నీరు (Water).. సమస్త ప్రాణకోటికి అత్యవసరమైన వనరుల్లో ముఖ్యమైనది. అయితే మానవ తప్పిదాల వల్ల భూమిపై నీటి శాతం అంతకంతకూ తగ్గిపోతోంది. ఇటీవలే చెన్నైలో వర్షాభావ పరిస్థితుల వల్ల నీళ్లు లేకుండా పోయి.. నగరవాసులంతా ఇబ్బంది పడిన పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. కొన్ని రోజులైతే మన హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అందులో ఎంత నిజం ఉందోనన్న సంగతి పక్కన పెడితే.. నీటి విలువ తెలుసుకొని దాని వాడకాన్ని తగ్గించడం.. నీటి వనరులను కాపాడడం వంటివి.. ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సిందే. అందుకే ప్రతి నీటి చుక్క విలువ అందరికీ తెలియడం కోసం ప్రారంభమైన ఛాలెంజ్ వన్ బకెట్ ఛాలెంజ్ (#onebucketchallenge).
ఆ వస్తువులు మనకు తెలియకుండానే.. పర్యావరణానికి హాని చేస్తున్నాయి..!
Shutterstock
సోషల్ మీడియాలో (Social media) ఇటీవలి కాలంలో చాలా క్రేజీ ఛాలెంజ్‌లు పుట్టుకొస్తూ వైరల్‌గా మారుతున్నాయి. అప్పట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్.. ఆ తర్వాత కికి ఛాలెంజ్ నుంచి తాజాగా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ వరకూ ప్రతిఒక్కరినీ ఆకట్టుకొని వారూ ప్రయత్నించేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే వరుసలో మరో ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. అదే వన్ బకెట్ ఛాలెంజ్.
That report is not accurate. Once water from #KaleshwaramProject reaches Yellampalli reservoir (next few weeks), it will ensure that 172 MGD supply to Hyderabad will continue unabated
At the same time, it’s time all citizens realise importance of water conservation & Harvesting https://t.co/Vf9wWXf6lw
— KTR (@KTRTRS) July 17, 2019
ప్రస్తుతం హైదరాబాద్‌లో మనకు అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 48 రోజులకు మాత్రమే సరిపోతాయని.. ఆ తర్వాత హైదరాబాద్‌కి కూడా చెన్నైకి పట్టిన గతే పడుతుందని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై దర్శకుడు మారుతి కేటీఆర్‌ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కూడా. సర్ ఇది నిజమేనా? అంటూ అడిగిన ఆయన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ జవాబిచ్చారు.
“ఆ వార్త నిజం కాదు. మరికొన్ని వారాల్లో కాళేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. దాని ద్వారా హైదరాబాద్‌కి రోజుకి 172 గ్యాలన్ల నీరు అందుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రజలందరూ కూడా నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అంటూ ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకోవడానికి హైదరాబాద్ వాటర్ బోర్డ్ ప్రారంభించిన రెండు థీమ్ పార్కులను సందర్శించి.. వాటర్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకోవచ్చు అని కూడా ట్వీట్ చేశారు.
#ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?
This day was always coming..Its coming in 43 days. Hyderabad is running out of water. We take water for granted. This July 21st take the #onebucketchallenge Lets help the government fight this crisis. The less we use, the more we save. Share,challenge ur friends, post ur stories pic.twitter.com/IfgGvRB1tt
— Nag Ashwin (@nagashwin7) July 18, 2019
వాన నీటిని కాపాడుకోవడంతో పాటు.. నీటి వృథాను అరికట్టేందుకు నీటి విలువను అందరికీ తెలియజేయాలని ప్రముఖ దర్శకుడు నాగ్ ఆశ్విన్ వన్ బకెట్ ఛాలెంజ్‌ని ప్రారంభించారు.
“ఈ రోజు ఎప్పుడోసారి వస్తుంది. హైదరాబాద్‌లో నీటి నిల్వలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. మనం నీళ్లను ఇష్టం వచ్చినట్లుగా వృథా చేస్తున్నాం. అందుకే ఈ జులై 21న మనమూ వన్ బకెట్ ఛాలెంజ్ తీసుకుందాం. నీటి విలువ తెలుసుకొని ప్రతి బొట్టునూ జాగ్రత్తగా వాడుతూ.. ఈ కష్టకాలాన్ని దాటేందుకు ప్రభుత్వానికి సాయం చేద్దాం.
ఎంత తక్కువగా వాడితే అంత ఎక్కువ పొదుపు చేస్తాం. అందుకే ఈ పోస్ట్‌ని షేర్ చేసి, మీ స్నేహితులను ఛాలెంజ్ చేయండి. రోజంతా ఒకే బకెట్ నీటిని ఉపయోగించి దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయండి” అంటూ రాశారు.
Who’s with me ? This Sunday.. One bucket challenge.. 🙌💪 (with pictures) .. no long showers , no washing vehicles , no leaving the tap on while you wash your face ….. I will post a pic of my bright blue bucket as well 😁 (no cheating) #everydropcounts pic.twitter.com/oP2Affd0OD
— Samantha Akkineni (@Samanthaprabhu2) July 18, 2019
టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని.. తన అభిమానులందరికీ హితవు పలికింది. “మనకు కుళాయిల్లోంచి నీళ్లు వస్తుంటాయి. కాబట్టి నీళ్లు లేకపోవడం అనేది ఉండదు అని మన భావన. కానీ అది నిజం కాదు. అపోహ మాత్రమే. మన నగరంలోని భూగర్భ జలాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. దీనికి గాను ప్రభుత్వం కూడా బోర్ వెల్స్ నియంత్రించేందుకు కఠినమైన చట్టాలు చేయాలి. అదే సమయంలో ప్రభుత్వానికి మనం కూడా సాయం చేయాలి. ఎందుకంటే నీళ్లు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది” అని రాసి ఉన్న ఫోటోని షేర్ చేసింది సమంత
ఇదే క్రమంలో “మరి నాతో ఎవరు ఉన్నారు? ఈ ఆదివారం వన్ బకెట్ ఛాలెంజ్ తీసుకోవడానికి ఎవరు సిద్ధం? ఫొటోలతో పాటు ఈ ఛాలెంజ్ తీసుకోవాలి. ఎక్కువసేపు షవర్ స్నానం, వాహనాలు కడగడం, ముఖం కడుక్కున్నప్పుడు కుళాయి తిప్పి వదిలేయడం వంటివి చేయద్దు. నేను నా నీలిరంగు బకెట్ ఫొటోని కూడా షేర్ చేస్తాను. చీటింగ్ చేయద్దు..” అంటూ ట్వీట్ చేసింది.
ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన జేసీబీ.. ఎందుకో తెలుసా?
Finally a meaningful challenge!
Do try this out..
This really needs immediate attention!
Please spread the word.
Challenging @upasanakonidela @RanaDaggubati @harish2you @IamSaiDharamTej pic.twitter.com/r77IMZ5EcZ— Varun Tej Konidela (@IAmVarunTej) July 18, 2019
కేవలం సమంత మాత్రమే కాదు.. నటుడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, అడవి శేష్, దర్శకుడు హరీష్ శంకర్, గాయని చిన్మయి, యాంకర్ రవి, వైవా హర్ష వంటి వాళ్లందరూ ఈ ఛాలెంజ్ తీసుకున్నారు. మరి, మీరూ ఈ వన్ బకెట్ ఛాలెంజ్‌ని ఓసారి ప్రయత్నించి చూస్తారా? చీటింగ్ చేయకండి. ఈ ఆదివారం మొత్తం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ.. కేవలం ఒక్క బకెట్ నీళ్లు మాత్రమే ఉపయోగించాలి. మరి, ఎంతమంది ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధం? కామెంట్లలో మాకు తెలియజేయండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.