ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3 : ఫోన్ లిఫ్ట్ చేయడమే తప్పైంది.. నామినేషన్‌లో శ్రీముఖి

Bigg Boss Telugu 3 : ఫోన్ లిఫ్ట్ చేయడమే తప్పైంది.. నామినేషన్‌లో శ్రీముఖి

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) ‘సీజన్ 3’‌లో భాగంగా.. ఈ రోజు నుండి తొమ్మిదో వారం మొదలుకానుంది. ఇక ప్రతి వారం మొదటి రోజు.. ఆ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుందనేది తెలిసిన విషయమే. అలానే ఈ వారం నామినేషన్ టాస్క్‌లో భాగంగా.. బిగ్ బాస్ టెలిఫోన్ భూత్‌ని ఏర్పాటు చేశారు.

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?

అలా ఏర్పాటు చేసిన ఫోన్ భూత్ టాస్క్‌లో భాగంగా.. హౌస్‌లో మొట్టమొదటిగా ఫోన్ లిఫ్ట్ చేయడాన్ని కారణంగా చూపుతూ.. శ్రీముఖిని (Sreemukhi) నేరుగా నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అయితే గత సీజన్స్‌లో జరిగిన దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు శ్రీముఖి నామినేట్ (Nomination) అవ్వకుండా ఉండాలి అంటే .. ఆమె కోసం ఇంటి సభ్యులలో ఒకరు ఏదైనా త్యాగం చేయాల్సి ఉంటుంది.

మరి ఆ ఇంటి సభ్యుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత సీజన్‌లో కూడా ఇదే టాస్క్ జరగడం.. అందులో భాగంగా నామినేట్ అయిన భాను శ్రీ ఇంటి నుండి వెళ్లిపోవడం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే ఈ టాస్క్‌లో భాగంగా.. హూస్ మేట్స్ కేవలం స్నేహ భావాన్ని మాటలవరకే పరిమితం చేస్తారా? లేక త్యాగం చేయాల్సిన సమయం వస్తే.. తమవారి కోసం ముందుకి వస్తారా? అనేది తేలిపోతుంది. మరి ఈ టాస్క్ ద్వారా నామినేట్ అయ్యే సభ్యులు ఎవరనేది.. ఈ రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తేలిపోనుంది. అయితే టెలిఫోన్ భూత్ టాస్క్‌ని ప్రోమోలో చూసాక.. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగనుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్‌లో.. ఎక్కువమంది ఊహించినట్టుగానే శిల్పా చక్రవర్తి (Shilpa Chakravarthi) బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అలాగే బిగ్‌బాస్ హౌస్‌లో.. నిన్నటి సండే మొత్తం ఫన్‌‌డేగా గడిచిపోయింది. నామినేషన్స్‌లో ఉన్న నలుగురు – శ్రీముఖి, పునర్నవి, శిల్పా చక్రవర్తి, మహేష్ విట్టాల చేత నాలుగు స్కిట్స్ వేయించగా.. అందులో శ్రీముఖి వేసిన స్కిట్ నాగార్జునని మెప్పించడం గమనార్హం. 

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

ఆ తరువాత ఇంటి సభ్యులందరి పైన ప్రత్యేకంగా ఒక జింగిల్‌ని రూపొందించి.. దానికి డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేసే బాధ్యతను రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్‌లకి అప్పగించారు. ఈ క్రమంలో రాహుల్ హౌస్ మేట్స్ అందరికి జింగిల్స్ కంపోజ్ చేశారు. ఆ జింగిల్స్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వితిక జింగిల్‌కి నాగార్జున ఫిదా అయి.. విజిల్ కూడా కొట్టడం జరిగింది.

ADVERTISEMENT

ఆఖరికి శిల్పా చక్రవర్తి చేత హౌస్ మేట్స్‌కి కొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ ఇప్పించారు. ఆ టైటిల్స్ ఇచ్చే సమయంలో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ల విషయం అడగగా – ‘దయచేసి అందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి.. నాగార్జున గారు’ అని చెప్పడంతో బిగ్ బాస్ హౌస్‌లో నవ్వులుపూసాయి.

ఇలా సరదాగా సాగిపోయిన బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్‌లో 16 గుడ్లని హిమజకి బహుమతిగా ఇవ్వడం జరిగింది. వాటితో ఏదైనా రుచికరంగా చేసి తనకి పంపించమని నాగార్జున కోరగా.. హిమజ (Himaja) చేసి పంపిన ఆ పదార్ధం తిన్న తరువాత ‘ప్రేమగా చేసిపెట్టావు… అలాగే అది కాస్త రుచిగా కూడా ఉండేటట్టు చేస్తే బాగుండేది’ అని ఫన్నీగా సెటైర్ వేశారు. బాబా భాస్కర్ దగ్గర వంట నేర్చుకోమనే సలహాని కూడా హిమజకి ఇవ్వడం జరిగింది.

Bigg Boss Telugu 3: కెప్టెన్స్ టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!                                                                           

16 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT