19 జులై, 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

19 జులై, 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 19) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు యువత ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అలాగే విద్యార్థులకు మంచి సమయం. ఆశాజనకమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారస్తుల ఆర్థిక సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు వృత్తికి సంబంధించి కొత్త ప్రణాళికలు అందిస్తారు. వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పలువురు పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. 

వృషభం (Tarus) – ఈ రోజు వ్యాపారస్తులకు ఆర్థిక విషయాలకు సంబంధించి మనస్సులో అనిశ్చితి ఏర్పడుతుంది. అయితే పాత రుణాల గురించి అంతగా పట్టించుకోకండి. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించండి. ఉద్యోగులు తొందరపాటు కారణంగా, కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొన్ని వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మిథునం (Gemini) – మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ రోజు  కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో కలిసి పనిచేస్తారు. అలాగే ఆర్థిక విషయాలలో స్నేహితుల తోడ్పాటు ఉంటుంది. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాలి.

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ప్రేమికులు కొత్త నిర్ణయాలు తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో సున్నిత విషయాలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి. పని ప్రాంతంలో అదనపు ఒత్తిడి ఉంటుంది. అయినా మీ నిజాయతే మీకు శ్రీరామరక్ష. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించండి. అలాగే ఉద్యోగులు ఆఫీసు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది.  వైవాహిక జీవితంలో కొంత అలజడి చెలరేగే అవకాశం ఉంది. అయినా సమయస్ఫూర్తితో, వివేకంతో వ్యహరించండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీ భాగస్వామి మీకు ఆర్థిక విషయాలలో తోడ్పాటును అందిస్తారు. అలాగే వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి అనుకోని ఆఫర్స్ లభిస్తాయి. వివాహితులు దూర ప్రయాణం చేస్తారు. అలాగే విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. 

తుల (Libra) –  అవివాహితులు ఈ రోజు శుభవార్తలు వింటారు. వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధన యోగం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అలాగే ఈ రాశివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో చిక్కుకుంటారు. అయినా సమయస్ఫూర్తితో వాటి నుండి బయటపడతారు. అలాగే నిరుద్యోగులు అసహనాన్ని వీడాలి. లేకపోతే మంచి అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు కొన్ని విషయాలలో.. తమను తప్పు దోవ పట్టించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాగే ప్రత్యర్థుల కదలికలను ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారులు డబ్బు పెట్టుబడి విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులు కొత్త ప్రయోగాల పట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు క్రియేటివ్ ఐడియాలతో.. అధికారులను ఇంప్రెస్ చేస్తారు. వివాహితులు కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. 

మకరం (Capricorn) – ఈ రోజు ఉద్యోగులు ఆఫీసులో అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. ఊహించని పరిస్థితులలో చిక్కుకుంటారు. ఇలాంటి సమయంలోనే వివేకంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో కాస్త అసహనానికి గురవుతారు. అలాగే వివాహితులు తమ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలను తొలగించుకుంటే మంచిది. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాల విషయంలో.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ నిజాయతే మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధనయోగం ఉంది. అలాగే వివాహితులు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. 

మీనం (Pisces) – ఈ రోజు మీరు పెట్టిన పెట్టుబడికి.. ఫలితం లభించే అవకాశముంది. అలాగే ప్రేమికులు తమ బంధం గురించి పెద్దవాళ్లతో చెప్పడానికి ఇదే సరైన సమయం. అందుకు వీలైతే మీ స్నేహితుల సహాయం కూడా తీసుకోండి. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఈ రోజు ఆసక్తి చూపుతారు. అలాగే వివాహితులు కుటుంబ విషయాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.