చిన్నప్పుడు శానిటరీ న్యాప్కిన్ గురించి.. ఇలా సిల్లీగా ఆలోచించేవాళ్లం..!

చిన్నప్పుడు శానిటరీ న్యాప్కిన్ గురించి.. ఇలా సిల్లీగా ఆలోచించేవాళ్లం..!

ఇప్పుడంటే శానిటరీ న్యాప్కిన్లు మనకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి కానీ.. మన చిన్నప్పుడు ఇవంటే ఏంటో కొంతమందికి తప్ప మిగిలినవారికి పెద్దగా తెలీదు. నా చిన్నప్పుడు అంటే నేను ఏడో, ఎనిమిదో చదువుతున్నప్పుడు శానిటరీ న్యాప్కిన్ల గురించి టీవీల్లో యాడ్స్ వచ్చేవి. అప్పట్లో కోటెక్స్, స్టేఫ్రీ యాడ్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే వాటిని రూపొందించిన విధానం మాకు అర్థం కాకపోవడం వల్ల లేదంటే వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్లనో.. వాటి గురించి మేం రకరకాలుగా మాట్లాడుకొనేవాళ్లం. అవి ఇప్పుడు తలచుకొంటే.. చాలా నవ్వు వస్తుంది. అలా ఎలా ఆలోచించాం అనిపిస్తుంది.


1. అప్పట్లో శానిటరీ న్యాప్కిన్(sanitary napkin) యాడ్స్ లో నీలం రంగులోని నీటి చుక్క ప్యాడ్ మీద పడితే దాన్ని వెంటనే పీల్చుకొంటున్నట్టుగా చూపించేవారు. ఇప్పటికీ అలాగే చూపిస్తున్నారనుకోండి. దాన్ని చూసి మేం అనుకొనేవాళ్లమంటే.. ‘టీచర్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. టాయిలెట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు’ అని. ఈ కారణం చెప్పి వాటిని కొనివ్వమని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.


1-sanitary-napkin


Also Read: పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు.. ఎలాంటి అపోహలుంటాయో మీకు తెలుసా?


2. ఆ రోజుల్లో మేమింకా లెక్కలు చేయడానికి, చదివింది ఓసారి రాసుకోవడానికి పలకలు ఉపయోగించేవాళ్లం. అప్పుడైతే పేపర్లు ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం రాదు కదా. అప్పుడే.. మా అక్క ఒకరు ఈ న్యాప్కిన్స్ ప్యాకెట్ తీసుకొచ్చారు. వాటిని చూడటం అదే మొదటిసారాయే. అప్పట్లో వాటి గురించి మాట్లాడటం కూడా తక్కువే. మా పోరు పడలేక మా అక్క వాటిని చూపించింది. వాటిని చూడగానే మేం ఏమనుకొన్నామో తెలుసా? దీంతో తుడిస్తే పలక చాలా నీట్ గా తయారైపోతుందని.


3. మొదటిసారి శానిటరీ న్యాప్కిన్ చూసినప్పుడు మాకు వచ్చిన ఇంకో ఆలోచన ఏంటంటే.. దీని వెనక ఉన్న ర్యాపర్ తీసేసి గోడకు అతికించుకోవచ్చు. డెకరేటివ్ పీస్ లాగా.(అబ్బా ఇది గుర్తుకొస్తే ఇలా ఎలా అనుకొన్నామబ్బా అనిపిస్తుంది)


4. తెలుపు రంగు డ్రస్ వేసుకొన్నప్పుడే ప్యాడ్ వాడాలి. అది రూల్. బహుశా కమర్షియల్ యాడ్స్ ప్రభావం వల్లేమో.. మా ఆలోచనలు అలా ఉండేవి. వైట్ వైట్ మ్యాచింగ్ కాబట్టి.. ఏ కలర్ డ్రస్ కి ఆ కలర్ కోటెక్స్ దొరుకుతుంది. ఇలా ఉండేవి మా మాటలు.


2-sanitary-napkin


5. పీరియడ్స్ గురించి తెలిసిన తర్వాత, శానిటరీ న్యాప్కిన్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత, అసలు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన తర్వాత ఈ విషయంలో పూర్తిగా మా ఆలోచనలు మారిపోయాయి. ‘ఛీ.. ఛీ.. సిగ్గు లేకుండా యాడ్స్ లో ఎలా యాక్ట్ చేస్తున్నారో కదా..’ అని అనుకొనేవాళ్లం. నెలసరి మొదలైన తర్వాత.. దీని గురించి  ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరితోనూ చెప్పకూడదు.. అని నూరిపోయడం వల్ల వచ్చిన మాటలవి.


Also Read: Period Tracker.. పీరియడ్స్ గురించి ఏం చెబుతుందో తెలుసా?


ఆ వయసులో మాకు పీరియడ్స్ అంటే సరైన అవగాహన లేకపోవడం, శానిటరీ న్యాప్కిన్ ఉపయోగించడం తెలియకపోవడం వల్ల మేం ఇలా అనుకొనేవాళ్లం. ఇప్పుడు వాటిని తలుచుకొంటే బాగా నవ్వొస్తుంది.


Also Read: నెల‌స‌రి స‌మ‌యంలో క‌ల‌యిక.. ఆరోగ్యానికి మంచిదేనా?


పీరియడ్స్ గురించి తెలుసుకొన్న తర్వాత దాని గురించి మాట్లాడటం తప్పేమీ కాదని తెలిసింది. అప్పట్లో గవర్నమెంట్ స్కూళ్లలో వీటిపై ప్రత్యేకంగా అవగాహనా తరగతులు నిర్వహించేవారు. అవి జరిగిన తర్వాత మా ఆలోచనల్లో పూర్తిగా మార్పు వచ్చింది. పీరియడ్స్ సమయంలో పాటించాల్సిన శుభ్రతతో పాటు ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలిసింది. అలాగే శానిటరీ న్యాప్కిన్ ఎందుకు ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలిసింది.


Featured Image: Pixabay.com


Gifs: Giphy


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కథనాలు చదవచ్చు.