ADVERTISEMENT
home / వినోదం
తెెలుగు వారి మనసును దోచిన  “గీత గోవిందం”.. బాలీవుడ్‌ని కూడా అలరిస్తుందా..?

తెెలుగు వారి మనసును దోచిన “గీత గోవిందం”.. బాలీవుడ్‌ని కూడా అలరిస్తుందా..?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – ఈ రౌడీ స్టార్ గురించి ప్ర​త్యేకంగా చెప్పేదేముంది? తెలుగు సినీప​రిశ్ర​మ​లోనే ఒక కొత్త ఒర​వ​డిని సృష్టించిన ఈత​రం క​థానాయ​కుడు. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే ధోర​ణి నుంచి.. ఎలాగైనా ఉండ​చ్చు అంటూ త​న విల​క్ష​ణ​మైన న​ట​న​తో చాటిచెప్పాడు. ముఖ్యంగా విజ​య్ గ​త ఏడాది మూడు చిత్రాల్లో న​టించ​గా ..వాటిలో రెండు బ్లాక్​బ​స్ట​ర్ హిట్స్​గా నిలిచాయి. దాంతో అతి త​క్కువ స​మ​యంలోనే స్టార్ ​డమ్ సంపాదించుకున్న హీరోగా చ​రిత్ర సృష్టించాడు.

2018లో విజ​య్ న​టించిన గీత గోవిందం & ట్యాక్సీవాలా  (Geetha Govindam & Taxiwaala) చిత్రాలు విడుదలకి ముందే  లీక్ అయ్యాయి. గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యాన​ర్​పై  నిర్మించిన ఈ రెండు చిత్రాలు రిలీజ్​కు ముందే లీక్ అవ్వ​డం.. టాలీవుడ్‌లో కాస్త సంచ​ల​నం సృష్టించిన వార్తనే చెప్పాలి.  

ఇలా విడుద​ల​కు ముందే కొన్ని స​మ​స్య​ల​ను ఎదుర్కొన్న ఈ చిత్రాలు కేవ​లం విజ​య్ దేవ​ర​కొండ కార​ణంగానే బాక్సాఫీస్ వ​ద్ద మంచి వ​సూళ్ల​ను రాబ​ట్ట​గ​లిగాయి. సిల్వ​ర్ స్క్రీన్​పై విజ​య్​కు ఉన్న చ​రిష్మాకు మంచి క​థ​లు కూడా తోడ​య్యేస​రికి ఏకంగా 2018 బ్లాక్​బ​స్ట​ర్స్ జాబితాలో చోటు సంపాదించేసుకున్నాయి.  

ఇక బాలీవుడ్‌లో ప్ర​స్తుతం రీమేక్ చిత్రాల ట్రెండ్ న​డుస్తోంది. ద​క్షిణాదిలో హిట్ అయిన సినిమాల​ను హిందీలో కూడా రీమేక్ చేసేందుకు బాగా ఆస​క్తి చూపిస్తున్నారు.  ఇందులో భాగంగా ఇప్ప​టికే కొన్ని సినిమాల​ను రీమేక్ చేయ​డం, అక్క​డ అవి హిట్ అవ్వ​డం కూడా జ​రిగింది.

ADVERTISEMENT

ఇటీవ​ల విడుద​లైన సింబా (Simbaa) చిత్ర​మే ఇందుకు తాజా ఉదాహ​ర​ణ. ​ఈ క్ర​మంలోనే విజ​య్ దేవ​ర​కొండ చిత్రాల​ను రీమేక్ చేసేందుకు కూడా అక్క​డి నిర్మాత​లు బాగా ఆస​క్తి చూపిస్తున్నారు. ఇప్ప​టికే విజయ్ న​టించిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేస్తుండగా.. అందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా, కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అలాగే గ​తేడాది విజయ్ నటించిన “గీత గోవిందం” చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో విజయ్ స్థానంలో హీరోగా షాహిద్ కపూర్ తమ్ముడైన హీరో ఇషాన్ ఖత్తర్ (Ishaan Khatter) నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. అలాగే ఈ సినిమాకి సంబంధించి నటి & దర్శకుడి ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. అసలు ఈ  సినిమా క​థ అంతా హీరో & హీరోయిన్ పాత్రలే కేంద్రంగా సాగుతుంది కాబట్టి.. కథానాయిక పాత్ర కూడా కీలకమే.

vijay-devarakonda-and-ishaan-khattar

తెలుగులో ఈ చిత్రం విజ​య​వంతం కావ​డంలో నటీన​టుల న​ట​న​, క​థ​నం కీల​క పాత్ర పోషించాయని చెప్ప​డంలో ఎలాంటి సందేహం లేదు. గీత గోవిందం విడుద​ల కావ​డానికి ముందు.. అర్జున్​రెడ్డి వంటి మాస్ క్యారెక్ట​ర్ చేసిన విజ​య్ ఈ పాత్ర​లో ఆక​ట్టుకుంటాడా?  లేదా? అని కాస్త సందేహించిన​ప్ప​టికీ గోవిందంగా కూడా అంద​రినీ ఆక​ట్టుకోవ​డంలో బాగానే స​క్సెస్ సాధించాడు. ఇక ప్రేక్ష​కులు అందించిన ఘ​న విజ​యంతో.. టాప్ హీరోల్లో ఒక​రిగా స్థానం సంపాదించేసుకున్నాడు విజ​య్​

ADVERTISEMENT

ఇక్క​డ మ​నం చెప్పుకోవాల్సిన మ​రో విశేషం ఏంటంటే – విజ​య్ దేవ​ర​కొండ న​టించిన రెండు చిత్రాలు ద​క్షిణాదిలో ఒకేసారి రీమేక్ బాట ప​ట్ట​గా వాటిలో ఒక చిత్రంలో షాహిద్​క​పూర్​ నటిస్తుండగా.. మ​రో చిత్రంలో త​మ్ముడు ఇషాన్ ఖ​త్త​ర్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు రావడం గమనార్హం.

మ​రి, ఈ అన్నదమ్ములిద్దరికీ ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

2018 తెలుగు సినిమా ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే..!

ADVERTISEMENT

ఈ సంక్రాంతికి ఈ బాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్

2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే

08 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT