దీపికా పదుకొణె పెళ్లికూతురిగా తెరపై , నిజ జీవితంలో ఎలా మెప్పించిందో తెలుసా?

దీపికా పదుకొణె పెళ్లికూతురిగా తెరపై , నిజ జీవితంలో ఎలా మెప్పించిందో తెలుసా?

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ వివాహ స్పెషల్


దీపిక-రణ్ వీర్ లు ఇద్దరూ ఇటీవలే పెళ్లితో ఒకింటివారయ్యారు. పెళ్లికూతురిగా దీపిక అదరహో అనిపించింది. నిజ జీవితంలో మాత్రమే కాదు తెరపై కూడా వధువుగా.. ప్రేక్షకులను మెప్పించింది దీపిక. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సైతం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 


deepika padukone lake combo bridal makeup


ఆ ఫోటోలలో దీపిక అందంతో పాటు ఆమె వస్త్రధారణ సైతం అందరినీ మెప్పిస్తోంది. ఈ క్రమంలో గతంలో బాలీవుడ్ తెరపై దీపిక.. వధువుగా ఎలాంటి వేషధారణల్లో కనిపించిందో మనం కూడా చూద్దాం. 


పద్మావత్ :


padmaavat deepika padukone make up


రాణీ పద్మినీ దేవిగా ఈ సినిమాలో సినీ ప్రియులను అలరించిన దీపిక తన కాస్ట్యూమ్స్ తో ఫ్యాషన్ ప్రియులను సైతంమెప్పించింది. రణవీర్ తో కొంకిణీ పద్ధతిలో జరిగిన వివాహ వేడుకల్లో ఆమె ఇదే తరహా దుస్తులను ధరించింది. 


ఫైండింగ్ ఫానీ:


deepika padukone in finding fanny


ఈ సినిమాలో క్యాథలిక్ వధువుగా చాలా సింపుల్ మేకప్ లో అందంగా మెరిసిపోయింది దీపిక. ఈ వస్త్రధారణలో తెల్లని వస్త్రాల్లో దేవకన్య కిందికి దిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది కదూ..


చెన్నై ఎక్స్ ప్రెస్:


deepika padukone in bridal makeup in chennai express


చెన్నై యాసలో హిందీ మాట్లాడుతూ మీనలోచని అళగ సుందరంగా ఈ సినిమాలో దీపిక కనబరిచిన నటన అద్భుతమే. ఈ సినిమాలో ఆమె దక్షిణాది పెళ్లికూతురిగా కనిపించింది. చాలా సింపుల్ మేకప్ లోనే ఎంతో అందంగా కూడా కనిపిస్తోంది కదా..


deepika padukone as bride in love aaj kal


లవ్ ఆజ్ కల్:


దీపిక చాలా సందర్భాల్లో స్మోకీ ఐ మేకప్ లుక్ లో కనిపించింది. కానీ ఈ సినిమాలో దానికి భిన్నంగా మెటాలిక్ లావెండర్ షేడ్ ఉపయోగించింది. లేత రంగులోని లిప్ స్టిక్ దీపికకు అదనపు ఆకర్షణను చేకూర్చింది.