Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌లకి.. 'నాగ్' క్లాస్ పీకే అవకాశముందా..?

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌లకి.. 'నాగ్' క్లాస్ పీకే అవకాశముందా..?

(Nagarjuna to discuss  about Rahul Sipligunj and Varun Sandesh's issue in Bigg Boss Telugu 3)

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' లో భాగంగా రేపటితో 10వ వారం పూర్తికాబోతుంది. ఇక ప్రతి వారాంతంలో వ్యాఖ్యాత నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడడం.. అలాగే హౌస్ మేట్స్ ఆయా వారంలో చేసిన పనుల గురించి డిస్కస్ చేయడం తెలిసిందే. అలాగే కంటెస్టంట్స్ ఏమైనా తప్పులు చేసుంటే.. వాటిపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. అప్పుడప్పుడు క్లాస్ పీకడం కూడా చేస్తుంటారు నాగ్. 

ఈ క్రమంలో ఈ వారం హైలైట్‌గా నిలిచిన అంశాలను ఒకసారి పరిశీలిస్తే - రాహుల్ సిప్లిగంజ్ ఫేక్ ఎలిమినేషన్ పేరిట మరలా ఇంటిలోకి రావడం ఒక పెద్ద సర్‌ప్రైజ్. అలాగే రాహుల్ సిప్లిగంజ్ - వరుణ్ సందేశ్‌ల మధ్య జరిగిన గొడవ మరో ఇంట్రెస్టింట్ ఎలిమెంట్. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా.. అలీ రెజా బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడంతో గేమ్ మళ్లీ ఊపందుకుంది. నాగార్జున ఈరోజు ప్రధానంగా ఈ మూడింటి పైనే తన దృష్టి పెట్టబోతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య గొడవ

ఈ మూడింటిలో ప్రధానంగా రాహుల్ సిప్లిగంజ్ వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గతవారం తనకు ఛాన్స్ వచ్చినప్పుడు.. అందరికంటే ఎక్కువ మార్కులు వేయడమే కాకుండా.. తనకి క్లోజ్ ఫ్రెండ్ అంటూ రాహుల్.. వరుణ్ పేరు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మూడు రోజులు గడిచేసరికి టాస్క్‌లో భాగంగా వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఒకరినొకరు పలకిరించుకునే పరిస్థితి కూడా ఇంటిలో కనిపించకపోవడం గమనార్హం. వీరిరువురి మధ్య గొడవ జరగగా.. పునర్నవి సైతం వరుణ్ సందేశ్, వితికలతో మాట్లాడడం ఆపేసింది. రెండు రోజుల క్రితం వరకు.. ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసి తిరిగిన నలుగురు సభ్యులు.. ఇప్పుడు  ఒకరి ముఖం మరొకరు చూసుకునే పరిస్థితి కూడా లేదన్నది నిజం.

ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఈ విషయమే ప్రధానంగా సాగనుందని తెలుస్తుంది. మరి నాగార్జున ఈ విషయంలో ఎవరికి మద్దతిస్తాడు? ఎవరిది తప్పని చెబుతాడు? లేదా వారిద్దరినే విషయాన్ని తేల్చుకోమని వదిలేస్తాడా? లేదా ఈ అంశానికి సంబంధించి వేరెవరైనా తప్పు చేశారని మందలిస్తాడా? అనేది ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

ఇదిలావుండగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో శ్రీముఖి ఇంటి కెప్టెన్‌గా గెలుపొందింది. కెప్టెన్సీ కోసం జరిగిన కలర్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు - శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణ, శివజ్యోతిలు పోటీపడ్డారు. ఈ నలుగురిలో ముందుగా బాబా భాస్కర్ ఆట నుండి తప్పుకోగా.. ఆ తరువాత శివజ్యోతి కూడా నిష్క్రమించింది. చివరగా శ్రీముఖి, రవిక్రిష్ణలు పోటీలో నిలబడ్డారు. ఆ సమయంలో ఎక్కువమంది మద్దతు శ్రీముఖికే ఉండడంతో.. రవికృష్ణ పోటీ నుండి తప్పుకోవడం జరిగింది. అలా చివరికి శ్రీముఖి ఇంటి కెప్టెన్ అయింది.

Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్?

ఇక కెప్టెన్ అవ్వడంతో.. శ్రీముఖి వచ్చే వారం నామినేషన్స్ నుండి ఉపశమనం పొందింది. అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నప్పటికి.. ఆమె ఇంటి నుండి బయటకి వెళ్ళేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాగే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిని పరిశీలిస్తే, బాబా భాస్కర్, రవికృష్ణలలో ఒకరు ఇంటి నుండి నిష్క్రమిస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఒకరు వెళతారా? లేక ఇద్దరూ వెళతారా? అన్నది రేపు తెలుస్తుంది. ఈరోజు మాత్రం నామినేషన్‌లో ఉన్నవారి గురించి.. అలాగే సేఫ్ జోన్‌లో ఉండే సభ్యుల గురించి మాత్రమే నాగ్ చెప్పే అవకాశముంది.

చివరిగా.. 10వ వారం ముగుస్తున్న నేపథ్యంలో.. 10 మంది ఇంటి సభ్యులలో.. రేపు ఒకరు నిష్క్రమించడం ఖాయం. దీంతో ఇంటి సభ్యుల సంఖ్య '9' కి చేరుకుంటుంది. ఈ క్రమంలో పోరు మరింత రసవత్తరంగా మారనుందనే చెప్పాలి.

Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం..!