బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం సాహో (Saaho). దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి సినిమా కోసం తనను తాను మార్చుకొంటూ.. డిఫరెంట్ లుక్‌లో కనిపించే ప్రభాస్ సాహోలో కూడా సరికొత్తగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో సాహో సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..
1. సాహో దర్శకుడు సుజిత్‌కు ఇది రెండో సినిమా. మొదటి సినిమా చాలా తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేసిన సుజిత్ రెండో సినిమాను చాలా భారీగానే ప్లాన్ చేశాడు. బాహుబలి సినిమా కంటే ముందే ప్రభాస్‌కు ఈ కథ వివరించాడు సుజిత్. కానీ బాహుబలి షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉండటంతో.. అతని కోసం దాదాపు ఐదేళ్లు నిరీక్షించాడు. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసుండొచ్చు. కానీ సుజిత్ అలా చేయలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో తన కథకు సైతం భారీ హంగులు అద్దాడు. యువీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లో అవకాశం రావడమే గొప్పనుకొంటే.. వరుసగా రెండు సినిమాలు చేయడం మరో విశేషంగానే చెప్పుకోవాలి.
2. సాహో సినిమాలో అది పెద్ద ఛేజింగ్ సీన్ ఉందట. దీని నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద దీన్ని చిత్రీకరించారు.
3. సాధారణంగా యాక్షన్ సన్నివేశాలంటే హీరోలకు బాడీ డబుల్స్ ఉంటారు. అదేనండీ డూప్. కానీ ఈ సినిమాలో ప్రభాస్ బాడీ డబుల్ లేకుండానే నటించాడు. అంటే స్టంట్స్ అన్నీ స్వయంగా తనే చేశాడన్నమాట.
4. సాహోలో నీటిలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించారు. దీని కోసమే ప్రభాస్ ప్రత్యేకంగా స్కూబా డైవ్ నేర్చుకొన్నారు.
5. సాహో సినిమాలో హీరోయిన్ శ్రద్ధ కపూర్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మీకు తెలియని విషయమేంటంటే.. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ మొదటి సారిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. అలాగే బాలీవుడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న జర్మన్ భామ ఎవిలిన్ శర్మ కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
6. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ విలన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు విలన్లున్నారంటనే అర్థమవుతుందిగా యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో.
7. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకే ఇండియా మొత్తం పరిచయం ఉన్న ప్రముఖ నటులందరినీ దీనిలో భాగం చేశారు. జాకీ ష్రాఫ్, చంకీపాండే, అరుణ్ విజయ్, మహేశ్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, ఎవ్లీన్ శర్మ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.
8. సాహో సినిమాకు తొలుత శంకర్-ఎహసాన్-లాయ్ సంగీత దర్శకత్వం వహించనున్నారని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ ఏడాదిన్నర తర్వాత వీరు సంగీత దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. సినిమా విడుదల కావడానికి రెండున్నర నెలల ముందు ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
9. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రెండు మేకింగ్ వీడియోలు, రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ రెండింటినీ చూస్తే సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందనిపించడం గ్యారంటీ.
10. మేకింగ్ వీడియోలకు సంబంధించి మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. తొలి వీడియోకు నేపథ్య సంగీతాన్ని తమన్ అందించగా, రెండో దానికి జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
11. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సినిమా విడుదలకు రెండున్నర నెలలే ఉన్నప్పటికీ పాటల చిత్రీకరణ పూర్తి కాలేదు. అసలు ట్యూన్సే ఇంకా సిద్ధం కాలేదు. శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకోవడంతో ఈ ట్యూన్స్ ఎవరు చేస్తారనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
12. రెండో మేకింగ్ వీడియోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన జిబ్రాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోనున్నారని సమాచారం. సుజిత్ మొదటి సినిమా రన్ రాజా రన్‌కు జిబ్రానే మ్యూజిక్ అందించారు. కమల్ హాసన్‌తో వరుసగా మూడు సినిమాలకు పనిచేసిన ఘనత జిబ్రాన్‌ది. లోకనాయకుడినే మెప్పించాడంటే అతని ప్రతిభ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
13. రూ. 150 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 300 కోట్లకు అమ్ముడుపోయాయట. బాహుబలి తర్వాత ఇంత పెద్ద బిజినెస్ చేసిన సినిమా ఇదేనట.
14. ఈ సినిమా టీజర్ విడుదల చేసిన రెండేళ్ల తర్వాత సినిమా విడుదల కావడం విశేషం.
ఇన్ని విశేషాలున్న సినిమా తెరపై ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే.. ఈ ఏడాది ఆగస్ట్ 15 వరకు ఎదురుచూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంపై… స్పెషల్ ఫోటో ఫీచర్..!
ప్రభాస్ అభిమానులకు పండగే.. సాహో రిలీజ్ డేట్ తెలిసిపోయిందిగా..?
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.