అవును.. పెళ్లి చేసుకున్నా.. అబద్ధం చెప్పినందుకు క్షమించండి : రాఖీ సావంత్

అవును.. పెళ్లి చేసుకున్నా.. అబద్ధం చెప్పినందుకు క్షమించండి : రాఖీ సావంత్

బాలీవుడ్ వివాదాల రాణి రాఖీ సావంత్ (rakhi sawant). సినిమా ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఐటం సాంగ్స్‌తో క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. తన కెరీర్ కంటే వివాదాలతోనే ఫేమస్‌గా మారిపోయింది. ఇక తన పెళ్లికి సంబంధించిన వివాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. "రాఖీ కీ స్వయంవర్" అంటూ ఇమాజిన్ టీవీలో తన స్వయంవరం ప్రకటించి అందులో విజేతగా నిలిచిన ఎలేష్ పురంజన్ వాలాతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది రాఖీ.

వీరిద్దరూ కలిసి "పతీ, పత్నీ అవుర్ వో" అనే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. తర్వాత అతడికి ఆస్తి లేదన్న కారణంతో అతడితో విడిపోయింది రాఖీ. ఆ తర్వాత అభిషేక్ అవస్తీ అనే వ్యక్తిని ప్రేమించిన రాఖీ అతడితో "నచ్ బల్లియే" కార్యక్రమంలో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారు.

instagram
అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ

తాజాగా దీప్ వీర్ పెళ్లి సమయంలో.. తను కూడా దీపక్ కలాల్‌ని (ఇండియాస్ గాట్ టాలెంట్ పార్టిసిపెంట్) వివాహమాడనున్నానని ప్రకటించింది రాఖీ. డిసెంబర్ 31 లాస్ ఏంజలిస్‌లో తమ వివాహం జరగనుందని.. పెళ్లికి బట్టల ఖర్చు లేకుండా న్యూడ్ వెడ్డింగ్ చేసుకొని.. ఆ డబ్బును సొమాలియాలో ఉన్న పేదవారి కోసం ఖర్చు చేస్తామని కూడా ప్రకటించింది రాఖీ. ఆ పెళ్లి కూడా జరగనే లేదు. దానికి గల కారణాలను కూడా వీరిద్దరూ వెల్లడించలేదు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని అందరూ అనుకున్నారు.

Instagram

కొన్ని రోజుల క్రితం రాఖీ.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్రిస్టియన్ వధువుగా తయారైన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ఆమె వెడ్డింగ్ ఫొటోషూట్ అంటూ క్యాప్షన్ రాసినా.. మీడియా మాత్రం ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందని.. యూకేకి చెందిన ఓ ఎన్నారై ఆమె భర్త అని రాసింది. ఆ తర్వాత పొట్టి పొట్టి దుస్తులతో హనీమూన్‌కి  వెళ్లినట్లుగా ఉన్న దుస్తులతో.. కొత్త పెళ్లి కూతురు వేసుకునే చూడా, పాపిట సింధూరంతో మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది రాఖీ. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన రాఖీ తన పెళ్లి (wedding) గురించి ప్రకటన చేసింది.

కమనీయం.. కన్నుల వైభోగం.. అగ్నిసాక్షి ఫేమ్ గౌరీ కల్యాణం..!
Instagram

"అవును.. నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను. బ్రైడల్ ఫొటోషూట్ అని అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి. ముంబయిలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్లో మా వివాహం జరిగింది. నేను క్రిస్టియన్‌ని.. తను హిందూ.. కాబట్టి మేం రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నాం. అంతకుముందు రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనూ మా వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నాం. సెక్యూరిటీ కారణాల వల్ల వెడ్డింగ్ హాల్లో కాకుండా.. ఓ ప్రైవేట్ గది తీసుకొని అక్కడే వివాహం చేసుకోవాల్సి వచ్చింది.

మా పెళ్లికి తన కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, సన్నిహితులు తప్ప ఇంకెవరూ హాజరు కాలేదు. నా భర్త చాలా ప్రైవేట్ పర్సన్. మీడియా కంట పడడం తనకు నచ్చదు. అందుకే మా పెళ్లి ఫొటోలు కూడా పోస్ట్ చేయలేదు. మీరు రాసింది నిజమే.. నా భర్త ఓ ఎన్నారై. తను యూకేలో ఉంటాడు. పెద్ద బిజినెస్ మ్యాన్. తన పేరు రితేష్. పెళ్లి, హనీమూన్ తర్వాత తను నేరుగా యూకే వెళ్లిపోయాడు.

నా వీసా పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక నేను కూడా అక్కడికే వెళ్లిపోతాను. అయితే పెళ్లి చేసుకున్నా కదా అని.. నా పని ఆపేయను. నాకు సినిమా ఆఫర్లు వస్తే.. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నటించి తిరిగి వెళ్తాను. నాకు ఎప్పటి నుంచో టీవీ షోలకు నిర్మాత కావాలనే ఆశ ఉండేది. పెళ్లయ్యాక దాన్ని నెరవేర్చుకోవాలని భావించా.. కాబట్టి ఇకపై ఆ పని మీద ఉంటా.. అని చెప్పింది"

Instagram
పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ తారలది..!

తనది ప్రేమ వివాహం అని చెప్పిన రాఖీ తన భర్తతో కలిసిన కథ గురించి చెబుతూ.. "తను నాకు పెద్ద ఫ్యాన్. నా నంబర్ సంపాదించి నాకు వాట్సాప్‌లో హాయ్ చెప్పాడు. నేను తనతో మాట్లాడాను. అలా మాట్లాడుతూ మా అభిప్రాయాలు కలవడం వల్ల త్వరగా స్నేహితులమయ్యాం. ఒకటిన్నర సంవత్సరాల నుంచి అలా ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఓసారి తన స్నేహితుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని.. నా అభిప్రాయమేంటని అడిగాడు. నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను.

నాకు తనని చూసి గుండెల్లో గంట మోగలేదు అని చెప్పా.. దానికి అతడు మరి, నన్ను చూస్తే నీ గుండెల్లో గంట మోగుతోందా? అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయా. అప్పుడే తనకు నా మీద ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్పాడు. నేను ఆలోచించుకోవడానికి కాస్త సమయం అడిగాను. నీకు నచ్చినప్పుడు చెప్పు.. నేను వేచి చూస్తా అన్నాడు. రోజులు గడుస్తుంటే మా ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా మారింది. తనే నాకోసం దేవుడు పంపిన వ్యక్తి అనిపించింది అందుకే ఓకే చెప్పేశాను.

మా పెళ్లికి పదిహేను రోజుల ముందు తను పెళ్లి పనుల కోసం ఇండియా వచ్చినప్పుడే.. తనని మొదటిసారి చూశాను. అప్పటివరకూ మేం ఫోన్, చాటింగ్‌లలో మాట్లాడుకున్నాం. అలాగే మా మనసులు కలిశాయి. అయితే నా భర్త ఫొటొ పోస్ట్ చేయకుండా పెళ్లి జరిగిందంటే అంతా నమ్ముతారో లేదో అని భయపడి.. బ్రైడల్ ఫొటోషూట్ అని అబద్ధం చెప్పాను. కానీ అందరికీ ముందుగానే నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక దాన్ని దాచాలనుకోవట్లేదు.. అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పింది రాఖీ.

మరి, రాఖీ ప్రారంభించబోతున్న కొత్త జీవితానికి మనమూ శుభాకాంక్షలు వెల్లడిద్దాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాఖీ.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.