ADVERTISEMENT
home / వినోదం
జక్కన్న తీసిన 12 చిత్రాలలో ఉన్న.. 12 వైవిధ్యాలు మీకు తెలుసా?!

జక్కన్న తీసిన 12 చిత్రాలలో ఉన్న.. 12 వైవిధ్యాలు మీకు తెలుసా?!

తెలుగు చిత్ర పరిశ్రమ పేరుతో పాటు.. దాని స్థాయిని కూడా ప్రపంచవ్యాప్తం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). ఆయన దర్శకుడిగా మారిన 2001 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు మొత్తం 12 చిత్రాలకి (RRR చిత్రంతో కలిపి) ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. మరి ఆ 12 చిత్రాల్లో 12 వైవిధ్యమైన అంశాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం

* స్టూడెంట్ నెం 1

అప్పటివరకు సీరియల్ దర్శకుడిగా ఉన్న రాజమౌళి… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఇది. ఇక 2001లో ఈ చిత్రం ద్వారానే అటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా & ఇటు దర్శకుడిగా రాజమౌళి నిలదొక్కుకున్నారు. ఈ ఇద్దరి సినీ కెరీర్‌కి స్టూడెంట్ నెం 1 ఒక మైలురాయి అని చెప్పొచ్చు.

* సింహాద్రి

ADVERTISEMENT

మొదటి కలయికలో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ & రాజమౌళిలు మరలా ఈ చిత్రం ద్వారా జట్టు కట్టడం జరిగింది. మొదటి సారి ఈ ఇద్దరు సూపర్ హిట్ అందుకుంటే, రెండవ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడం విశేషం.

దర్శక ధీరుడు రాజమౌళి – రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

* సై

ఇక సై చిత్రం విషయానికి వస్తే, మొదటిసారిగా తెలుగు తెరమీద రగ్బీ ఆట నేపథ్యంలో వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా చాలా స్టైలిష్‌గా ఉండడంతో పాటు తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని రగ్బీ ఆటని ఆకట్టుకునే విధంగా పరిచయం చేయడం విశేషం. ఈ సినిమాలో రగ్బీ ఆట అనేది ఓ వైవిధ్యమైన అంశం.

ADVERTISEMENT

* ఛత్రపతి

ప్రభాస్, రాజమౌళిల కలయిక వెండితెర పైన ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అలాంటి వారి కలయికకి మొదటి మెట్టుగా నిలిచిన చిత్రం ఛత్రపతి. ఈ చిత్రానికి సంబంధించిన వైవిధ్యమైన అంశమేమిటంటే – ఈ సినిమా ద్వారా ప్రభాస్‌కి ఎనలేని స్టార్ డమ్ వచ్చింది. ఆ స్టార్ డమ్‌కి సమాధానంగా.. ఆయన తరువాత సంవత్సరాలలో ఎంతటి ఘన విజయం సొంతం చేసుకున్నారో తెలిసిన అంశమే కదా.

* విక్రమార్కుడు

రాజమౌళి చిత్రాలలో పోలీసు స్టోరీ కథాంశంగా వచ్చిన ఏకైక చిత్రం ఇదే. మాస్ మహారాజ రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించిన ఈ చిత్రంలో అటు ఎంటర్టైన్మెంట్ పరంగానే కాకుండా.. ఇటు పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కూడా రవితేజ మెప్పించాడు. అయితే ఈ సినిమాలో ఆసక్తి కలిగించే వైవిధ్యమైన అంశమే “విక్రమ్ సింగ్ రాథోడ్” అనే పోలీస్ పాత్ర

ADVERTISEMENT

* యమదొంగ

రాజమౌళి కెరీర్‌లో తీసిన ఏకైక సోషియో – ఫాంటసీ చిత్రం ఈ “యమదొంగ”. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. తన తాతగారైన ఎన్టీ రామారావు గారిని ఇమిటేట్ చేసిన అభినయం అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి ఈ చిత్రంలో వైవిధ్యంగా అనిపించే అంశం సోషియో ఫాంటసీ. ఈ చిత్రం కూడా రాజమౌళి మిగతా చిత్రాల మాదిరిగానే సూపర్ హిట్ అయింది.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి ‘RRR’ టైటిల్‌కి.. ఫుల్ ఫామ్ ఫిక్స్ అయిందట!

* మగధీర

ADVERTISEMENT

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ వైపు మొదటిసారిగా దేశీయ స్థాయిలో అందరి చూపుని తిప్పుకునేలా చేసేందుకు ఈ మగధీర చిత్రం ఉపయోగపడింది. అప్పటివరకు ఉన్న బడ్జెట్స్ పరంగా కూడా అత్యంత ఎక్కువగా వెచ్చించిన చిత్రంగా రికార్డులు నమోదు చేయడంతో పాటుగా.. అదే స్థాయిలో లాభాలు కూడా తెచ్చి పెట్టిన చిత్రం “మగధీర”. ఈ చిత్రం తెలుగుచిత్ర పరిశ్రమ పరంగా ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పాలి.

* మర్యాద రామన్న

సునీ‌ల్‌ని హీరోగా పెట్టి రాజమౌళి వంటి అగ్రదర్శకుడు ఒక చిత్రం తీయడం విశేషం. అలాగే “మగధీర” వంటి ఒక ఇండస్ట్రీ హిట్ సాధించాక సునీల్ వంటి హాస్యనటుడిని హీరోగా పెట్టి సినిమా తీయడమే వైవిధ్యమైన అంశం. ఈ సినిమా సునీల్‌కి స్టార్ హీరోగా స్టేటస్ అందిస్తే.. రాజమౌళికి దర్శక ధీరుడు అనే బిరుదుని తెచ్చిపెట్టింది.

* ఈగ

ADVERTISEMENT

చిత్రపరిశ్రమలో ఉన్న హీరోలు & కమెడియన్‌తో హిట్స్ సాధించిన తరువాత.. ఎవ్వరూ కూడా ఊహించని విధంగా “ఈగ” చిత్రంతో ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించాడు రాజమౌళి . ఒక కీటకం అయిన ఈగని హీరోగా పెట్టి సినిమా తీయడం అతిపెద్ద వైవిధ్యమైన అంశం.

* బాహుబలి – ది బిగినింగ్

బాహుబలి అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ చిత్రానికి సంబంధించిన వైవిధ్యమైన అంశం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన నటీనటులతో దేశీయ & అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకోవడం ఈ చిత్రానికే చెల్లింది. ఈ చిత్రం ఇచ్చిన విజయం.. రెండవ భాగం పై అందరిలో ఆసక్తిని పెంచగలిగింది.

* బాహుబలి – ది కంక్లూజన్

ADVERTISEMENT

బాహుబలి సీరిస్‌‌లో రెండవ భాగంగా వచ్చిన ఈ చిత్రం.. అభిమానుల అంచనాలని అందుకోగలిగింది. అదే సమయంలో ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్స్ అయిన చైనా వంటి దేశాల్లో కూడా కోట్లు కొల్లగొట్టగలిగింది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా.. సరైన కథ ఉంటే ఎంతటి బడ్జెట్ అయినా తిరిగిరాబట్టవచ్చు అనే విషయం నిర్ధారణ అయింది. ఈ సినిమాకి సంబంధించి వైవిధ్యమైన అంశమే వసూళ్లు.

* ఆర్ఆర్ఆర్

ఇక ప్రస్తుతం నిజ జీవితంలో ఎందరికో స్ఫూర్తిదాతలు & పోరాట యోధులు అయిన అల్లూరి సీతారామరాజు & కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా ఒక కాల్పనిక గాధని చిత్రీకరించాలనుకోవడమే ఈ సినిమా వైవిధ్యత. రామ్ చరణ్‌ని అల్లూరి సీతారామ రాజుగా & ఎన్టీఆర్‌ని కొమరం భీమ్ గా తెరమీద చూపెట్టే ప్రయత్నమే ఈ ఆర్.ఆర్.ఆర్ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2021 లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. “బాహుబలి” చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న రాజమౌళి ఈ చిత్రం ద్వారా దానిని సుస్థిరం చేసుకుంటాడని ఆశిద్దాం.

ఇవి రాజమౌళి అలియాస్ జక్కన్న చిత్రాల సమహారంలోని ముఖ్యమైన విషయాలు.. అలాగే వాటిల్లో ఉండే వైవిధ్యమైన అంశాలు. 

ADVERTISEMENT

రామ్‌చరణ్ – ఉపాసనల.. ప్రేమ బంధం వెనుక ఉన్న అసలు వ్యక్తి గురించి తెలుసుకుందామా?

10 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT