అంగరంగ వైభవంగా జరిగిన.. నటి అర్చన వివాహం ..!

అంగరంగ వైభవంగా జరిగిన.. నటి అర్చన వివాహం ..!

(Tollywood Actress Archana Sastry ties knot with Healthcare Vice President Jagadeesh)

ప్రముఖ టాలీవుడ్ నటి అర్చన వివాహం నిన్న ఉదయం 1 గంట 30 నిముషాలకు తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. హెల్త్ కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీష్‌‌తో జరిగిన అర్చన వివాహ వేడుకకు పలువురు చలన చిత్ర, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మంచు లక్ష్మీ, కమెడియన్ ఆలీ, శివ బాలాజీ, శుభలేఖ సుధాకర్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, యాంకర్ ఓంకార్, ప్రముఖ నిర్మాత - రాజకీయవేత్త టి.సుబ్బిరామిరెడ్డి మొదలైన వారు హాజరయ్యారు.

పెళ్లికి సిద్ధమయ్యేందుకు.. ఈ వధువులిచ్చే సలహాలు ఎంతో తోడ్పడతాయి..!

వేద శాస్త్రిగా తెలుగు తెరకు పరిచయమైన అర్చన.. ఆ తర్వాత తన అసలు పేరుతోనే తిరిగి నటించడం ప్రారంభించింది.  నేను, కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను, కమలతో నా ప్రయాణం, బ్యాంక్, పంచమి మొదలైన చిత్రాలలో కథానాయికగా నటించింది. "తపన" ఆమె నటించిన మొదటి చిత్రం. తెలుగుతో పాటు కొన్ని తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది అర్చన. ఆ తర్వాత బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టంట్‌గా కూడా పాల్గొని.. టాప్ 5 లో నిలిచింది. అర్చన మంచి కూచిపూడి నాట్యకారిణి కూడా. 

అభినవ సీతాదేవి.. 'బిగ్ బాస్ 1' ఫేమ్ అర్చన నిశ్చితార్థం జరిగిన వేళ - ఆ వివరాలు మీకోసం..!

కూచిపూడి నర్తకిగా విదేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చిన అర్చన.. "శ్రీరామదాసు" చిత్రంలో సీత పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఆ పాత్రకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ తర్వాత "ది ఫైనల్ ఎగ్జిట్" అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. మైత్రి, మేఘవర్షిణి, మించు, ఆ దింగాలు చిత్రాలు అర్చనకు కన్నడంలో కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే అగరం, 6, వేగం, కరుప్పమ్ పట్టి మొదలైన తమిళ చిత్రాలలో కూడా నటించి.. కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అర్చన అలియాస్ వేద శాస్త్రి. 

ఒకానొక క్రమంలో సినిమాలు చేస్తూనే.. రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది అర్చన. ఇటీవలే 'వజ్రకవచధర గోవిందా' అనే చిత్రంలో కూడా ఓ డిఫరెంట్ పాత్రను పోషించింది. అర్చన నిశ్చితార్థం అక్టోబరు 3వ తేదిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె పెళ్లికి సంబంధించిన సంగీత్ కార్యక్రమానికి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలలో నటించిన అర్చన.. హైదరాబాద్‌లోనే జన్మించింది. 

దేశాంతర వివాహాలు చేసుకున్న.. మన క‌థానాయిక‌లు వీరే..!

28 డిసెంబరు 2019 తేదిన అమెరికాలోని మిచిగన్‌లో జరగనున్న "టాలీవుడ్ ఎక్స్‌ట్రావెంజా" కార్యక్రమంలో అతిథిగా కూడా పాల్గొననుంది అర్చన. ఇదే కార్యక్రమానికి ఆలీ, తారక రత్న, అశ్విన్ బాబు, మనారా చోప్రా, వర్షిణి, శివబాలాజీ, సంపూర్ణేష్ బాబు, మధుప్రియ, మధుమిత, ధన్ రాజ్ మొదలైన వారు హాజరుకానున్నారు. 

Image: https://www.facebook.com/OfficialArchanaShastry/

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.