ADVERTISEMENT
home / Celebrity Life
ఆమెతో కలిసి ఆమెలా నటించడం.. ఓ గ్రేట్ ఫీలింగ్: సమంత అక్కినేని

ఆమెతో కలిసి ఆమెలా నటించడం.. ఓ గ్రేట్ ఫీలింగ్: సమంత అక్కినేని

టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం “ఓ బేబీ” (Oh Baby) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరియన్ చిత్రం “మిస్ గ్రానీ” (Miss Granny) కి ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రంలో అలనాటి నటి లక్ష్మి ప్రధాన పాత్ర పోషించడం విశేషం. డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమంత తన మనసులోని భావాలను పంచుకున్నారు.

ముఖ్యంగా సీనియర్ నటి లక్ష్మితో  (Lakshmi)  కలిసి పనిచేయడం ఓ గ్రేట్ ఫీలింగ్ అని ఆమె తెలిపారు. “ఒక రకంగా చెప్పాలంటే ఆమెతో మాట్లాడి తెలుసుకున్న కొత్త విషయాలు నాకు కొత్త పాఠాల్లాంటివి. సినిమా కథలో భాగంగా ఆమెను అనుకరించడానికి కూడా కొంత ట్రై చేశాను. ఆమెలా నటించడానికి, ఆమె నడక స్టైల్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించాను.  అలాగే కొంత నెర్వస్‌గా కూడా ఫీలయ్యాను.” అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపారు సమంత (Samantha Akkineni)

“ఓ బేబీ” చిత్రంలో సమంత సింగర్ పాత్రలో నటిస్తున్నారు. వార్థక్యంలో కుటుంబానికి దూరమైన ఓ మహిళకు.. తిరిగి ఏదైనా మ్యాజిక్ వల్ల తన యవ్వనం తిరిగి వస్తే.. ఎలా ఉంటుందనేది ఈ చిత్రకథ.  ఈ చిత్రంలో నాగశౌర్య, రావు రమేష్, స్నిగ్ధ, రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, తేజ సజ్జా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. రామ్ చరణ్, సమంత కలిసి నటించిన “రంగస్థలం” చిత్రంలోని “ఎంత సక్కగున్నావే” అనే పాట టైటిల్‌నే ఈ చిత్రానికి ట్యాగ్ లైన్‌గా పెట్టడం గమనార్హం.

 

ADVERTISEMENT

గత సంవత్సరం నవంబరు నెలలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. మే 24వ తేదిన ఈ చిత్రం టీజర్ విడుదలైంది. కొరియన్ చిత్రం “మిస్ గ్రానీ” 2014లో విడుదలైన పెద్ద హిట్ చిత్రం. ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది.

అలాంటి చిత్రానికి రీమేక్‌గా వస్తున్న “ఓ బేబీ” చిత్రంపై క్రిటిక్స్‌కు మంచి అంచనాలే ఉన్నాయి. చాలారోజుల తర్వాత అలనాటి నటి లక్ష్మి ఈ చిత్రం ద్వారా మళ్లీ తెరమీదకి రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో ఒకప్పుడు తిరుగులేని కథానాయికగా వెలుగొందిన లక్ష్మీ హిందీలో ” జూలీ ” అనే చిత్రంలో కూడా నటించారు.

 

1976లో విడుదలైన ఆ చిత్రం ఆమెకు బాలీవుడ్‌లో ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా తీసుకొచ్చి పెట్టింది. తన కెరీర్‌లో 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు అందుకున్న లక్ష్మీ సహాయ నటిగా కూడా రాణించారు. ముఖ్యంగా మురారి, ప్రేమించు, లాహిరి లాహిరి లాహరిలో, చింతకాయల రవి, మిథునం చిత్రాలలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు కూడా  అందుకుంది. ప్రస్తుతం ఆమె మన్మధుడు 2 లో కూడా నటిస్తున్నారు.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ఇవి కూడా చదవండి

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

ADVERTISEMENT

“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

30 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT