ప్రేమలో ఓడిపోయాను.. మగాళ్లను అసహ్యించుకున్నాను : నిత్యా మేనన్

ప్రేమలో ఓడిపోయాను.. మగాళ్లను అసహ్యించుకున్నాను : నిత్యా మేనన్

అలా మొదలైంది, గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నటి నిత్యా మేనన్ (Nitya Menen). ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రేమ (Love) అనేది తన జీవితాన్నే మార్చేసిందని.. తన తొలిప్రేమ తనకు ఎన్నో గుణపాఠాలను నేర్పిందని తెలిపారామె. అలాగే తన వివాహం గురించి, ఓ నటుడితో తనకు ఎఫైర్ ఏర్పడిందని వస్తున్న రూమర్లపై కూడా ఆమె స్పందించారు. 

"ఎవరి జీవితంలోనైనా తొలిప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. కానీ అది నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలు మగాళ్లు అంటే అసహ్యించుకున్నాను. కానీ సినిమాల్లోకి వచ్చాక నా అభిప్రాయం మారింది. అయినా సరే.. నాపై పుకార్లు వచ్చాయి. ఓ ప్రముఖ నటుడితో కలిసి నేను నటించిన చిత్రం విడుదల అయ్యాక.. ఆయన కుటుంబంలో నా వల్ల మనస్పర్థలు వచ్చాయని వార్తలు రాశారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. నిజం చెప్పాలంటే.. నేను పెళ్లి కోసం ఎవరో ఒకరిని చేసుకొనే రకం కాదు. నాకు అన్ని విధాలుగా ఇష్టమైన వ్యక్తినే నేను జీవిత భాగస్వామిని చేసుకుంటాను" అని తెలిపారామె.

టాలీవుడ్ టాప్ 10.. లేడీ కమెడియన్స్ వీరే

అలాగే తాను ఆస్తికురాలినని.. తనకు వీలైన సందర్భాలలో ఆశ్రమాలను కూడా సందర్శిస్తుంటానని  తెలిపారు నిత్యా మీనన్. అయితే తాను ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టింది మతాల గురించి తెలుసుకోవడానికి కాదని.. తనను గురించి తాను తెలుసుకోవడానికి మాత్రమే అని కూడా క్లారిటీ ఇచ్చారు నిత్య. అలాగే తనకు పాటలంటే ఎంతో ఇష్టమని.. అందుకోసం ప్రత్యేకంగా సంగీత శిక్షణ కూడా తీసుకున్నానని.. అయితే సినిమాల్లో పెద్దగా పాడలేదని తెలిపారామె.

నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!

బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్య.. మణిపాల్ విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో కోర్సు చేశారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా కూడా కొన్నాళ్లు పనిచేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించిన నిత్య.. స్వతహాగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారట. కానీ అందరితో కలిసి మెలిసి ఉంటూ.. వివిధ అంశాల మీద మాట్లాడడం, కబుర్లు చెప్పడం కూడా ఇష్టమే అంటున్నారు ఆమె. తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, అ, ఇష్క్ మొదలైన సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 

జయలలిత జీవితంలో.. చివరి 75 రోజులు ఆధారంగా మరో బయోపిక్..!

'అలా మొదలైంది' సినిమాకి ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు నిత్య మేనన్. "ఏ మంకీ హు న్యూ టూ మచ్" అనే ఇంగ్లీష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నటించారు నిత్య. అలాగే మణిరత్నం దర్శకత్వంలో "ఓ కాదల్ కణ్మణి" చిత్రంలో నటించారు. అదే చిత్రం 'ఒకే బంగారం'గా తెలుగులో డబ్ అయ్యింది. అలాగే 'మెర్సల్' చిత్రంలో.. హీరో విజయ్‌కు సతీమణిగా కూడా నటించారు నిత్య. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ కూడా అందుకున్నారు. ఇదే చిత్రం 'అదిరింది' పేరుతో తెలుగులో డబ్ అయ్యింది.

ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు, రెండు తమిళ చిత్రాలు నిత్యా మేనన్ ఖాతాలో ఉన్నాయి. అలాగే ఆమె తొలిసారిగా బాలీవుడ్‌లో నటించిన 'మిషన్ మంగళ్'లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో యువ సైంటిస్ట్ వర్ష పిళ్లై పాత్రలో ఆమె ఆకట్టుకుంది.     

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.