ఫ్యాన్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం అందుకున్న వరుణ్ సందేశ్

ఫ్యాన్ తో ఫోన్ లో మాట్లాడే అవకాశం అందుకున్న వరుణ్ సందేశ్

బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3 ఆఖరి వారానికి చేరుకుంది. ఇంకొక 5 రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ఒక టాస్క్ లో విజయం సాధించినందుకు గాను వరుణ్ సందేశ్ (varun sandesh) కి ఒక గొప్ప అవకాశం లభించింది. ఆ అవకాశం ఏంటంటే - బయట తనని ఆదరిస్తున్న ఆడియన్స్ లో నుండి ఒకరితో ఫోన్ (phone call) లో మాట్లాడే అవకాశం వరుణ్ కి దొరికింది. 

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం

గత రెండు సీజన్స్ లో కూడా ఇలాంటి అవకాశం ఇంటిలో ఉన్న సభ్యులకి ఇవ్వడం జరిగింది. అలా బయట ఉన్న తమ ఫ్యాన్స్ తో మాట్లాడడం ద్వారా తమ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోవడంతో పాటుగా గేమ్ లో మరింత మెరుగ్గా ఆడేందుకు వారి సలహాలు సహాయపడుతాయి. అయితే ఈ సీజన్ లో ఆఖరి వారం అందునా ఇంకొక 5 రోజుల్లో గేమ్ ముగుస్తుంది అనగా ఈ అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు వరుణ్ సందేశ్ కి వచ్చే ఫోన్ కాల్ అతనికి ఎంత మేర ఉపయోగపడుతుంది అనేది చూడాలి.

ఇదిలావుండగా నిన్నటి దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. రాగానే ఆమె ఇంటిలో ఉన్న సభ్యులతో మమేకమై సందడి చేశారు. ముందుగా ఇంటి సభ్యులు ఎలా ఉంటున్నారు అనేదాని పైన బిగ్ బాస్ హౌస్ మొత్తం కలియతిరగడమే కాకుండా వారు తమ వస్తువులని సరిగ్గా పెట్టుకుంటున్నారా? లేదా? అనేది చూశారు.

దానితో పాటే రాహుల్ సిప్లిగంజ్ బెడ్ వద్ద ఉన్న బాక్స్ లో పునర్నవికి సంబందించిన వస్తువులు ఉండడంతో వాటి గురించి అడగడం జరిగింది. దానికి సమాధానంగా.. ఆ బాక్స్ ని తన బెడ్ వద్దకి కావాలని తీసుకొచ్చి పెట్టింది శ్రీముఖి అని చెప్పాడు రాహుల్. అలాగే ఇంటిలో టాస్క్ జరిగే సమయాల్లో లేదా ఇతర సందర్భాలలో అమ్మాయిలు మేకప్ అంత త్వరగా ఎలా వేసుకుంటున్నారు వంటి ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకుంది సుమ.

రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!

ఇక సుమ ఇంటిలోకి వచ్చిన కారణంగా బిగ్ బాస్ ఇంటిసభ్యులకి మటన్ బిర్యాని చేయడానికి అవసరమైన పదార్ధాలని పంపించడం జరిగింది. ఆ పదార్దాలతో మటన్ బిర్యాని చేసుకుని తినమని చెప్పగా.. ఇంటిసభ్యులు బిర్యాని చేసుకుని ఇంటికి వచ్చిన అతిథితో కలిసి తినడం జరిగింది.

ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లో ఉదయం వేళ పడుకుంటే కుక్కలు మొరుగుతాయి, అయితే ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి తనకి మినహాయింపు ఉంటుందేమో అని అనుకుని పడుకునే ప్రయత్నం చేయగా వెంటనే కుక్కలు మొరిగాయి. ఇలా సరదా సరదాగా ఇంటిలో గడిపాక.. కోర్ట్ యార్డ్ లో ఇంటి సభ్యులతో ఒక ఫన్నీ టాస్క్ ఆడించారు సుమ.

ఆ టాస్క్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకున్న ఇంటిసభ్యులకి సుమ తెలుగు లో ఒక వ్యాక్యం చెబుతుంది. దానిని వారు విని సరిగ్గా మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్ చేసే సమయంలో ఎవరైతే బాగా ఫన్ క్రేయేట్ చేస్తారో వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అందరూ ఊహించినట్టుగానే బాబా భాస్కర్ బాగా ఎంటర్టైన్ చేసినప్పటికి, వరుణ్ సందేశ్ చేసిన ఫన్ ఇంకాస్త బాగుండడంతో ఆయనని ఈ టాస్క్ విజేతగా ప్రకటించారు.

అలా ఈ టాస్క్ లో గెలిచినందుకే బయట ఉన్న ఫ్యాన్ (fan) తో ఫోన్ లో మాట్లాడే అవకాశం చేజిక్కించుకున్నాడు. ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ హౌస్ లో సుమ సందడి చేయనుంది. గ్రాండ్ ఫినాలే కి ఇంకొక 5 రోజుల సమయం ఉన్న ఈ తరుణంలో బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ లు ఇస్తాడో అన్నది ఆసక్తికరంగా ఉంది.

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!