అనుకోకుండా చేసిన తప్పిదం.. రష్మికపై ప్రముఖ హీరో ఫైర్ ..!

అనుకోకుండా చేసిన తప్పిదం..  రష్మికపై ప్రముఖ హీరో ఫైర్ ..!

"గీత గోవిందం" చిత్రంతో పాపులర్ అయిన నటి రష్మిక మందాన (Rashmika Mandanna). అనుకోకుండా చేసిన ఓ చిన్న తప్పిదానికి ఆమె నిర్మాతలతో పాటు ఓ ప్రముఖ హీరో ఆగ్రహానికి కూడా గురైనట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రష్మిక ఇటీవలే హీరో కార్తీ సరసన నటించేందుకు ఓ సినిమాకి సైన్ చేసింది. ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే చిత్ర బృందంతో పాటు.. దర్శకుడు ఇదే సినిమాకి సంబంధించి ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమా టైటిల్‌ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసి.. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయాలన్నది వారి ప్లాన్.

అయితే ఆ ప్లాన్ విషయం తెలియని రష్మిక.. తన  ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా టైటిల్‌ను పోస్టు చేసేసింది. ‘‘సుల్తాన్‌’ సినిమా చిత్రీకరణలో నాలుగోరోజు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. అభిమానులతో ఇన్‌స్టాలో మాట్లాడుతూ.. కామెంట్ రూపంలో ఈ క్యాప్షన్ ఇచ్చేసింది. దీంతో నిర్మాతలు కంగు తిన్నారట. భారీస్థాయిలో ప్లాన్ చేసి.. టీజర్‌తో పాటు టైటిల్ రిలీజ్ చేయాలని తాము భావిస్తే.. రష్మిక ఇలా చేయడంతో వారు ఆమెపై కోపగించుకున్నారని టాక్.  ఇలా చేసి.. స్వయానా తమ హీరోయినే  సస్పెన్స్ మూడ్‌ను పాడుచేసిందని చెబుతూ.. వారు నిరాశకు గురయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. 

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. లాల్, యోగిబాబు, నెపోలియన్ మొదలైన వారు నటిస్తున్నారు. రష్మిక టైటిల్ రివీల్ చేశాక.. హీరో కార్తీ కూడా ఆమెపై కోపంగా ఉన్నారని పలు వెబ్ సైట్లు వార్తలు ప్రచురించడం గమనార్హం. రష్మిక టైటిల్ రివీల్ చేసి నిర్మాతల ప్లాన్ పాడు చేసిన విషయం తెలుసుకున్నాక.. ఆమెపై సోషల్ మీడియాలో ట్రాల్స్ కూడా ప్రారంభమయ్యాయి. రష్మిక గీతగోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలతో తెలుగులో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 

2016లో కన్నడ చిత్రం "కిరాక్ పార్టీ"తో తన కెరీర్ ప్రారంభించిన రష్మిక.. "ఛలో" చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. అంజనీపుత్ర, చమక్, యజమాన ఈమె నటించిన ఇతర కన్నడ చిత్రాలు. "గీత గోవిందం"లో విజయ్ దేవరకొండ సరసన నటించిన రష్మిక.. ఆ సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. "కిరాక్ పార్టీ" చిత్రీకరణ సమయంలోనే రష్మిక.. సహ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. తర్వాత వారి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ జంట తర్వాత విడిపోయింది. 

ఈ ముద్దుకు... కథకు సంబంధముంది: 'డియర్ కామ్రేడ్' కథానాయిక రష్మిక

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న "సరిలేరు నీకెవ్వరు" చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. ఈ సినిమాలో మహేశ్‌బాబు మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో తన అభిమానులకు కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దిల్ రాజుతో పాటు మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమా మహేష్ బాబు అభిమానులకు కనువిందు చేయనుంది.                   

అలాంటి సినిమాలు నేను చేయను.. పాత్రల విషయంలో పక్కాగా ఉంటా: రష్మిక

Featured Image - Instagram.com/Rashmika Mandanna

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.