వ‌చ్చే తొమ్మిది నెల‌ల‌ వ‌ర‌కూ ఇంతే.. అంటోన్న‌ ప‌రిణీతి చోప్రా..!

వ‌చ్చే తొమ్మిది నెల‌ల‌ వ‌ర‌కూ ఇంతే.. అంటోన్న‌ ప‌రిణీతి చోప్రా..!

సైనా నెహ్వాల్ (saina nehwal) బ‌యోపిక్ కోసం కొన్ని నెల‌ల పాటు శ్ర‌ద్ధా క‌పూర్ ఎంతో ప్రిపేరైంది. సినిమాలో న‌టించేందుకు సైనా ద‌గ్గ‌ర టిప్స్ తీసుకోవ‌డం, త‌న మ్యాన‌రిజంల‌ను గ‌మ‌నించడం వంటివెన్నో చేసింది. అయితే గ‌త నెల‌లో వూహించ‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. సైనా బ‌యోపిక్‌లో శ్ర‌ద్ధా క‌పూర్ బ‌దులుగా ప‌రిణీతి చోప్రా (Parineeti chopra)ను ఎంపిక చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు. శ్ర‌ద్ధా క‌పూర్ డెంగ్యూ వ‌ల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప‌రిణీతితో కొన్ని నెల‌ల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం తానెంతో క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెబుతోంది ప‌రిణీతి.


సైనా నెహ్వాల్ చిత్రంలో ఎంపికైన‌ప్ప‌టి నుంచి త‌న ఫిట్‌నెస్‌పై మ‌రింత దృష్టి పెట్టింది ప‌రిణీతి. ఇటు జిమ్‌లో ఎక్కువ గంట‌లు గ‌డ‌ప‌డంతో పాటు అటు బ్యాడ్మింట‌న్‌ కోర్ట్‌లోనూ చెమ‌టోడుస్తోంద‌ట‌. దీని గురించి చెబుతూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నేను ఉద‌యం ఐదు గంట‌లకే లేస్తున్నా. జిమ్‌లో క‌స‌ర‌త్తుల త‌ర్వాత ఉద‌యం ఆరు గంట‌ల‌కే నా ప్రాక్టీస్ ప్రారంభ‌మ‌వుతోంది. ఎనిమిది గంట‌ల వ‌ర‌కూ బ్యాడ్మింట‌న్ ఆడుతున్నా. ఎలాగైనా స‌రే.. సైనా పాత్ర‌కు న్యాయం చేయాల‌న్న‌దే నా లక్ష్యం. త‌న పాత్ర‌లో ఇమిడిపోయి.. అభిమానుల‌కు త‌న‌లా క‌నిపించాల‌న్న‌దే నా కోరిక‌. అందుకే ఈ సినిమా చేయ‌డానికి కాస్త భ‌యంగా ఉన్నా.. ఎంతో ఉత్సాహంగా కూడా అనిపిస్తోంది.. అని చెప్పింది. అంతేకాదు.. ఉద‌యం ప్రాక్టీస్.. సాయంత్రం షూటింగ్‌తో బిజీగా గ‌డుపుతోన్న ఈ భామ మ‌రో తొమ్మిది నెల‌లు త‌న లైఫ్‌స్టైల్ ఇదే విధంగా ఉండ‌బోతోంద‌ని, సైనా బ‌యోపిక్ పూర్తయ్యే వ‌ర‌కూ ట్రైనింగ్ ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పుకొచ్చింది.


12292675 1499103947057595 1265866254 n 5247711


అంతేకాదు.. నేను బ్యాడ్మింట‌న్ ఆడేట‌ప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కోర్ట్‌లో ఎవ‌రూ లేని స‌మ‌యానికే కోర్టును బుక్ చేసుకుంటున్నాం. ఉద‌యం ఆరు నుంచి ఎనిమిది వ‌ర‌కూ బ్యాడ్మింట‌న్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నా. గ‌త కొన్నేళ్ల‌లో నేను ఎన్నో ర‌కాల పాత్ర‌లు చేశాను. కానీ బ‌యోపిక్‌లో న‌టించ‌డం ఇదే మొద‌టిసారి. అదీ సైనా లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ క‌థ‌లో న‌టిస్తున్నా. అందుకే తన పాత్ర‌కు న్యాయం చేసేందుకు నా శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నా.. అంటోంది ప‌రిణీతి..!


సినిమా బృందం గురించి చెబుతూ.. ఈ సినిమా బృందం నాకు ఎంతో ప‌ర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అమోల్ గుప్తే స‌ర్, మిగిలిన బృందం నాకు కావాల్సిన ప్ర‌తి ఒక్క‌టీ నాకు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. నా ఒక్క‌దానికి శిక్ష‌ణ ఇచ్చేందుకు ఒక మంచి ఫిజియో, ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాతి క‌లిగిన ప్లేయ‌ర్లు.. ఇలా చాలామందిని ఏర్పాటు చేశారు. సైనా ఆట‌తీరును త‌ను ఆడిన మ్యాచ్‌లు చూసి తెలుసుకుంటున్నా. ఈ స‌మాచారాన్నంతా తెలుసుకొని దాన్ని తెర‌పై చూపించ‌డం ఎంతో అవ‌స‌రం అని చెప్పింది ప‌రిణీతి. ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.


అయితే ఇదొక్క సినిమా మాత్ర‌మే కాదు.. దీంతో పాటు మ‌రో సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉందీ తార‌. తాజాగా విడుద‌లైన కేస‌రి స‌క్సెస్‌తో ఆనందంగా ఉన్న ప‌రిణీతి.. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న జ‌బ్రియా జోడీ అనే సినిమాలోనూ న‌టిస్తోంది. ఉద‌యం సైనా చిత్రం కోసం ట్రైనింగ్‌, సాయంత్రం జ‌బ్రియా జోడీ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఈ బిజీ షెడ్యూల్లోనూ త‌న‌కంటూ కాస్త స‌మ‌యాన్ని కేటాయించుకోవడం మ‌ర్చిపోవ‌ట్లేదు ప‌రిణీతి. తాజాగా దుబాయ్‌లో ఉన్న త‌న స్నేహితురాలు సానియాని ప‌రిణీతి క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌రిణీతి కుమారుడు ఇజాన్‌తో దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ.


దీంతో పాటు న‌వ్వించే క్యాప్ష‌న్‌ని కూడా పెట్టింది. నా ప‌ని నుంచి దూరంగా పిన్ని డ్యూటీ నిర్వ‌హిస్తున్నా.. ముద్దుల ఇజాన్ ని చూస్తుంటే తినేయాల‌నిపిస్తోంది. కానీ ప్ర‌స్తుతానికి తను తిన‌డానికి నా చేయిని ఇచ్చేశాను. సానియా నీ కొడుకును నాతో పాటే ఉంచేసుకోనా ప్లీజ్‌.. అంటూ ఇజాన్ గురించి పోస్ట్ చేసిందీ బ్యూటీ.


మ‌రి, ప‌రిణీతి క‌ఠిన శిక్ష‌ణ‌కు ఫ‌లితం క‌నిపించి.. త‌ను సైనా బ‌యోపిక్‌లో అద్భుతంగా కనిపించాల‌ని కోరుకుందాం.


ఇవి కూడా చ‌ద‌వండి.


జ‌య‌ల‌లిత క‌థ‌, నా క‌థ ఒక‌టే.. కానీ మా స్వ‌భావాలే వేరు..!


న‌య‌న‌తార ఒక్క‌రే కాదు.. వీరంతా డ్యుయెల్‌ రోల్స్ లో అద‌ర‌గొట్టిన వారే..!


గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి ప‌రిచ‌య‌మైన‌ప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!


Images : Instagram.