Bigg Boss Telugu 3: ఈ వారం నామినేషన్స్‌లో.. రాహుల్ సిప్లిగంజ్ ఉంటాడా?

Bigg Boss Telugu 3: ఈ వారం నామినేషన్స్‌లో.. రాహుల్ సిప్లిగంజ్ ఉంటాడా?

(Rahul Sipligunj Entry and Bigg Boss Elimination Task)

మొన్న శనివారం జరిగిన ఫేక్ ఎలిమినేషన్ కారణంగా.. ఎవరికీ తెలియకుండా బిగ్ బాస్ హౌస్‌లోనే రాహుల్ గడుపుతున్నాడన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన మరల ఈ రోజు ఇంట్లోకి ప్రవేశించనున్నారు. ఈ ఘట్టాన్ని మనం ఈరోజు ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి.. కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

Bigg Boss Telugu 3: హౌస్‌లో శివజ్యోతి చేత.. కన్నీళ్ళు పెట్టించిన బాబా భాస్కర్!

ఆ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్‌లోకి రాహుల్ సిప్లిగంజ్ మరలా పునః ప్రవేశించినట్లు చూపించారు. అది కూడా ఇంటి సభ్యులపైన ఒక పాట పాడుతూ తను ఎంట్రీ ఇచ్చాడు. ఈ తరుణంలో ప్రతి సోమవారం జరిగే ఎలిమినేషన్ టాస్క్ ప్రక్రియలో భాగంగా.. రాహుల్ అందులో పాల్గొంటాడా? లేక ఆ టాస్క్ ముగిసాక రాహుల్‌ని ఇంట్లోకి పంపించడం జరిగిందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్.. ఈ సీజన్‌కు సంబంధించి బలమైన కంటెస్టెంట్స్‌లో ఒకరనే విషయం తెలిసిపోయింది. అలాగే ఆయన కూడా ఎలిమినేట్ కాకుండా.. దాదాపు ప్రతి వారం సేఫ్ అవుతూనే వచ్చాడు. మొన్న కూడా బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్ చేశారు తప్పితే..  ఆడియన్స్ రాహుల్‌ని ఎలిమినేట్ చేయలేదు. ఈ క్రమంలో ఈ రోజు ఏం జరుగుతుందనేది.. నేటి ఎపిసోడ్‌లో చూడాలి.

ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా.. అందరూ ఊహించినట్లుగానే హిమజ ఎలిమినేట్ అయింది. "ఎలిమినేట్ అవుతాను" అని ఆమె బలంగా నిర్ణయించుకుందనే విషయం నిన్న అవగతమైంది. ఆమె స్పందన కూడా అలాగే ఉంది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చాక.. మిగిలిన ఇంటి సభ్యుల ప్రవర్తన, వ్యక్తిత్వానికి  సంబంధించి నాగార్జున ఆమెకు చిన్న టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె వరుణ్ సందేశ్, శివజ్యోతి, రవికృష్ణ, శ్రీముఖిలను గుడ్ క్యాటగిరి వ్యక్తులుగా అభిప్రాయపడింది. అలాగే పునర్నవి, వితిక, మహేష్‌లని బ్యాడ్ క్యాటగరీలోకి పంపించింది.  అయితే బాబా భాస్కర్‌కి మాత్రం 'స్వీట్ కన్నింగ్' అంటూ అగ్లీ క్యాటగిరిని ఇవ్వడం కొసమెరుపు.

Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం ..!

ఇదిలావుండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ రావడం జరిగింది. ఆయనే ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే.. వ్యక్తి పేరుని ప్రకటించారు. ఆయన తన తాజా చిత్రం 'గద్దలకొండ గణేష్' చిత్ర ప్రమోషన్లలో భాగంగా.. బిగ్ బాస్ హౌస్‌కి రావడం జరిగింది. అందులో భాగంగానే ఇంటి మహిళా సభ్యులు ఆయనకి లవ్ ప్రపోజ్ చేశారు. శివజ్యోతి చేసిన ప్రపోజల్.. అందరికన్నా హైలైట్‌గా నిలిచింది. అంతకముందు.. 'రిథమ్ అఫ్ ది లైఫ్' అంటూ ఒక టాస్క్‌ని.. నాగార్జున ఇంటి సభ్యుల చేత చేయించడం జరిగింది.

ఆ టాస్క్‌లో భాగంగా హౌస్ మేట్స్‌ని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ గ్రూపు సభ్యులు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వితిక - పునర్నవి , బాబా భాస్కర్ - శ్రీముఖి , హిమజ - శివజ్యోతి & రవికృష్ణ - వరుణ్ సందేశ్‌లు తమదైన శైలిలో పెరఫార్మన్స్ ఇచ్చారు. వీరి డ్యాన్సులతో బిగ్ బాస్ సండే ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది. పైగా ఈ టాస్క్ ముగింపులో.. ఇంటి సభ్యులందరూ చేసిన డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది.

ఇక 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3'కి సంబంధించి.. 9 వారాలు ముగియడం విశేషం. ప్రస్తుతం ఇంటిలో 9 మంది సభ్యులు ఉన్నారు. ఆఖరి వారం తీసేస్తే.. ఇంకొక అయిదు వారాల పాటు నామినేషన్ల ప్రక్రియ.. ఎలిమినేషన్ టాస్క్‌లు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో మరో నలుగురు ఎలిమినేట్ అవ్వగా.. మిగతా హౌస్ మేట్స్ 'టాప్ 5'లో నిలబడతారు. మొత్తానికి ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ రేసులో చాలామందే ఉన్నారు..!

Bigg Boss Telugu 3 : కుటుంబ సభ్యులని చూసి.. కంటతడి పెట్టిన హౌస్ మేట్స్