప్ర‌తి స్పెష‌ల్ సంద‌ర్భాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది.


evika


అయాన ఇవిక


అల్ల‌రితో ఫేమ‌స్‌గా మారి త‌న మొద‌టి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న అల్ల‌రి న‌రేష్ కూతురు అయాన ఇవిక. త‌న తండ్రి పేరు క‌లిసేలా కూతురికి పేరు పెట్టుకున్న ఈ అల్ల‌రి హీరో త‌న ముద్దుల కూతురి ఫొటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటుంటాడు. ముద్దులొలికే ఈ బుజ్జాయికీ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారంటే న‌మ్మ‌లేక‌పోయినా అది నిజం.


abhay


అభ‌య్ రామ్‌


జూనియ‌ర్ ఎన్టీఆర్ వార‌సుడీ బుజ్జాయి. తండ్రితో అప్పుడ‌ప్పుడు సంద‌డి చేస్తూ మీడియాకి పోజులివ్వ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలోనూ తండ్రితో క‌లిసి క‌నిపిస్తుంటాడు.


ఇవి కూడా చ‌ద‌వండి.


చిన్నతనంలో.. అవి నిజంగానే నిజం అని న‌మ్మేశాం కదా..!


రామ్ ఒక్క‌డే కాదు.. ఇలాంటి ఖ‌రీదైన గిఫ్టులు చాలామందే ఇచ్చారు..


బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?