మరో తెలుగు సినిమా రీమేక్ లో నటించనున్న షాహిద్ కపూర్

మరో తెలుగు సినిమా రీమేక్ లో నటించనున్న షాహిద్ కపూర్

హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకడిగా ఎదిగాడు షాహిద్ కపూర్ (shahid kapoor). ఈ ఏడాది ఆయన నటించిన కబీర్ సింగ్ (kabir singh) చిత్రం బాక్సాఫీస్ రికార్డులని తిరగరాయడమే కాకుండా షాహిద్ కెరీర్ మొత్తం లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ అభినయానికి ఎంతోమంది ఫిదా అయ్యారు, సినిమా కథని విమర్శించిన వారు కూడా షాహిద్ నటనకి మాత్రం వంక పెట్టలేకపోయారు.

'న్యాచురల్ స్టార్ నాని - అంజన'ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!

ఇక అంత పెద్ద హిట్ చిత్రం తరువాత షాహిద్ ఎలాంటి చిత్రాన్ని అంగీకరిస్తాడు అని అందరూ ఎదురుచూస్తుండగా.. తన తదుపరి చిత్రంగా షాహిద్ ఓ సూపర్ హిట్ తెలుగు చిత్రాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకి ఆ సూపర్ హిట్ తెలుగు చిత్రం ఏంటంటే - జెర్సీ (jersey).

 

పూర్తి వివరాల్లోకి వెళితే, అర్జున్ రెడ్డి (arjun reddy) చిత్రం హిందీ రీమేక్ లో నటించడం.. అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా తెలుగు చిత్రాల పట్ల షాహిద్ కపూర్ కి ఆసక్తి పెరిగింది. అందుకే తెలుగులో మంచి విజయవంతమైన జెర్చీ చిత్త్రారం ఆఫర్ తనకు రాగానే వెంటనే ఆలోచించకుండా ఓకే చెప్పాడట ఈ హీరో. స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం గురించి.. అది సాధించిన రికార్డుల గురించి మనందరికీ తెలిసిందే.

నాని (nani) కెరీర్ లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన చిత్రంగా జెర్సీ చిత్రం నిలిచిపోయింది. అదే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమ మొదలైన నాటి నుండి వచ్చిన మంచి చిత్రాలలో ఈ జెర్సీ కూడా ఒకటి అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి ప్రశంసలు కూడా కురిపించారు. ప్రధానంగా ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధాన్ని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. గెలుపు కోసం ప్రయత్నిస్తూ మరణించిన ఓ వ్యక్తి కథ అయిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రూపొందుతుందని అంతా విడుదల సమయంలోనే భావించారు. ఇక ఈ చిత్రాన్ని తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా జెర్సీ చిత్రం హిందీలో తీస్తే, చాలా మంది ప్రేక్షకులకి ఇది దగ్గరవుతుంది అనే భావనలో ఉండగా.. షాహిద్ కపూర్ కి ఈ చిత్రం నచ్చడంతో జెర్సీ హిందీ రీమేక్ పట్టాలెక్కేసింది. 

'జెర్సీ' తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? - మూవీ రివ్యూ

ఇప్పుడు హిందీ రీమేక్ కి సంబందించిన వివరాలు తెలియవచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయడానికి ముందుకి వచ్చింది హిందీ చిత్రసీమలో పేరున్న నిర్మాణ సంస్థలు కాకపోవడం విశేషం. మరి ఎవరు తెరకెక్కిస్తున్నారు అని అనుకుంటున్నారా? తెలుగు చిత్రసీమలో పెద్ద నిర్మాతలైన అల్లు అరవింద్ & దిల్ రాజు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబదించిన వార్త ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యనే దిల్ రాజు తన నిర్మాణ సంస్థ ప్రారంభించి 20 ఏళ్ళు పూర్తయిన వేళ, మాట్లాడుతూ - త్వరలోనే హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాం.. అని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీగా ఆగష్టు 28, 2020ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పక్కన నటించబోతున్న నటి ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు. 36 ఏళ్ళ వయసులో క్రికెట్ లోకి పునరాగమనం చేసిన ఓ వ్యక్తి భారత జట్టుకి ఎలా ఎంపికయ్యాడు అనే కథాంశం పైన తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Sye Raa Narasimha Reddy Movie Review : 'సైరా' చిత్రంలో.. 'సై.. సైరా' అనిపించే 9 అంశాలివే

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.