ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్‌బాస్ తెలుగు 3 :  బిగ్‌బాస్ ఇంటిలో సీక్రెట్ వీడియోస్ రేపిన చిచ్చు!

బిగ్‌బాస్ తెలుగు 3 : బిగ్‌బాస్ ఇంటిలో సీక్రెట్ వీడియోస్ రేపిన చిచ్చు!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో భాగంగా నిన్న ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇంటిలోని కొందరు సభ్యులని ఎంపిక చేసుకుని వారికి సంబంధించిన కొన్ని వీడియోస్‌ని కన్ఫెషన్ రూమ్‌లో ఇతరులకు చూపించడం ద్వారా… బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యుల ప్రమేయం లేకుండానే వారి మధ్య విభేదాలు ఏర్పడేలా చేశాడు బిగ్‌బాస్.

బిగ్‌బాస్ తెలుగు 3 : టాలెంట్ షోలో చిందేసిన హౌస్ మేట్స్

ముందుగా పునర్నవికి తన గురించి తన వెనుక వితిక మాట్లాడిన మాటలను చూపెట్టారు బిగ్ బాస్. అలా చూపెట్టిన తరువాత, ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన పునర్నవి.. తన వెనుక మాట్లాడడం ద్వారా అందరి ముందు నువ్వే బ్యాడ్ అవుతున్నావు వితిక అని చెబుతుంటే.. మిగతా ఇంటి సభ్యులు మాత్రం పునర్నవి ఇది ఒక సీక్రెట్ టాస్క్‌లో భాగంగానే ఇలా ముభావంగా ఉందని అనుకోసాగారు.

పునర్నవి తరువాత శ్రీముఖిని కన్ఫెషన్ రూమ్‌కి పిలవడం జరిగింది. టాస్క్‌లో రవిక్రిష్ణకి గాయమైన సందర్భంగా పునర్నవి, వితిక & రాహుల్ సిప్లిగంజ్‌లు ఆమెని ఎంతలా దుర్భాషలాడారు అన్నది చూపెట్టారు. అప్పటికే రాహుల్ పైన మంచి అభిప్రాయంతో లేని శ్రీముఖికి… ఈ వీడియో మరొక అదనపు అంశంగా మారింది. అయితే తనని అలా అనడం చాలా తప్పు అంటూ.. తన వెనుక మాట్లాడిన వారికి చెప్పే ప్రయత్నం చేసింది శ్రీముఖి.

ADVERTISEMENT

ఇక ముచ్చటగా మూడవ కంటెస్టెంట్‌గా అలీ రెజా కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లడం జరిగింది. అలా కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లిన అలీ రెజాకి ఒకటి హిమజ తనని తప్పుగా అర్ధం చేసుకుని తిడుతున్న వీడియో అయితే… ఇంకొకటి బాబా భాస్కర్‌ని అలీ రెజా నామినేట్ చేసినందుకు ఆయన కంటతడి పెట్టిన వీడియో. ఈ వీడియో చూసిన వెంటనే ఎమోషనల్ అయిన అలీ.. వెంటనే వచ్చి మరోసారి బాబా భాస్కర్‌ని క్షమాపణ కోరాడు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా Vs మహేష్ విట్టా & శ్రీముఖి Vs రాహుల్ సిప్లిగంజ్

ఇదే వరుస క్రమంలో కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లిన హిమజకి.. బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల మనఃశ్శాంతిని పాడు చేయడంతో పాటుగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని కూడా చెడగొట్టాలని చెప్పడం జరిగింది. ఇది గనుక చెప్పిన విధంగా పూర్తి చేస్తే వచ్చే వారం నామినేషన్స్‌లో ఉండకుండా బయటపడతావు అని బిగ్‌బాస్ చెప్పారు. అయితే హిమజ చేసేది సీక్రెట్ టాస్క్ అని అర్ధమైన ఇంటి సభ్యులు.. ఆమెని లగ్జరీ ఐటమ్స్‌ని చెడగొట్టకుండా అడ్డుకోగలిగారు. కాకపోతే, ఇంటి సభ్యులైన అలీ రెజా, వితిక & మరికొందరి వస్తువులని చాలా తెలివిగా దొంగిలించి వాటిని స్టార్ రూమ్‌లో పెట్టేసింది. అలాగే ఇంటి సభ్యుల గుడ్లని కింద పడేసి ధ్వంసం చేసి ఇంటి సభ్యుల మధ్య చర్చకి కారణమైంది. అయితే లగ్జరీ బడ్జెట్ టాస్క్ చెడగొట్టలేని కారణంగా.. హిమజ ఇమ్యూనిటీ పొందే అవకాశాన్ని పోగొట్టుకుంది.

ఇదిలావుండగా అర్ధరాత్రి 12 అవుతుండగా.. రాహుల్ సిప్లిగంజ్‌కి పుట్టినరోజు కేక్ ని పంపించడం జరిగింది. అలా రాహుల్ ఈ సంవత్సరం పుట్టినరోజుని బిగ్‌బాస్ ఇంటి సభ్యుల సమక్షంలో సరదాగా జరుపుకున్నాడు. అలాగే తొలి కేక్ ముక్కని.. బాబా భాస్కర్‌కి తినిపించి ఆశీర్వాదం తీసుకున్నాడు. మనస్పర్థలు ఉన్నప్పటికి రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే కేక్ దగ్గరుండి కట్ చేయించింది శ్రీముఖి.

ADVERTISEMENT

ఇక ఈరోజు, రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో నాగార్జున ఇంటి సభ్యులతో ఏం మాట్లాడతారు? వారికి ఏం చెబుతారు?? ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన శివజ్యోతి, బాబా భాస్కర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, ఆషు రెడ్డి & పునర్నవిలలో ఎవరు ఈ వారం ఇంటి నుండి విడిచి వెళ్లిపోనున్నారు.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియనున్నాయి. అలాగే నాగార్జున ఈ వారం బిగ్ బాస్ షోలో ఏం చెబుతారో అన్నది కూడా చూడాలి.

Bigg Boss Telugu 3 : కంటెస్టెంట్స్ దుమ్ము దులిపిన నాగార్జున .. తీవ్ర హెచ్చరికలు జారీ

23 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT