కుటుంబ సభ్యులను పంపి ఇంటి సభ్యులను సర్ ప్రైజ్ చేస్తున్న బిగ్ బాస్..

కుటుంబ సభ్యులను పంపి ఇంటి సభ్యులను సర్ ప్రైజ్ చేస్తున్న బిగ్ బాస్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (bigg boss telugu) లో భాగంగా 13వ వారం హౌస్ మేట్స్ గొడవతో ప్రారంభమైనా ఈ వారంలో అద్భుతమైన సర్ ప్రైజ్ ని అందించాడు బిగ్ బాస్. ఈ సీజన్ లో ఇంటి సభ్యుల తాలూకా కుటుంబసభ్యులని వారికి చూపెట్టడం & అందులో కేవలం ఇద్దరికే మాత్రం ఇంటిలో ఉన్న వారిని కలిసే అవకాశం ఇవ్వడంతో మిగిలిన ఇంటి సభ్యులంతా చాలా నిరుత్సాహపడ్డారు.

Bigg Boss Telugu 3 : వరుణ్ సందేశ్ & శివజ్యోతి కారణంగా నామినేషన్స్ లోకి మొత్తం ఇంటిసభ్యులు

ఇక మరో రెండు వారాల్లో ఈ సీజన్ ముగియనుండడంతో.. బిగ్ బాస్ హౌస్ లోకి కుటుంబసభ్యుల ఎంట్రీ ఉండదు అనే భావానికి అటు బిగ్ బాస్ హౌస్ మేట్స్ & ఇటు షో చూస్తున్న ప్రేక్షకులు కూడా వచ్చేశారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ అందరికి ట్విస్ట్ ఇస్తూ.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తాలూకా కుటుంబసభ్యులని పంపించడం మొదలుపెట్టారు. నిన్నటి ఎపిసోడ్ లో వితిక చెల్లెలు & అలీ రెజా భార్య ఇంటిలోకి ప్రవేశించడం జరిగింది.

ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రసారమైన ప్రోమో లో శివజ్యోతి భర్త గంగూలీ ఇంటిలోకి రావడం జరిగింది. ఇక మిగతా నలుగురు ఇంటి సభ్యులకి సంబందించిన కుటుంబ సభ్యులు కూడా ఇంటిలోకి ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో రావడం జరుగుతుంది. దాదాపు 85 రోజులకి పైగా తమ వారిని చూడకుండా & మాట్లాడకుండా ఉండి ఒక్కసారిగా ఇలా వారు తమ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ఇంటిసభ్యులంతా తమ ఆనందాన్ని ఆనందబాష్పాలలో చూపెడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఇంటి సభ్యుల రియాక్షన్ చూసిన మనం ఇక మిగిలిన నలుగురు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.

నిన్న ఇంటిసభ్యులంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా లో ఉన్న సమయంలో వితిక చెల్లెలు రితిక ఇంటిలోకి ప్రవేశించింది. అయితే వితిక చెల్లెలు రావడంతో వితిక తో పాటుగా వరుణ్ సందేశ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. కొద్దిసేపు ఇంటిలో అందరితో మాట్లాడిన తర్వాత వితికకి వచ్చిన మెడాలియన్ ని చూసి ఆ తర్వాత ఇంటి సభ్యులకి వీడ్కోలు పలికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇంటిలోకి అడుగుపెట్టింది అలీ రెజా భార్య మాసుమా.. అయితే ఆమె ఇంటిలోకి ప్రవేశించే సమయంలో ఇంటిలోని వారంతా కూడా స్లీప్ డ్రిల్ల్ లో ఉండడంతో అందరూ కళ్ళు మూసుకుని ఉన్నారు. ఆమె నేరుగా అలీ రెజా వద్దకి వచ్చి అతన్ని పట్టుకున్నది కూడా ఇంటిలో వారికి తెలియదు. వారి రియాక్షన్స్ అనేవి ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

ఇదిలావుండగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి నిన్న బిగ్ బాస్ హోటల్ అనే టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ లో భాగంగా వరుణ్ సందేశ్ హోటల్ మేనేజర్ గా బాబా భాస్కర్ , శ్రీముఖి, వితిక కిచెన్ సూపర్ వైజర్లు గా & శివజ్యోతి, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్ లు క్లీనింగ్ సెక్షన్ లో పని చేస్తారని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది.

దీనితో వీరు బిగ్ బాస్ హోటల్ కి ఒకపుడున్న పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలి. అలాగే ఇంటికి వచ్చే అతిథుల కోసం అన్నిరకాల సౌకర్యాలు వారికి అందించాల్సి ఉంటుంది. అలాగే ఈ టాస్క్ జరిగే సమయంలో ఫైర్ డ్రిల్, ఎమర్జెన్సీ డ్రిల్, స్లీపింగ్ టైం వంటివి కూడా జత చేయడంతో ఇంటిసభ్యులు చేసే పనులు చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి బయట నుండి కుటుంబసభ్యులు రావడం పూర్తయ్యే వరకు ఈ టాస్క్ కొనసాగుతుంది. అయితే ఈ టాస్క్ లో ఫన్ తో పాటుగా ఎమోషనల్ బాండింగ్ కూడా మిళితమై ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ టాస్క్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మరి ఈరోజు ఎపిసోడ్ ఫన్ & ఎమోషన్ కలిసిపోయి ఎలా ఉండబోతుందో అనేది తెలియాలంటే మిస్ అవ్వకుండా ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా?