Bigg Boss Telugu 3 : వరుణ్ సందేశ్ & శివజ్యోతి కారణంగా నామినేషన్స్ లోకి మొత్తం ఇంటిసభ్యులు

Bigg Boss Telugu 3 : వరుణ్ సందేశ్ & శివజ్యోతి కారణంగా నామినేషన్స్ లోకి మొత్తం ఇంటిసభ్యులు

బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3లో భాగంగా నిన్న జరిగిన నామినేషన్స్ పర్వం మొత్తం రసాభాసగా మారిపోయింది. ఈ కారణంగా బిగ్ బాస్ ఈ వారం మొత్తం ఇంటిసభ్యులందరూ నామినేట్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ పరిణామంతో ఇంటిసభ్యులకి నవ్వాలో లేక ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ముందుగా నామినేషన్స్ టాస్క్ లో  భాగంగా స్విమ్మింగ్ పూల్ ఏరియా లో ఏర్పాటు చేసిన బౌల్ లో ఉన్న చీటీలని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎవరికి ఏ సంఖ్య వస్తే వారు ఆ నంబర్ దగ్గర నిలబడాల్సి ఉంటుంది. అయితే 1 నుండి 3 క్రమ సంఖ్య వరకు ఉన్నవారు తప్ప మిగిలిన వారు ఈ వారం నామినేషన్స్ లోకి వెళతారు అని బిగ్ బాస్ ప్రకటించారు.

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

ఈ ప్రకటనతో నామినేషన్స్ పర్వంలో అసలు ట్విస్ట్ మొదలైంది. దీనితో 4,5,6 & 7 స్థానాల్లో ఉన్న అలీ రెజా, శివజ్యోతి, వితిక,  శ్రీముఖి లు తాము మొదటి మూడు స్థానాల్లో ఎందుకు ఉండాలనుకుంటున్నామో అని చెబుతూ వారి వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ టాస్క్ మొదలయ్యే తరుణంలో శ్రీముఖి బౌల్ లో ఉన్న చీటీ తీసి బాబా భాస్కర్ కి అందించింది. ఆ చీటీ లో 1 నెంబర్ రావడంతో అందరు షాక్ కి గురయ్యారు. శ్రీముఖికి ఏడో నంబర్ రావడంతో అందరూ మరింత ఆశ్చర్యపోయారు. కానీ ఆఖరులో శ్రీముఖి అడగగానే బాబా భాస్కర్ తన స్థానాన్ని ఆమెకి ఇచ్చేసి 7వ నంబర్ దగ్గరికి వెళ్ళిపోయాడు.

అయితే అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్ - శ్రీముఖి, వరుణ్ సందేశ్ (varun sandesh) - శివజ్యోతి (shiva jyothi) , శివజ్యోతి - వితిక ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మూడు జంటలు మొదటి మూడు స్థానాల కోసం తమ వాదనలు బలంగా వినిపించడం జరిగింది. ఈ మూడింటిలో కూడా వరుణ్ సందేశ్, శివజ్యోతి ల మధ్య జరిగిన మాటల యుద్ధం అయితే ఈ ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.

మూడో స్థానంలో ఉన్న వరుణ్ తన స్థానాన్ని శివజ్యోతికి ఇవ్వకుండా వితిక కి ఇచ్చి ఆరో స్థానానికి మారడం గొడవకు దారి తీసింది. భార్యాభర్తలుగా మీరు ఈ షోకి రావడం వాళ్ళ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు, మరి మిగతా వారికి ఆ సౌలభ్యం లేకపోవడం సరి కాదు అని శివజ్యోతి చెప్పగా.. ఈ విషయాన్నీ బిగ్ బాస్ వారిని అడగమని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.. అంతే కాదు.. నువ్వు, వితిక ఒకే స్థాయిలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో కొద్దిగా తేడా ఏంటంటే వితిక మెడాలియన్ గెల్చుకోవడమే అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇదే కాకుండా వితిక తన భార్య కాబట్టే తన స్థానాన్ని ఇచ్చాను అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. దీనికి శివజ్యోతి అభ్యంతరం వ్యక్తం చేయడంతో .. నామినేషన్స్ ప్రక్రియ మొత్తం రసాభాసగా మారిపోయింది.

Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా?

శివజ్యోతి చేస్తున్న వాదనలో అర్ధం లేదంటూ.. కచ్చితంగా వితికని ఎలాగైనా నామినేషన్స్ లోకి తీసుకెళ్ళాలి అనుకుంటూ ఇలా చేస్తోంది అంటూ వరుణ్ సందేశ్ ఆరోపించాడు. అలాగే వితిక ఉన్న స్థానంలోనే శివజ్యోతి కూడా నిలబడితే తాను కూడా అలీ రెజా ఉన్న రెండో స్థానంలోనే నిలబడతాను అంటూ చెప్పి అక్కడే నిలబడ్డాడు.

వీరి వాదనలు చూసాక.. ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఎవరు ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించుకోని కారణంగా మొత్తం ఇంటిసభ్యులందరూ ఈ వారం నామినేషన్స్ లో ఉంటున్నట్టుగా ప్రకటన వెలువడింది. దీనితో ఈ వారం ఓటింగ్ చాలా కీలకం కానుంది. ఎందుకంటే దాదాపు ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతో కూడా ఎవరైనా ఎలిమినేట్ అవ్వొచ్చు. దీనితో ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఇంటిసభ్యులని కలిసేందుకు తమ ఇంటి వారు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబందించిన ప్రోమో కూడా నిన్నటి ఎపిసోడ్ తరువాత ప్రసారమైంది. హోటల్ టాస్క్ లో భాగంగా పనిచేస్తున్న ఇంటి సభ్యులను ఫ్రీజ్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఇంట్లోకి అడుగుపెడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరైనా సభ్యుల ఫ్యామిలీకి చెందిన వారా? లేక  స్పెషల్ గెస్ట్ అన్న విషయం ఈ రోజు ఎపిసోడ్ లో కనిపించే అవకాశం స్పష్టంగా ఉంది. చూడాలి ఈ రెండిటిలో ఏది నిజమవుతుందో.

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్ & వితిక