బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్.. నిజంగానే కంగనపై చెప్పు విసిరాడా?

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్.. నిజంగానే కంగనపై చెప్పు విసిరాడా?

కంగనా రనౌత్(kangana ranaut).. బాలీవుడ్ వివాదాల రాణిగా పేరు సంపాదించిందీ కథానాయిక.. సినిమాలతో పాటు సినీ ప్రముఖులపై ఘాటైన విమర్శలు చేస్తూ కూడా పాపులర్‌గా మారిందీ బ్యూటీ. గతంలో నెపోటిజం గురించి మాట్లాడి బాలీవుడ్ పరిశ్రమంలో కేవలం వారసత్వంగానే హీరో హీరోయిన్లు వస్తున్నారని వాదించి.. చాలామంది ప్రముఖులకు వ్యతిరేకిగా మారింది కంగన.


తాజాగా కంగన అలియా, రణ్ బీర్‌లను టార్గెట్ చేసి చాలాసార్లు మాటల తూటాలు పేల్చడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అలియా, రణ్ బీర్ ఇద్దరూ పెద్దగా స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. తాజాగా కంగన సోదరి, మేనేజర్ రంగోలీ ఛండేల్ కూడా మహేష్ భట్ (Mahesh bhatt) పై తీవ్రమైన ఆరోపణలు చేసింది.


ff2


తాజాగా కంగనా అలియా, రణ్ బీర్‌లను టార్గెట్ చేసి వారి గురించి మాట్లాడుతున్న మాటలకు తోడుగా రంగోలీ అలియా, ఆమె తల్లి సోనీ రజ్దాన్ పై విమర్శల వర్షం గుప్పించింది. బ్రిటిష్ పాస్ పోర్టులు ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు మన దేశపు మనుషులను, వనరులను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆమె తెలిపింది. వీరు ప్రజల్లో ద్వేషాన్ని పెంపొందిస్తున్నారని, వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారి మాయలో పడకుండా.. ప్రతి ఒక్కరూ తమని తాము కాపాడుకోవాలని రంగోలీ తన ట్వీట్ ద్వారా అందరికీ పిలుపునిచ్చింది.


2


దీనికి సమాధానంగా తన భర్త మహేష్ భట్ కంగన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో.. ఆమెకు సినిమా ఆఫర్లు అందించారని ఆమె తెలిపింది. ఆ విధంగా ఆమె మంచి స్థాయికి ఎదిగేలా సహాయం చేశారని.. కానీ కంగన ఈ స్థాయికి ఎదిగిన తర్వాత అలాంటి వ్యక్తి భార్యా,పిల్లలపైనే విమర్శలు చేస్తోందని సోనీ రజ్దాన్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఈ ట్వీట్‌ని డిలీట్ చేశారు.


3


అయితే ఈ ట్వీట్ తర్వాత ఈ అక్కాచెల్లెళ్లకు భట్ కుటుంబానికి మధ్య ట్వీట్ వార్ మొదలైంది. అందులో భాగంగానే రంగోలీ మహేష్ భట్ పై విమర్శల వర్షం గుప్పిస్తూ.. 2006లో "వో లమ్హే" చిత్రం స్క్రీనింగ్ సమయంలో ఆయన కంగనపై చెప్పు విసిరారని చెప్పుకొచ్చింది. తనతో సినిమా చేయడానికి ఒప్పుకోనందుకే ఇంత దురాగతానికి ఆయన ఒడిగట్టినట్లు చెప్పింది రంగోలీ.


4 mahesh bhatt threw a chappal at kangana ranaut


5 mahesh bhatt threw a chappal at kangana ranaut


6 mahesh bhatt threw a chappal at kangana ranaut


"డియర్ సోనీ జీ.. కంగనకు బ్రేక్ ఇచ్చిన వ్యక్తి అనురాగ్ బసు. మహేష్ భట్ కంగనకు ఎప్పుడూ బ్రేక్ ఇవ్వనేలేదు. ఆయన తన సోదరుడి ప్రొడక్షన్ హౌజ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ లేదని మీరు గుర్తుంచుకోండి. వో లమ్హే చిత్రం తర్వాత ఆయన రాసిన "ధోఖా" అనే సినిమాలో నటించేందుకు కంగన ఒప్పుకోలేదు. ఆ సినిమాలో తనని సూసైడ్ బాంబర్‌గా కనిపించేలా చేయాలనుకున్నాడు.


కానీ కంగన ఒప్పుకోలేదు. దీంతో ఆయన కోపంతో తన ఆఫీస్‌లో ఉన్నప్పుడు కంగనపై అరవడం మాత్రమే కాదు.. తర్వాత వో లమ్హే ప్రివ్యూ కోసం థియేటర్‌కి వెళ్లినప్పుడు అక్కడ అందరి ముందూ కంగనపై చెప్పు విసిరాడు.


కంగన తాను నటించిన సినిమా చూసేందుకు కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆ రాత్రంతా తను ఏడుస్తూనే ఉంది. అప్పుడు తన వయసు 19 సంవత్సరాలు మాత్రమే..." అంటూ వరుస ట్వీట్ల ద్వారా తన ద్వేషాన్ని వెల్లగక్కింది రంగోలీ.


ఇదే కాదు.. ఆ తర్వాత అలియా భట్ ఐక్యూ గురించి, తన అవార్డులు, ఫ్యాషన్, లుక్స్ గురించి వ్యంగ్యంగా ట్వీట్లు చేసిన రంగోలీ అలియాలా కంగనకు కూడా.. షుగర్ డాడీలు ఉంటే తను ఇండస్ట్రీలో కొనసాగడం సులువే అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. కంగన తన అకౌంట్ ద్వారా ట్వీట్స్ చేస్తోందన్న మాటలకు ఆమె స్పందిస్తూ.. "మీరు నన్నే తట్టుకోలేకపోతున్నారు.. ఇక కంగన నా అకౌంట్ వాడితే తను మంట పుట్టిస్తుంది" అంటూ ట్వీట్ చేసింది రంగోలీ.


7 mahesh bhatt threw a chappal at kangana ranaut %281%290


ఈ వ్యాఖ్యలకు "హైవే" సినిమాలో అలియాతో పాటు నటించిన రణ్ దీప్ హుడా స్పందిస్తూ అలియా నటనను ప్రశంసిస్తూనే కంగనను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.


"అలియా.. అప్పుడప్పుడూ నటిస్తూ ఎప్పుడూ బాధితురాలిగా నటించే వ్యక్తుల అభిప్రాయాలు, వారి విమర్శలు.. నీపై నీ పనిపై పడకుండా చూసుకుంటున్నందుకు నీకు కంగ్రాట్స్. ఇలాగే అద్బుతంగా నటిస్తూ ఉండు.." అంటూ ట్వీట్ చేశాడీ హీరో..


7 mahesh bhatt threw a chappal at kangana ranaut


9 mahesh bhatt threw a chappal at kangana ranaut


దీనికి కూడా రంగోలీ ట్వీట్ ద్వారా స్పందించింది. రణ్ దీప్ హుడాపై కూడా విమర్శల వర్షం గుప్పించింది. ఉంగ్లీ సినిమా షూటింగ్ సమయంలో అతడు కంగనను హింసించాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తనో ఫెయిలైన నటుడు అంటూ వివాదాస్పద కామెంట్లు చేసింది రంగోలీ.


"అలియా బేబీని వెనకేసుకురావడానికి నెపోటిజం గ్యాంగ్‌కే ధైర్యం చాలలేదు. నువ్వు ముందుకొచ్చావా? ఉంగ్లీ షూటింగ్ సమయంలో కంగనను నువ్వెంత బాధపెట్టావో నాకు తెలుసు. నువ్వు కరణ్ జోహర్ చెంచావని కూడా నాకు తెలుసు. కానీ అలియా లాంటివాళ్లు చెంచాగిరీ చేసి అయినా సక్సెస్ ఫుల్గా నిలిచారు. నీకు ఆ సక్సెస్ కూడా లేదు. నువ్వో పర్మనెంట్ ఫెయిల్యూర్ నటుడివి" అంటూ కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది.


ఇదంతా చూస్తుంటే కంగన సోదరి రంగోలీ ఏదో వివాదాన్ని రేపాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది చూసి మనకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ ఉండదు. ఎందుకంటే కరణ్ జోహర్ నుంచి హృతిక్ రోషన్ వరకూ ప్రతిఒక్కరినీ విమర్శించిన కంగన తన తోటి నటులతో సరిగ్గా వ్యవహరించదని.. చాలామంది ఇండస్ట్రీకి చెందినవారు చెప్పడం మనకు తెలిసిందే. వీరిద్దరినీ సపోర్ట్ చేసిన వారిపైనా వీరు విమర్శలు చేయడంతో వీరి మాటలను ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకుండా.. వారి మాటలకు విలువనివ్వకుండా తయారైంది.


ఇవి కూడా చదవండి.


RRR సినిమా కోసం.. తెలుగు భాషతో కుస్తీ పడుతున్న బాలీవుడ్ భామ..!


జ‌య‌ల‌లిత క‌థ‌, నా క‌థ ఒక‌టే.. కానీ మా స్వ‌భావాలే వేరు..!


నా దగ్గర అంత డబ్బు లేదు: శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు


Images : Twitter