నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌కి.. సై అంటున్న టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు?

నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌కి.. సై అంటున్న టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు?

అదేంటి? ఒక హీరో సినిమాలో నలుగురు హీరోయిన్‌లా.. అని ఆశ్చర్యపోతున్నారా ! అబ్బే కాదండీ .. దాదాపు ఒక సంవత్సరం తరువాత మళ్ళీ కెమెరా ముందుకి రానున్న ఓ యంగ్ హీరో, వస్తూనే మూడు ఆసక్తికర సినిమాలని ప్రకటించేశాడు. ఆ మూడు చిత్రాలలో కలిపి నలుగురు కథానాయికలతో తను నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ మూడు చిత్రాల పైనే ఇండస్ట్రీ దృష్టి నెలకొంది. ఎందుకంటే ఆ మూడు చిత్రాలను కూడా టాలెంటెడ్ & క్రేజీ డైరెక్టర్స్‌గా పేర్కొనబడే ప్రముఖ దర్శకులు టేకప్ చేయడమే ప్రధాన కారణం. 

ఇంతకీ ఆ మూడు ప్రాజెక్ట్స్‌లో నటించబోయే హీరో ఎవరో తెలుసా.. అతనే నితిన్ (Nithiin). తన పక్కన నటించబోయే నలుగురు నటీమణులు ఎవరో తెలుసా..?  ఇప్పుడు ఆ టాపిక్ పైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 

Nithiin

ముందుగా నితిన్ - ఛలో మూవీ ఫేమ్ వెంకీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం - భీష్మ. ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్‌గా రష్మిక మందాన నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తుండడం విశేషం. దాదాపు ఒక సంవత్సర కాలం తరువాత నితిన్ చేస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక రష్మిక మందాన (Rashmika Mandanna) విషయానికి వస్తే.. ఆమె నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉంది. అలాగే మహేష్ బాబు‌తో జంటగా చేస్తున్న "సరిలేరు నీకెవ్వరూ"  చిత్రం కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

ఈ కథనం కూడా చదివేయండి:  స్టైలిష్‌గా క‌నిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!

Rashmika Mandanna

ఇక నితిన్  దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ పక్కన నటించడానికి ఇద్దరు ముద్దుగుమ్మలు - రకుల్ ప్రీత్ (Rakul Preet) ప్రియ ప్రకాష్ వారియర్లని దర్శక-నిర్మాతలు ఎంపిక చేయడం జరిగింది.

ఎంతో కాలంగా నితిన్, రకుల్ కలిసి ఒక చిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే ఇంతకాలం తరువాత ఈ అవకాశం దక్కింది అని ఇరువురూ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక రకుల్ ప్రీత్ ఈ మధ్యనే బాలీవుడ్‌లో "దే దే ప్యార్ దే" చిత్రంతో ఘన విజయం అందుకుంది.

Rakul Preet

అలాగే వింక్ క్వీన్‌గా మారిన తరువాత ప్రియ ప్రకాష్ వారియర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. నితిన్ - రకుల్ -ప్రియ (Priya Prakash Varrier) నటిస్తున్న ఈ చిత్ర పూజ కార్యక్రమాలను ఇటీవలే నిర్వహించగా.. భవ్య క్రియేషన్స్ సంస్థ పైన నిర్మాత ఆనంద్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు.

ఈ కథనం కూడా చదివేయండి : టాప్ 5 టాలీవుడ్ క్వీన్స్ ఎవరో తెలుసా..?

Priya Prakash Varrier

ముచ్చటగా నితిన్ మూడవ చిత్రం గురించి చెప్పాల్సి వస్తే - కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రం గురించిన ప్రకటన వెలువడింది. తొలిప్రేమ, మజ్ను వంటి ప్రేమకథా చిత్రాలని తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో నితిన్ చేస్తున్న 'రంగ్ దే' చిత్ర పోస్టర్ ఈ రోజు విడుదలైంది.

ఇక ఈ చిత్రంలో మహానటి చిత్రంతో అద్భుతమైన అభినయం ప్రదర్శించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల చేస్తామంటూ దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Rang De Poster

ఇలా నితిన్ ఒకేసారి మూడు చిత్రాల ప్రకటన చేయడం... అందులోనూ తాను ఇప్పటివరకు నటించని ఈ నలుగురు ముద్దుగుమ్మలతో కలిసి యాక్ట్ చేయడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. మొన్నీమధ్య హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసి ట్రాఫిక్ జామ్ కావడంతో.. మెట్రో రైల్ ఎక్కి వార్తల్లో నిలిచిన నితిన్, ఇప్పుడు ఈ మూడు చిత్రాల ప్రకటన ద్వారా అందరికి ఒక ఝలక్ ఇచ్చాడనే చెప్పాలి.

గత సంవత్సరం విడుదలైన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎన్నో అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నితిన్ ఒక్కసారిగా ఢీలా పడ్డాడు. అందుకనే కొంత సమయం తీసుకుని మూడు చిత్రాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మరి ఈ చిత్రాల ఫలితం ఎలా ఉందో.. ఆ సినిమాలు రిలీజ్ అయితే గానీ మనకు తెలియదు. 

ఈ కథనం కూడా చదివేయండి: ఈ టాలీవుడ్ బ్యూటీస్.. పెంపుడు జంతువులు అంటే ప్రాణమిస్తారు..