Many Movies Disturb Me As A Woman : Radhika Apte On The ‘Problematic Mindset’ Of Bollywood
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన సినీ కెరీర్ గురించి బర్కా దత్ షో “వి ది ఉమన్”లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను కథానాయికగా అనేక చిత్రాలలో నటించినా.. కొన్ని సార్లు సమస్యాత్మకమైన దర్శకుల ఆలోచనా ధోరణి వల్ల ..పాత్రల విషయంలో రాజీపడే పరిస్థితి తలెత్తుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భాలలో.. తాను ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండి డిస్టర్భ్ అవుతుంటానని ఆమె అభిప్రాయపడ్డారు. “బద్లాపూర్” చిత్రంలో నటించాక.. తనకు ఎక్కువగా సెక్స్ కామెడీలు లేదా మహిళను ఒక లైంగిక వస్తువుగా చూపించే పాత్రలే వస్తున్నాయని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అహల్య, బద్లాపూర్ లాంటి చిత్రాలలో నటించాక.. దర్శకులు తనకు ఆఫర్ చేస్తున్న పాత్రల విషయంలో సంతృప్తితో లేనని ఈ సందర్భంగా రాధిక తెలిపారు. “ఇటువంటి సమయంలో నా కెరీర్‌కు సంబంధించి ఏదైనా తెలివైన లేదా మంచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తే.. అటువంటి పాత్రలను చేయకూడదనే అనుకున్నాను. అందుకే కొన్ని సందర్భాలలో దర్శకుడు చెప్పే కథ లేదా అందులోని భావజాలం నాకు నచ్చకపోయినా.. ఆ చిత్రాలను నేను చేయడం లేదు. ఎందుకంటే అటువంటి చిత్రాలు లేదా పాత్రల వల్ల నేను నిజంగానే డిస్టర్బ్ అవుతాను” అని తెలిపారామె.
వెండితెరపైనే కాదు.. వెబ్ సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటున్నారీ హీరోయిన్లు..!
“అలాగే అభ్యుదయం పేరుతో రాసే కొన్ని కథలు నాకు ఎందుకో నచ్చవు. ఒక మగాణ్ణి ఎప్పటికీ ద్వేషించేలా కొన్ని కథలు ఉంటాయి. ఇక్కడ ఒక దర్శకుడు లేదా కథకుడు తాను తెరపైన చెప్పాలనుకొనేది కూడా చాలా ముఖ్యం. అది సరిగ్గా లేదని అనిపిస్తే.. నేను ఆ సినిమా చేయననే చెప్పేస్తాను. కొన్ని హిట్ సినిమాలు చూసినప్పుడు కూడా నాకు అదే భావన కలుగుతుంది.” అని తన మదిలోని భావాలను పంచుకున్నారు రాధిక. అయితే నటనా రంగంలో ఉండి.. ఇలా ఆలోచించడం వల్ల అవకాశాలు తగ్గుతాయి కదా..? అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు రాధిక.
రాధికా ఆప్టే తన పెళ్లికి రంధ్రాలు పడిన పాత చీర ఎందుకు కట్టుకుందో తెలుసా?
“ఒకవేళ డబ్బు కోసం అలాంటి పాత్రలు చేయడానికి నేను ఒప్పుకున్నా.. నాలో ఏదో అసంతృప్తి తలెత్తుతుంది. ఒక ప్రొఫెషనల్‌గా నేను సక్సెస్‌ఫుల్ కెరీర్ కోరుకున్నా.. ఒక నటిగా ఇది నా వ్యక్తిగత ప్రయాణమనే భావిస్తాను. ఈ ప్రయాణంలో ఒక మనిషిగా నేను ఎదగాలని భావిస్తాను. అలా ఎదగాలని భావించినప్పుడు.. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పదు” అని నిర్మొహమాటంగా తెలిపింది రాధిక. 2018 సంవత్సరంలో పద్మన్, అందాదూన్ వంటి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన రాధిక.. లస్ట్ స్టోరీస్ అనే మిని సీరిస్‌లో కూడా నటించింది.
ఈ బాలీవుడ్ నటులు.. ఓటు ఎందుకు వేయలేదంటే..?
2005 సంవత్సరంలో “వాహ్.. లైఫ్ హో తో ఐసీ” అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసిన రాధిక ఆప్టే.. రక్త చరిత్ర, ధోని, లయన్, లెజెండ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. రజనీకాంత్ నటించిన “కబాలి” చిత్రంలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రాధిక.. అనతి కాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం “బొంబారియా” అనే హిందీ చిత్రంతో పాటు.. మరో మూడు ఆంగ్ల చిత్రాలలో నటిస్తోంది రాధిక.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.