ADVERTISEMENT
home / Bollywood
RX 100 హీరో “కార్తికేయ” కొత్త చిత్రం… “హిప్పీ” టీజర్ ఎందుకు స్పెషల్ అంటే..?

RX 100 హీరో “కార్తికేయ” కొత్త చిత్రం… “హిప్పీ” టీజర్ ఎందుకు స్పెషల్ అంటే..?

RX 100 చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ (Tollywood)లో సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ (Karthikeya). తొలి చిత్రంతోనే మంచి అభినయ ప్రధానమైన క్యారెక్టర్‌తో పాటు, ఒక వైవిధ్యమైన కథని కూడా ఎంపిక చేసుకున్నాడు ఈ యువ కథానాయకుడు. తద్వారా అటు సినీ పరిశ్రమ దృష్టిని.. ఇటు ప్రేక్షకులని తన వైపుకి తిప్పుకోగలిగాడు.

అలా మొదటి చిత్రంతోనే ఒక మంచి హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో.. తర్వాత ఎలాంటి సినిమాకి సైన్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సమయంలో “హిప్పీ” (Hippi) అనే చిత్రాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు కార్తికేయ. కార్తికేయ నటించిన మొదటి చిత్రానికి “RX 100” అని ఒక మోటార్ సైకిల్ పేరును ఎంపిక చేసిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడేమో “హిప్పీ” అనే డిఫరెంట్ పేరును సినిమాకి పెట్టడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? అనే డిస్కషన్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి.

 

ఈ క్రమంలోనే “హిప్పీ టీజర్” విడుదలైంది.  హీరో నాని హిప్పీ టీజర్‌ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం గమనార్హం.

ADVERTISEMENT

ఇక ఈ టీజర్ ద్వారా హీరో పాత్రకు సంబంధించి హింట్‌ని కూడా మనకి ఇచ్చేశాడు దర్శకుడు టీఎన్ కృష్ణ (TN Krishna). టీజర్ మొదలవుతూనే ఒక డిఫరెంట్ డైలాగ్‌తో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరిగింది.

“ఆల్రెడీ  ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకొకరిని పట్టుకున్నారు!! అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతు అంటారు” అని వెన్నెల కిషోర్ పాత్ర.. హీరో కార్తికేయతో అనడంతో.. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ పాటికే మీకర్థమై ఉంటుంది.

అలాగే ఈ టీజర్‌లో.. హీరో పాత్ర టైటిల్‌కి తగ్గట్టుగానే ఎటువంటి బాదరబందీ లేకుండా.. అమ్మాయిల వెంట పడే ఒక ప్లేబాయ్‌గా కనిపించడం గమనార్హం.

 

ADVERTISEMENT

ఈ చిత్రంలో నటించిన ఇద్దరు కథానాయికలు – దిగాంగణ సూర్యవంశీ (Digangana Suryavanshi) & జజ్భా సింగ్ (Jazba Singh) కూడా సినిమాకి పూర్తి స్థాయిలో గ్లామర్ అద్దారనే చెప్పాలి.  అలాగే హీరో పాత్ర ప్లే బాయ్ కావడంతో టీజర్‌లో పలు ముద్దు సన్నివేశాలకు కూడా చోటు కల్పించారు దర్శకులు.

ఇక టీజర్ చివరలో హీరోయిన్‌తో హీరో పాత్ర చెప్పే డైలాగ్స్ కూడా వెరైటీగా ఉన్నాయి.  “నువ్వు నన్ను ప్లే బాయ్‌లా చూస్తున్నావు.. కాని నేను లవర్ బాయ్‌ని” అని హీరో, హీరోయిన్‌తో అంటాడు.

క్వాలిటీ పరంగా కూడా ఈ సినిమాకి మంచి సాంకేతిక వర్గమే పనిచేసిందని చెప్పవచ్చు.

ఆర్డీ.రాజశేఖర్ ఈ చిత్రానికి (RD Rajasekhar) ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా.. నివాస్ కే ప్రసన్న (Nivas K Prasanna) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హిప్పీ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకి తొలిసారిగా.. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు టీఎన్ కృష్ణ. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను (Kalaipuli S. Thanu) అనే చెప్పుకోవాలి. అలాగే ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ADVERTISEMENT

అలాగే.. ఈ హిప్పీ టీం తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి ఏప్రిల్ లేదా మే నెలలో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం తర్వాత కార్తికేయ… హీరో నానితో కలిసి విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రానికి సైన్ చేయడం విశేషం.

ఇంతకి హిప్పీ అంటే ఎవరో తెలుసా “అందరితో బంధాలు తెంచుకొని.. తనకి నచ్చినట్టుగా బ్రతుకుతూ.. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లే సంచారి” అని అర్ధం…!

ఇవి కూడా చదవండి

“సాహూ” నిర్మాతలకి ప్రభాస్ పెట్టిన చిత్రమైన కండీషన్.. వింటే ఆశ్చర్యపోతారు..!

ADVERTISEMENT

ప్రేమ పెళ్లా.. పెద్దలు కుదిర్చిన పెళ్లా.. ఏది మంచిది?

కూతురి డ్యాన్స్ చూసి.. మురిసిపోయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు</p

21 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT