ADVERTISEMENT
home / వినోదం
‘Gang Leader’ Film Review : నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో..మీరు థ్రిల్ ఫీలయ్యే 5 అంశాలివే

‘Gang Leader’ Film Review : నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో..మీరు థ్రిల్ ఫీలయ్యే 5 అంశాలివే

Gang Leader Movie Review (గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ)

న్యాచురల్ స్టార్ నాని (Nani) తాజాగా ఒక చిన్నపాటి గ్యాంగ్‌తో అల్లరి చేసేందుకు.. మన థియేటర్స్‌కు ‘గ్యాంగ్ లీడర్’ రూపంలో వచ్చేశాడు. ప్రోమోస్‌తో పాటు ట్రైలర్‌లో కూడా ఇది ఒక రివెంజ్ డ్రామాగా కనపడింది. అదే విషయాన్ని సినిమా యూనిట్ కూడా చెప్పడంతో.. ఈ చిత్రంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ రివెంజ్ ఎంటర్‌టైనర్‌లో రివెంజ్ ఏ రేంజ్‌లో ఉంది? ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉందనేది.. ఈ క్రింద చెప్పబోయే 5 పాయింట్స్‌లో తెలుసుకుందాం

నాని తన సినిమాకి.. అతన్నే హీరోగా ఎందుకు సెలెక్ట్ చేశాడంటే..?

ఇక ఈ గ్యాంగ్ లీడర్ (Gang Leader) కథ విషయానికి వస్తే,

ADVERTISEMENT

హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ బ్యాంక్‌లో ఆరుగురు వ్యక్తులు కలిసి రూ. 300 కోట్ల మేర డబ్బుని కొట్టేస్తారు. ఆ డబ్బుని దొంగిలించగానే.. అందులో అయిదుగురిని దేవ్ (కార్తికేయ) చంపేస్తాడు. ఆ చనిపోయిన అయిదుగురి  కుటుంబసభ్యులైన లక్ష్మి, శరణ్య, ప్రియాంక, స్నిగ్ధ, చిన్ని అనే మరో అయిదుగురు.. తమ వాళ్ళని చంపిన వారిపై పగ తీర్చుకుందామని ఒక నిర్ణయానికి వస్తారు.

అయితే ఆ హంతకుడిని పట్టుకొనే క్రమంలో.. తమకి సహాయంగా.. రివెంజ్ డ్రామాలు రాసే నవలా రచయిత పెన్సిల్ పార్థసారథిని (నాని) ఎంపిక చేసుకుంటారు. మరి వీరు పగ తీర్చుకునేందుకు ఈ పెన్సిల్ పార్థసారథి చేసిన సహాయం ఫలితాన్ని ఇచ్చిందా? లేదా? అనేది మీరు వెండితెర పై చూడాల్సిందే.

ఇక ఈ గ్యాంగ్ లీడర్ చిత్రంలో మీరు థ్రిల్ అయ్యే అయిదు అంశాలు ఇవే –

* నాని & గ్యాంగ్

ADVERTISEMENT

న్యాచురల్ స్టార్ నాని బాగా నటిస్తాడనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో తనది తనకు ఎంతో ఇష్టమైన కామెడీ టైమింగ్ ఉన్న పాత్ర కావడంతో.. నాని తన సత్తా మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించేశాడు. అలాగే ఈ చిత్రంలో గ్యాంగ్  సభ్యులుగా కనిపించిన అయిదుగురిలో.. ఒక అమ్మాయికి తప్ప మిగతా నలుగురికి కూడా మంచి నటనకి స్కోప్ ఉన్న కథ ఇది.

సీనియర్ నటులు  లక్ష్మి, శరణ్యలు ఎప్పటిలాగే చాలా సహజంగానే అభినయించేశారు. ఈ గ్యాంగ్‌లో ఉన్న చిన్న పాప కూడా చక్కటి హావభావాలతో మంచి నటనని ప్రదర్శించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్.. అలాగే గ్యాంగ్ సభ్యురాలైన ప్రియ అలియాస్ ప్రియాంకకి ఇది తొలి చిత్రమే అయినా.. చాలా చక్కగా నటించిందనే చెప్పాలి. ఆమె కచ్చితంగా మంచి నటిగా.. ఈ చిత్రం ద్వారా మంచి మార్కులే వేయించుకుంటుంది. 

* ఛాయాగ్రహణం

తొలుత ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా పీసీ శ్రీరామ్ చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అయన ఈ చిత్రం చేయలేకపోయారు. ఆయన స్థానంలో చివరి నిమిషంలో యూనిట్‌లో చేరిన పోలాండ్‌కి చెందిన మీరొస్లా కూబా బ్రోజెక్ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా పనిచేయడం జరిగింది. తను పీసీ శ్రీరామ్‌ని మరిపించాడు అని చెప్పలేం కాని.. కచ్చితంగా ఈ చిత్రం తెరపై ఒక డిఫరెంట్ ఫీల్‌ని కలిగిస్తుంది. ఆ క్రెడిట్ కూడా కూబా పనితనానికే దక్కుతుందని చెప్పాలి. 

ADVERTISEMENT

* అనిరుధ్ నేపధ్య సంగీతం

అనిరుధ్ రవిచందర్ గురించి మనం చెప్పాల్సిందేముంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి యువ హీరోల వరకు ప్రతిఒక్కరు తమ సినిమాకి అనిరుధ్ సంగీతం కావాలని కోరుకునేవారే. ఇంతటి టాలెంట్ ఉన్న అనిరుధ్ మరోసారి ఈ చిత్రానికి ఇచ్చిన నేపధ్య సంగీతం ద్వారా ఆయన తన ప్రతిభని మరోసారి ప్రజల ముందు పెట్టాడు. ఈ సినిమాల్లో వచ్చే సన్నివేశాలకి ఆయన తన నేపధ్య సంగీతం ద్వారా వాటి స్థాయిని పెంచాడు అని చెప్పాలి.

‘జెర్సీ’ చిత్రంలో మనల్ని కన్నీళ్లు పెట్టించే.. టాప్ 6 సన్నివేశాలు ఇవే..!

* విక్రమ్ కె కుమార్ దర్శకత్వం

ADVERTISEMENT

ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ గురించి చెప్పాల్సి వస్తే… కథ ఎటువంటిదైనా.. అది దర్శకుడు చూపించే విధానం బట్టే సక్సెస్ అవుతుంది.. ఈ విషయం ఈ దర్శకుడిని చూస్తే కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలో కథ ఏంటో మనకు ముందే అర్ధమైపోతుంది. అసలు ట్రైలర్‌లోనే సగం కథను చెప్పడం జరిగింది. అలా తెలిసిన కథనే.. ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఆయన తెరకెక్కించిన తీరు భేష్ అనాలి. రెండవ భాగంలో సినిమా కాస్త నెమ్మదించినా కూడా.. తన డైరెక్షన్ మ్యాజిక్‌తో ఆ సన్నివేశాలని త్వరగా ముగించగలిగాడు. ఈ సినిమాకి విక్రమ్ దర్శకత్వం కూడా ఒక పెద్ద బలం.

* ఎంటర్‌టైన్‌‌మెంట్

ఈ చిత్ర కథ ఒక రివెంజ్ స్టోరీ. మరి అటువంటి రివెంజ్ స్టోరీలో.. ఎంటర్‌టైన్‌‌మెంట్‌ని జోడిస్తూ కథని ముందుకి తీసుకెళ్లడం నిజంగా ఒక సవాలే! అటువంటి ఒక సవాల్‌ని ఈ చిత్రానికి పనిచేసిన రచయితలు తీసుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఒకవైపు సంభాషణల్లో చూపిస్తున్నే.. మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగే సన్నివేశాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వినోదపాళ్లు తగ్గకుండా చూసుకున్నారు. అయితే రెండవ భాగంలో మాత్రం కాస్త ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. ద్వితీయార్ధంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే.. ఈ చిత్రం ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా అయ్యుండేది.

ఈ 5 అంశాలు మీకు గ్యాంగ్ లీడర్ చిత్రంలో తప్పక నచ్చుతాయి. ఆఖరుగా.. నాని తన గ్యాంగ్‌‌తో కలిసి గ్యాంగ్ లీడర్‌గా చేసిన ఈ రివెంజ్ స్టోరీ ప్రయత్నం.. దాదాపుగా సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. దీని వేలం వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

 

13 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT