ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
భారత్ చిత్రం కోసం ఏకంగా థియేటర్లనే బుక్ చేసిన అభిమానులు..

భారత్ చిత్రం కోసం ఏకంగా థియేటర్లనే బుక్ చేసిన అభిమానులు..

“సబ్ కి ఆన్.. సబ్ కి షాన్.. సబ్ క ఏక్ భాయిజాన్ …” –  సల్మాన్ ఖాన్ (Salman Khan). సల్లూ భాయ్ చిత్రం విడుదలవుతోందంటే చాలు.. ఆ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సల్మాన్ చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది.

ఇలా రంజాన్ (ఈద్) (Ramzan) సందర్భంగా విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రాలలో సింహ భాగం విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం. దాదాపు ప్రతి చిత్రం రూ 100 కోట్ల బిజినెస్ ని చేయగలిగింది. ఆఖరికి సల్మాన్ కెరీర్ లో ఫ్లాప్ గా పేర్కొన్న ట్యూబ్ లైట్ చిత్రం కూడా రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందే. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద రూ 100 కోట్లు ఆర్జించగలిగింది. దీన్ని బట్టి సల్మాన్ ఖాన్ సినిమా స్టామినా ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అతని నుంచి వచ్చిన ఒక ఫ్లాప్ చిత్రం సైతం రూ 100 కోట్లు కొల్లగొట్టిందంటే; ఇక హిట్ చిత్రమైతే దానికి వచ్చే వసూళ్ళు రూ 300 కోట్లు పైమాటే..

ఇక సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో చిత్రం రంజాన్ కి విడుదలవుతుంది అంటే చాలు.. అది తప్పకుండా హిట్ అయి తీరుతుందని ముందే ఫిక్స్ అయిపోతారు. ఈ క్రమంలోనే సల్లూ భాయ్ పై తమకున్న అభిమానాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటారు. 

అయితే ఆ అభిమానం ఈసారి ఇంకాస్త హద్దు దాటింది. భారత్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా జూన్ 5వ తేదీ ఉదయం ఈ సినిమా ప్రదర్శించనున్న థియేటర్స్ లో మొదటి షో కి ఉన్న టికెట్స్ మొత్తాన్ని అభిమానులు కొనుగోలు చేయడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇలా చేసింది ఎవరో ఒక అభిమాని అయితే ఏదో అనుకోవచ్చు… కాని దాదాపు ముగ్గురు సల్మాన్ ఖాన్ వీరాభిమానులు వివిధ ప్రాంతాల్లో తొలిరోజు తొలి షో టికెట్స్ మొత్తాన్ని ఖరీదు చేసి అందరికి ఒక రకంగా షాక్ ఇచ్చారు.

ADVERTISEMENT

ముంబయికి చెందిన విజయ్ షా అనే వీరాభిమాని ప్రఖ్యాత ‘గెయిటి’ థియేటర్ (Gaiety Theater)లో సల్మాన్ చిత్రం విడుదల సందర్భంగా మొదటి ఆటకు 150 టికెట్స్ కొనుగోలు చేశాడు. అదే విధంగా ఆశిష్ సింఘాల్ (Ashish Singal) అనే మరో అభిమాని తన స్వస్థలం అయిన నాసిక్ లో ఒక థియేటర్ లో తోలిరోజు తొలి ఆటకి సంబంధించి అన్ని టికెట్స్ కొనుగోలు చేశాడు. 

అయితే ఈ ఇద్దరూ భారతదేశానికి చెందిన వారు కాగా; నేపాల్ (Nepal) దేశంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ క్లబ్ తరపున ‘భారత్’ చిత్రం ప్రదర్శించనున్న థియేటర్ లో తోలి ఆటకి సంబంధించి ఉన్న టికెట్స్ అన్నీ కొనుగోలు చేసేశారు. దీనిని బట్టి చూస్తే..  సల్మాన్ ఖాన్ ఫ్యాన్ మేనియా పక్క దేశాల్లో కూడా విస్తరించింది ఉందని మనకు అర్థమైపోతోంది. అయితే అక్కడ కూడా సల్మాన్ చిత్రం కొత్త రికార్డులు నెలకొల్పే ఆస్కారం ఉంది.

ఇక ‘భారత్’ చిత్రం విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ సొంత బావ అయిన అతుల్ అగ్నిహోత్రి నిర్మించిన ఈ సినిమాకు కథ, కథనం & దర్శకత్వ బాధ్యతలు వహించింది అలీ అబ్బాస్ జాఫర్. తొలుత ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన నటించేందుకు ప్రియాంక చోప్రాని ఎంపిక చేసుకోగా అనుకోని పరిణామాల కారణంగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో కత్రినా కైఫ్ ని తీసుకున్నారు.

రంజాన్ సందర్భంగా బుధవారం (జూన్ 5)న విడుదలకానున్న భారత్ చిత్రం కూడా కచ్చితంగా  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని, ఘన విజయాన్ని సాధిస్తుందని అంతా ఆశిస్తున్నారు. చూద్దాం.. మరి, ఈ చిత్రం ఎన్ని కలెక్షన్లను రాబడుతుందో..

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ “ఫలక్ నుమా దాస్” మూవీ రివ్యూ – ఇది పక్కా హైద్రాబాదీ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!

ఆమెను ట్రోల్ చేసి.. ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సల్మాన్ అభిమాని

ADVERTISEMENT
03 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT