ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్‌బాస్ తెలుగు 3 : శ్రీముఖి జోస్యం నిజమైంది… రోహిణి ఎలిమినేట్ అయింది..!

బిగ్‌బాస్ తెలుగు 3 : శ్రీముఖి జోస్యం నిజమైంది… రోహిణి ఎలిమినేట్ అయింది..!

బిగ్‌బాస్ తెలుగు 3 లో (Bigg Boss Telugu) నాలుగు వారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్ నుంచి నాల్గవ కంటెస్టెంట్ బయటకి వెళ్లారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు – రోహిణి. అయితే గత వారంలో ఒక రోజు శ్రీముఖి మాట్లాడుతూ.. “ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోయేది నువ్వే” అని రోహిణికి చెప్పడంతో … ఆమె కాస్త కలత చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ అంశాన్ని నాగార్జున కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక చివరికి… శ్రీముఖి అంచనా వేసినట్టుగానే రోహిణి ఈ వారం ఎలిమినేట్ అయింది.

బిగ్‌బాస్ తెలుగు 3 : ఇంటి సభ్యుల కోసం.. చిత్ర విచిత్రమైన అవార్డుల హంగామా..!

అయితే రోహిణి అసలు ఈ వారం నామినేషన్స్‌లోనే లేదు. కానీ నామినేషన్స్ ప్రక్రియ జరిగే సమయంలో “ఆ ప్రక్రియ గురించి మాట్లాడకూడదు” అనే నియమాన్ని ఉల్లఘించినందుకు శివ జ్యోతి & రోహిణిలను (Rohini) రెండు వారాల పాటు నేరుగా నామినేట్ చేస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. అలా బిగ్‌బాస్ వేసిన శిక్షకి గురై అనూహ్యంగా నామినేషన్స్‌లోకి వచ్చి.. ఏకంగా ఎలిమినేట్ అవ్వడం.. ఒక రకంగా కాస్త షాకింగ్‌కి గురి చేసే అంశం అనే చెప్పాలి.

ఏదేమైనా… ఇలా బిగ్‌బాస్ శిక్షకి గురై నామినేషన్స్‌లో నిలిచి.. ఆ తరువాత ఏకంగా బిగ్‌బాస్ హౌస్ వదిలి వెళ్లిన తొలి కంటెస్టెంట్‌గా రోహిణి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన “డైలాగ్ మారో టాస్క్” కూడా చాలా సరదాగా సాగిపోయింది. ఈ డైలాగ్స్ చెప్పడానికి ఒక ఇంటి సభ్యుడు.. మరొక ఇంటి సభ్యుడిని విలన్‌గా ఎంపిక చేసుకుని వారికి ఆ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఈ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ని విలన్‌గా ఎంపిక చేసుకుని శ్రీముఖి చెప్పిన డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక రకంగా రాహుల్‌ని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే వరకు కూడా.. శ్రీముఖి వెనక్కి తగ్గేలా లేదు అన్నది స్పష్టమైంది.

బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!

అంతకు ముందు నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్, రవికృష్ణ, శ్రీముఖి (Sreemukhi), రాహుల్ సిప్లిగంజ్ & రోహిణిలను కేంద్రంగా చేసుకుని ఒక కోర్ట్ టాస్క్‌ని ఆడించారు నాగార్జున. అందులో ఈ పైన పేర్కొన్న అయిదుగురు సభ్యులు “బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదు” అని అనుకుంటున్నారో  వాదించాలి అని కోరుతూ.. కొందరిని ఎంపిక చేశారు.

అలా శ్రీముఖికి వ్యతిరేకంగా హిమజ, రాహుల్ సిప్లిగంజ్‌కి వ్యతిరేకంగా పునర్నవి, రవికృష్ణకి వ్యతిరేకంగా వితిక, బాబా భాస్కర్‌కి వ్యతిరేకంగా మహేష్ విట్టా & రోహిణికి వ్యతిరేకంగా అషు రెడ్డిలు వాదించారు. ఈ టాస్క్ కూడా చాలా సరదాగా సాగింది. ముఖ్యంగా బాబా భాస్కర్ గురించి మహేష్ వాదిస్తూ మాట్లాడినప్పుడు.. అటు ఇంటి సభ్యులు, ఇటు నాగార్జునతోపాటు షో చూస్తున్న వీక్షకులు సైతం కడుపుబ్బా నవ్వుకున్నారు.

ADVERTISEMENT

అదే సమయంలో నిన్నటి ఎపిసోడ్‌లో ఏయే ఇంటి సభ్యులు ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని సేఫ్ జోన్‌లో ఉన్నారన్నది గిఫ్ట్ బాక్స్ & సీల్డ్ కవర్స్ రూపంలో తెలియచేశారు. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రోహిణిని… “ఇంటి సభ్యులకు విడివిడిగా ఎన్ని మార్కులు వేస్తావు” అని నాగార్జున అడిగ్గా… అందరికంటే ఎక్కువగా బాబా భాస్కర్ & శివ జ్యోతిలకు; అందరికంటే తక్కువగా మహేష్ విట్టాకు ఆమె మార్కులు ఇచ్చింది.

అలా బిగ్‌బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ చాలా ఫన్నీగా.. అదే సమయంలో ఆఖరిలో కాస్త ఎమోషనల్‌గా కూడా జరిగింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ప్రతి సోమవారం జరిగే నామినేషన్స్ ఉండబోతున్నాయి. మనకి ప్రసారం చేసిన ప్రోమో ప్రకారం.. ఇంటిలోని ఎక్కువమంది సభ్యులు రాహుల్ సిప్లిగంజ్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి, అది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూసి తీరాల్సిందే..

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

18 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT