ఈరోజు బిగ్ బాస్ తెలుగు 3 గ్రాండ్ ఫినాలే లో టైటిల్ గెలిచేదెవరు?

ఈరోజు బిగ్ బాస్ తెలుగు 3 గ్రాండ్ ఫినాలే లో టైటిల్ గెలిచేదెవరు?

బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu)సీజన్ 3లో భాగంగా ఈరోజు ఆఖరి ఎపిసోడ్ ప్రసారం కాబోతున్నది. దాదాపు 105 రోజుల పాటు కొనసాగిన ఈ సీజన్ లో 17 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 3 (bigg boss 3) టైటిల్ కోసం పోరాడగా.. చివరికి టాప్ 5 లో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్ & అలీ రెజా లు నిలిచారు.

బిగ్ బాస్ హౌస్ లో రీ-యూనియన్ రెట్రో పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా

మరి ఈ అయిదుగురిలో ఎవరు విజేతగా నిలవనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు బయట వినిపిస్తున్న టాక్.. ఇప్పటివరకు సీజన్ లో కంటెస్టెంట్స్ ఆడిన గేమ్ ప్రకారం, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి లలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా అర్ధమవుతున్నది. పైగా ఎక్కువగా ఆడియన్స్ మద్దతు ఉన్నది కూడా ఈ ఇద్దరికే ఎక్కువగా ఉన్నది అంటూ స్పష్టమైంది. అయితే ఈ అంచనా ప్రకారమే విజేత ఈ ఇద్దరిలో ఒకరు ఉంటారా? లేక బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చు అనే ట్యాగ్ ఆధారంగా అనూహ్యంగా వేరే ఎవరైనా టైటిల్ గెలుస్తారా అనేది ఈ రాత్రికి తేలనుంది.

ఇది కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే - శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలిచినట్టు & అందుకు సంబందించిన ఒక ఫోటో అంటూ ఇప్పుడు ప్రచారంలో ఉంది. అలాగే రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచినట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై నాగార్జున ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బిగ్ బాస్ షో ఇంకా షూటింగ్ పూర్తవలేదు కాబట్టి విజేత గురించి వస్తున్న ఈ ఊహాగానాలను పట్టించుకోకండి. రాత్రి బిగ్ బాస్ షో చూసి తెలుసుకోండి అంటూ ట్వీట్ చేయడం జరిగింది. 

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ రీయూనిన్ రెట్రో పార్టీ లో అందరు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇక ఈ పార్టీలో ఇంటిలో ఉన్న 17మంది సభ్యులకి కూడా రకరకాల అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి జాఫర్ & బాబా భాస్కర్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా... ఈ షో ఆద్యంతం వినోదంగా సాగింది. మధ్యలో వరుణ్ సందేశ్ తన హ్యాపీ డేస్ చిత్రంలోని పాట ని కూడా పాడడం జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్

ఇక ఆ అవార్డ్స్ ప్రధానోత్సవం తరువాత ఇంట్లో వారంతా బిగ్ బాస్ ప్లే చేసిన పార్టీ సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం జరిగింది. మొత్తంగా ప్రతి ఒక్కరూ కూడా తమ బిగ్ బాస్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవ్వడం కనిపించింది. అదే సమయంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ తమ మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక పార్టీ ముగిశాక బయట నుండి వచ్చిన 12 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి విడిచి వెళ్లడం జరిగింది.

ఆఖరుగా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే (grand finale) ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి వారు చేస్తున్న రిహార్సల్స్ చూపించడం జరిగింది. వాళ్ళు కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేయడానికి తమ శక్తివంచన లేకుండా డ్యాన్స్ చేయడానికి కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈరోజు వారి డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఎలా చేస్తారు అనేదాని పైన కూడా అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు రాశీ ఖన్నా, అంజలి, నిధి అగర్వాల్, క్యాథరీన్ ట్రెసా వంటి వారు కూడా డ్యాన్సులు చేసి ఆకట్టుకోనున్నారు. ఫినాలే ఛీఫ్ గెస్ట్ గా చిరంజీవి రానున్నారట. 

ఏదేమైనా... ఈ బిగ్ బాస్ తెలుగు 3 (bigg boss telugu 3) అటు కంటెస్టెంట్స్ కి ఇటు వీక్షకులకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే (bigg boss grand finale) కి సంబందించిన టైటిల్ విజేత ఎవరు అనేది కూడా తేలిపోనుంది.

బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్