“బిగ్‌బాస్ తెలుగు 3” ( Bigg Boss Telugu) కార్యక్రమంలో నాల్గవ వారం పూర్తి కావస్తోంది. ఈరోజు జరిగే ఆదివారం ఎపిసోడ్‌తో నాల్గవ వారం పూర్తయి.. అయిదవ వారం.. అనగా రెండవ నెల ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున.. మరోసారి తనదైన మార్క్‌ని చూపెట్టారు. అటు బిగ్ బాస్ హౌస్ సభ్యులనే కాకుండా.. ఇటు ఆ షో వీక్షకులకు సైతం ఒక ఝలక్ ఇచ్చాడు. అదే – మాస్క్ గేమ్.
బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!
ఈ మాస్క్ గేమ్‌లో భాగంగా- ఇంటి సభ్యులు తమ అసలు రూపాన్ని బయట పెట్టకుండా.. అందరి చేత మంచి వారు అనిపించుకోవాలనే కోరికతో హౌస్‌లో కొనసాగుతున్నారని నాగార్జున చెప్పుకొచ్చాడు. అలా చెప్పడమే కాకుండా.. హౌస్ సభ్యులందరికి వారు ఇంటిలో ప్రవర్తిస్తున్న తీరుని బట్టి.. రకరకాల అవార్డ్స్‌ను ( Bigg Boss Telugu Awards ) కూడా అందించారు.
ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా.. ఈ అవార్డ్స్‌ని అందించడంతోనే సరిపోయింది. దానితో పాటు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు సభ్యులలో.. ఇద్దరు సభ్యులని సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు.
ఆ ఇద్దరే – శివజ్యోతి & వరుణ్ సందేశ్. మిగతా అయిదుగురితో పోలిస్తే, ఈ ఇద్దరికీ ఎక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ఇంటి సభ్యులకి ఇచ్చిన అవార్డ్స్ విషయానికి వస్తే.. ముందుగా బాబా భాస్కర్ మాస్టర్‌కి ప్రెజర్ కుక్కర్ అవార్డు ఇవ్వడం జరిగింది.
ఇది ఇవ్వడానికి కారణం – తన మనసులో దాగున్న అనేక భావాలని ప్రెజర్ కుక్కర్ మాదిరిగా ఆయన లోపల పెట్టి ఉంచడమే అని నాగార్జున తెలిపారు. “అందరి చేత మంచి వ్యక్తి అనిపించుకోవాలి” అనుకోవడం అన్నిటికన్నా పెద్ద జబ్బు అని చెబుతూ.. ఈ సందర్భంగా సున్నితంగా బాబాని హెచ్చరించాడు నాగ్.
ఆ తరువాత లౌడ్ స్పీకర్‌ని శ్రీముఖికి అవార్డుగా ఇవ్వడం జరిగింది. అలాగే పునర్నవికి… బిగ్ బాస్ ఇంటిలో ఏవిధమైన టాస్క్ చేయకుండా.. ఒక అంపైర్‌లా నిలుచుని చూస్తున్న కారణంగా.. ఆమెకి అంపైర్ టోపీని ఇవ్వడం ఇచ్చారు. ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్‌కి ఎక్కువగా మాట్లాడతాడనే కారణాన్ని చూపుతూ ‘నాలుక బయటపెట్టిన మూతి’ ని అవార్డుగా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో.. శ్రీముఖి పైన మరోసారి అతను చేసిన కామెంట్స్‌ని వీడియోలో చూపించడం జరిగింది.
ఇక “ఆటలో అరటిపండు” అనే అవార్డుని అషు రెడ్డికి ఇవ్వడం జరిగింది. హౌస్‌లో అంతగా యాక్టివ్ మోడ్‌లో లేని కారణంగా అషు రెడ్డి ఈ అవార్డుని సొంతం చేసుకుంది. ఇలా ఆమె సైలెంట్‌గా ఉండడం తనకే నష్టమనే రీతిలో క్లూ ఇస్తూ.. అషుకి నాగార్జున ఈ సందర్బంగా హితవు పలికాడు. మహేష్ విట్టా ఇంటిలోని సభ్యుల మధ్య గొడవలు పెడుతూ అనేక సంఘటనలకు పరోక్షంగా కారణమవుతున్న కారణంగా.. పుల్లలు పెట్టే అవార్డుని సొంతం చేసుకున్నాడు.
బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?
ఈ అవార్డుల కార్యక్రమంలో ‘భూతద్దం’ అవార్డుని సొంతం చేసుకుంది వితిక. ఈ అవార్డు తన “భార్యకి చక్కగా సరిపోతుంది” అని ఆమె భర్త వరుణ్ సందేశ్ చెప్పడం కొసమెరుపు. అదే సమయంలో ఇంటిలో జరిగే టాస్క్‌లలో చాలా సులభంగా ఓడిపోతున్న వరుణ్‌ని ‘ఫ్రూట్’ అని పిలవగా… నిన్న షోలో వరుణ్ సందేశ్‌కి “పైన్ యాపిల్ ఫ్రూట్”ని అవార్డుగా ఇచ్చారు. అది కూడా ఆయన భార్య వితిక చేతుల మీదుగానే..
ఇక ఇంటిలో తనకి ఏవిధమైన భావన కలిగినా.. దానికి కంటతడి పెట్టుకోవడం శివజ్యోతికి పరిపాటి కావడంతో… ఆమెకి “ఉల్లిగడ్డ” అవార్డుని కన్నీళ్ళకి గుర్తుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటి కెప్టెన్ అలీకి .. ఫ్లూట్ అవార్డు వచ్చింది. ఇంటిలోని వారందరిని కూడా.. తన మాయలో పడేసుకుని వెంట తిప్పుకుంటున్న కారణంగా ఈ అవార్డు లభించింది.
రోహిణికి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా కత్తెర అవార్డు లభించింది. ఎందుకంటే అనవసరమైన విషయాలని వినకుండా కట్ చేస్తూ ముందుకి వెళ్ళిపోతుంది కాబట్టి… రోహిణికి ఈ అవార్డు అందించారు. ఇక ఆఖరుగా మిగిలిపోయిన ఇద్దరు – రవికృష్ణ & హిమజలకి కూడా చాలా ఆసక్తికరమైన అవార్డులు లభించాయి.
ముందుగా రవిక్రిష్ణకి .. చెవి బొమ్మని అవార్డుగా అందించారు. దీని ద్వారా ఎవరు ఏమి చెప్పినా.. సొంత ఆలోచన లేకుండా చేసుకుపోయే మనస్తత్వం ఉన్న కారణంగా.. తనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు నాగార్జున తెలిపారు. అలాగే హిమజకి ఒక ‘చిచ్చుబుడ్డి’ని అవార్డుగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే, చిచ్చుబుడ్డి ఎలాగైతే ఒకేసారి పైకి వచ్చి.. తరువాత చప్పుడు లేకుండా ఉంటుందో అదే విధంగా హిమజ కూడా ఉందని పేర్కొంటే ఆ అవార్డుని అందించారు.
ఇలా ఫన్నీగా జరిగిపోయిన ఈ ఎపిసోడ్‌లో.. 7 సభ్యులలో.. ఇద్దరినీ సేఫ్ జోన్‌లో పెట్టి.. రేపు మిగిలిన అయిదుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారని తెలిపారు బిగ్‌బాస్. మరి ఇప్పుడు నామినేషన్స్‌లో ఉన్న – రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, రవికృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖిలలో.. ఎవరు బిగ్‌బాస్ హౌస్ నుండి వెళ్లిపోనున్నారు అనేది ఈరోజు ఎపిసోడ్‌లో తేలిపోతుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?