యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన.. మహేష్ బాబు గారాలపట్టి సితార ..!

యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన.. మహేష్ బాబు గారాలపట్టి సితార ..!

ఈరోజుల్లో యూట్యూబ్ పుణ్యమాని ఎంతో మంది సామాన్యులు సైతం తమకున్న ప్రతిభతో సెలబ్రిటీలు అయిపోతున్నారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ అభిరుచి మేరకు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్‌ని ప్రారంభించి.. అందులో తమ టాలెంట్‌ని వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. 

వైరల్ అవుతోన్న వన్ బకెట్ ఛాలెంజ్.. మీరూ ఓసారి ప్రయత్నిస్తారా?

అయితే ఇప్పుడు చెప్పబోయే వార్త మాత్రం కాస్త ఆసక్తి కలిగించేలా ఉంది. అదేంటంటే - సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార (Sithara), దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు కలిసి నిన్ననే తమ పేరిట - ఆద్య & సితార అనే ఒక యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించారట. ఇలా ప్రారంభించడమే ఒక వార్త అయితే.. అందులో వారిరువురు కలిసి 3 మార్కర్స్ ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసారు. ఆ వీడియోలో వారిరువురు కళ్ళకి గంతలు కట్టుకుని.. కలర్ మార్కర్స్‌ని ఎంపిక చేసుకుని.. వాటితో డ్రాయింగ్స్‌లో కలర్స్ నింపారు. ఇదే 3 మార్కర్స్ ఛాలెంజ్.

ఈ వీడియోని ఉద్దేశించి మహేష్ బాబు సైతం ట్వీట్ చేస్తూ - "ఈ యూట్యూబ్ స్టింట్‌ని మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేయండి" అని తెలిపారట. ఇంకొక విషయం ఏమిటంటే.. మహర్షి చిత్రం షూటింగ్ సమయం నుండి మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాలు చాలా దగ్గరయ్యాయట. ఎంతగా అంటే సినిమా సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి.. ఈ ఇరు కుటుంబాలు లండన్‌లో సుమారు 20 రోజులు గడపడం జరిగింది.

ఆ సమయంలోనే ఆద్య, సితారలు మంచి స్నేహితులయ్యారు అని అర్ధమవుతుంది. నిజం చెప్పాలంటే.. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు బయట ఆదుకోవడం మానేసి సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నారు. అలా కాకుండా.. సెలబ్రిటీల పిల్లలైనా.. ఈ ఇద్దరు చిన్నారులు డ్రాయింగ్స్ అంటూ ఒక వీడియో చేయడాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ ఇద్దరు ప్రతి వారం ఒక వీడియో పోస్ట్ చేస్తామంటూ కూడా ప్రామిస్ చేశారు. అయితే వచ్చే వారం సితార పుట్టినరోజు కోసం..కుటుంబమంతా మహేష్ సినిమా షూటింగ్ జరుగుతున్న కశ్మీర్‌కి వెళుతున్నారట. అందుకే వీడియో పెట్టడానికి కొంత సమయం పడుతుందని ఆ ఇద్దరు చిన్నారులు భలే ముద్దుగా చెప్పారు.

"ఫ్రెండ్‌షిప్ డే" గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ కోసం క్లిక్ చేయండి


ఇక మహేష్ బాబు కూతురు సితార చాలా హుషారుగా ఉంటుందన్న విషయం మనందరికి తెలుసు. ఎందుకంటే సితార చాలా చిన్నతనం నుండే మహేష్ బాబు పాటలకి డ్యాన్స్ వేయడం, పాటలు పాడడం వంటివి చేస్తుండేది. అలా చేస్తున్న సమయంలో.. వాటిని వీడియో తీసి అటు మహేష్ బాబు లేదా ఇటు నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు అలాగే మహేష్ బాబు కూడా తన పిల్లలను సంవత్సరంలో కనీసం రెండు లేదా మూడు సార్లు విదేశీ పర్యటనలకు తీసుకువెళుతూనే ఉంటారు. అలా వెళ్లిన ప్రతిసారి తమ పిల్లలు (ముఖ్యంగా సితార) ఏం చేస్తున్నారో సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. 

మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటుగా.. సదరు సినీ అభిమానికి సితార గురించి ఇప్పటికే తెలుసు. ఇక తాజాగా యూట్యూబ్‌లోకి కూడా తను ఎంట్రీ ఇవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ కోసం కశ్మీర్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి... సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో.. సితార తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించి ఆశ్చర్యపరిచింది కదా. ఏదేమైనా ఓ సెలబ్రిటీ కిడ్.. యూట్యూబ్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఇంత చిన్న వయసులోనే తెచ్చుకోగలగడం విశేషం. 

"లేడీ రౌడీ"గా రష్మిక.. విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్..?