సారా అలీ ఖాన్ & కార్తిక్ ఆర్యన్ నటించిన.. 'లవ్ ఆజ్ కల్ ' ట్రైలర్ టాక్ మీకోసం

సారా అలీ ఖాన్ & కార్తిక్ ఆర్యన్ నటించిన.. 'లవ్ ఆజ్ కల్ ' ట్రైలర్ టాక్ మీకోసం

Love Aaj Kal Trailer Talk

10 ఏళ్ళ క్రితం అనగా 2009 జులై 31 తేదిన హిందీలో వచ్చిన లవ్ ఆజ్ కల్ (love aaj kal) చిత్రం .. బాలీవుడ్‌లో వచ్చిన ప్రేమకథలలో ఒక కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది. ఆ చిత్రంలో నటించిన సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొణేలకు మంచి పేరుతో పాటు స్టార్ స్టేటస్‌ని కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రం. పైగా ఈ సినిమా దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ చిత్రం అందించిన విజయంతో.. హిందీలో స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.

దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ 'నుమాయిష్' : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం

ఈ సినిమా అప్పట్లో ఎంతగా సంచలనం సృష్టించిందో చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఈ చిత్రకథకు తెలుగులో 'తీన్ మార్' పేరుతో పవన్ కళ్యాణ్ హీరోగా.. తెలుగు నేటివిటీగా అనువుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాయగా.. జయంత్ దర్శకత్వం వహించారు. దీన్ని బట్టి 'లవ్ ఆజ్ కల్' చిత్రాన్ని భాషలకతీతంగా ప్రేక్షకులు ఆదరించే ఇతివృత్తం ఉన్న ఒక అంశంగా చూడవచ్చు.

ఇక 2009లో వచ్చిన 'లవ్ ఆజ్ కల్' చిత్రం అప్పటి సమాజంలోని ప్రేమలను అద్దంపట్టే విధంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు 2020లో ప్రేమకి ఉన్న విలువను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం లవ్ ఆజ్ కల్ #2020. ఈ చిత్రానికి కూడా ఇంతియాజ్ అలీనే దర్శకత్వం వహించడం విశేషం.

అయితే 2009లో వచ్చిన 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటిస్తే, ఇప్పటి 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో మాత్రం ఆయన కూతురు సారా అలీ ఖాన్ (sara ali khan) హీరోయిన్‌గా నటించడం గమనార్హం. ఈ 'లవ్ ఆజ్ కల్' చిత్రం వచ్చే నెల 'వాలెంటైన్స్ డే' స్పెషల్‌గా ఫిబ్రవరి 14 తేదిన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక కొద్దిసేపటి క్రితమే, 'లవ్ ఆజ్ కల్' చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. సహజంగానే 'లవ్ ఆజ్ కల్' టైటిల్ పేరిట చిత్రం వస్తుందంటేనే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. అలాంటిది ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ (karthik aryan) అంటే తనకి క్రష్ ఉందని సారా అలీ ఖాన్ చెప్పడంతో.. 'వీరి మధ్య ప్రేమ మొదలైంది' అన్న వార్తల నడుమ.. ఈ ఇద్దరు కలిసి ఒక ప్రేమకథలో నటించడం.. ఆ వార్తలకి మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. 

2019 Tollywood Review : అభిమానుల అంచనాలు పెంచాయి.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

మరి ఇన్ని రకాల అంచనాలు & ఆసక్తి మధ్య విడుదలైన లవ్ ఆజ్ కల్ ట్రైలర్ ఎలా ఉందంటే -

 

దర్శకుడు ఇంతియాజ్ అలీ.. తను గతంలో తీసిన  'లవ్ ఆజ్ కల్' సినిమా  మాదిరిగానే.. ఈ చిత్రంలో కూడా 1990, 2020 లలో కనిపించే ప్రేమలలోని అంతరాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. మొదట తీసిన 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో సైతం 1970, 2000లలో ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపించిన ఆయన.. ఇప్పుడు మరో ప్రయోగానికి సంసిద్ధుడవుతున్నాడు. 

అలాగే ఇంతియాజ్ అలీ రాసిన ఆకట్టుకునే సంభాషణలు ఈ సినిమాకి అదనపు బలం. ప్రధానంగా హీరో, హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాల్లో పలికించిన సంభాషణలు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

వీటికి తోడుగా కార్తిక్ ఆర్యన్ 90వ దశకం స్టైల్‌తో పాటు.. ఇప్పటితరం లుక్స్‌లో చక్కగా ఒదిగిపోయారు. ఆరుషి. సారా అలీ ఖాన్‌లు కూడా తమ పాత్రల్లో చక్కగా రాణించారనే అనిపిస్తోంది. ఇక ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ చిగురించే సమయంలో తలెత్తే సున్నితమైన సమస్యలని  సైతం.. ఈ చిత్రంలో ఇంతియాజ్ తనదైన రీతిలో చూపించే ప్రయత్నం చేశాడు.

ఇవన్నీ పక్కకి పెడితే, సంగీత దర్శకుడు ప్రీతమ్ మరోసారి ఈ చిత్రానికి అనువైన ట్యూన్స్ ఇచ్చాడనే తెలుస్తోంది. పదేళ్ల క్రితం వచ్చిన చిత్రంలో హిట్ ఆయిన ట్యూన్‌ని.. మరోసారి ఈ చిత్రంలో ఆయన వాడారు. ఇక అమిత్ రాయ్ అందించిన ఛాయాగ్రహణం కూడా ఈ చిత్రానికి మరొక అదనపు ఆకర్షణ.

మొత్తానికి పదేళ్ల క్రితం వచ్చిన 'లవ్ ఆజ్ కల్' ఎంతలా అయితే ప్రేక్షకులని అలరించిందో .. ఇప్పుడు వస్తున్న ఈ 'లవ్ ఆజ్ కల్' కూడా.. అదే స్థాయిలో ప్రేక్షకులని తప్పక మెప్పిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. మీరూ కూడా 'లవ్ ఆజ్ కల్' ట్రైలర్‌లో (love aaj kal trailer)  మీకు నచ్చిన, నచ్చని అంశాలు ఏంటో ఈ క్రింద కామెంట్ చేయండి.

Tollywood Best Songs 2019 : ప్రేక్షకుల మదిని దోచిన.. 20 పసందైన తెలుగు పాటలు మీకోసం ..!