మన జీవిత భాగస్వామితో సాగించే జీవన ప్రయాణం సాఫీగా సాగిపోవాలన్నా.. అనుబంధం దృఢంగా ఉండాలన్నా.. శృంగారం (Sex) అవసరం ఎంత వరకు ఉంటుంది? రిలేషన్ షిప్‌లో దానికి అంత ప్రాముఖ్యత ఉందా? అంటే ఉందనే చెప్పాలి. భాగస్వామిపై మీ ప్రేమను తెలియజేయడానికి ఇది కూడా ఓ మార్గం. అయితే ఈ విషయంలో మహిళల ఆలోచన ఏ విధంగా ఉంది? అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవడానికి మేం ఐదుగురు మహిళల్ని ప్రశ్నించాం. వారు తమ దైనందిన జీవితంలో శృంగారం ఎంత ముఖ్యమో మాకు వివరించారు. వారేం చెప్పారో తెలుసుకుందామా..?
1. అదొక్కటే ముఖ్యం కాదు..
అనుబంధం మరింత దృఢంగా మారడానికి శృంగారం అవసరమే. కానీ అదొక్కటే ముఖ్యం కాదు. ఒకరిపై ఒకరికి ఎంత ఇష్టం ఉందో సెక్స్ ద్వారా తెలియజేయవచ్చు. మీరు అతని సాంగత్యాన్ని ఎంతగా కోరుకొంటున్నారో అతనికి చెప్పొచ్చు. రిలేషన్ షిప్‌లో సెక్స్ ఒక భాగంగా ఉండాలి. కానీ సెక్స్ కోసం బంధాన్ని కొనసాగించాలనుకొంటే మాత్రం అది మంచిది కాదు.
2. ఆరోగ్యకరమైన బంధానికి పునాది
అనుబంధం బలంగా ఉండటానికి అవసరమైన వాటిలో సెక్స్ కూడా ముఖ్యమైనది. మానసిక బంధం ఎంత ముఖ్యమైనదో.. శారీరక అనుబంధం కూడా అంతే ముఖ్యమైనది. అప్పుడే ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ ఉంటుంది. అలాగని బంధం నిలబెట్టుకోవడానికి పూర్తిగా సెక్స్ పైనే ఆధారపడితే మొదటికే మోసం వస్తుంది. సెక్స్ మన శారీరక అవసరం. కాబట్టి దానికి కూడా ప్రాధాన్యమివ్వడం ముఖ్యం.
Also Read: కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృదయమే.. ఇవి అతనికి నచ్చే ప్రేమలేఖలు..
3. భావోద్వేగపరంగా ఒక్కటిగా ఉండగలుగుతాం..
సెక్స్ శారీరక అవసరాన్ని తీర్చడం మాత్రమే కాకుండా.. భార్యాభర్తల మధ్య మానసికంగా, భావోద్వేగపరంగా అనుబంధాన్ని మరింత బలంగా మార్చేస్తుంది. ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా మార్చేసే అద్బుతమైన సాధనం. అంతేకాదు.. భాగస్వామి గురించి మీకు తెలియజేస్తుంది. అలాగే.. శృంగారాన్ని ఆస్వాదించే దంపతులు.. మానసికంగా, భావోద్వేగపరంగా కూడా ఒక్కటిగానే ఉండగలుగుతారు.
4. ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది
సెక్స్ అసలు పెద్ద విషయంగా పరిగణించని రోజుల్లో మనం ఉన్నాం. కానీ మానసికంగా కనెక్టయిన వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే ఆ అనుభవం మరింత ఆనందాన్నిస్తుంది. అందుకే మీ పార్టనర్‌తో మీకు శృంగారం అవసరం. అంతేకాదు.. దీని ద్వారా ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది.
Also Read: ఈ తొలిరేయి జ్ఞాపకాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..
5. సానుకూల ప్రయోజనాలున్నాయి
శృంగారం వల్ల చాలా సానుకూల ప్రయోజనాలున్నాయి. వాటి గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడం ద్వారా మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు. మీది దీర్ఘకాలంగా కొనసాగుతోన్న బంధం అయినా.. అప్పుడే మొదలైనదైనా సరే.. అది మరింత మనోహరంగా ఉండాలంటే సెక్స్ తప్పనిసరి. ఎందుకంటే.. మీ గురించి మీ భాగస్వామికి, అతని గురించి మీకు దీని ద్వారా బాగా అర్థమవుతుంది. ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ప్రేమ లేకపోయినా.. అది కూడా తెలిసిపోతుంది.
Also Read: మీ బాయ్ ఫ్రెండ్ కలలోకి వస్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??