Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు

Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు

(Clashes between Varun Sandesh and Vithika Sheru in 'Bigg Boss Telugu' again)

బిగ్ బాస్ హౌస్‌లో సాధారణంగా కంటెస్టంట్స్ తమ కుటుంబసభ్యులని వదిలేసి.. గేమ్ ఆడడానికి వస్తుంటారు. అయితే వరుణ్ సందేశ్, వితికలు మాత్రం జంటగా ఈ గేమ్ ఆడడానికి రావడం జరిగింది. ఇది ఒకరకంగా కాస్త వినూత్న ప్రయోగమనే చెప్పాలి. ఎందుకంటే అంతగా లేదా అసలే పరిచయం లేని వారితో కలిసి ఒక ఇంటిలో దాదాపు 100 రోజుల పాటు జీవించాలంటే.. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు. అయితే భార్యభర్తలు  కలిసి.. ఇలాంటి షోకి రావడం వల్ల.. అప్పుడప్పుడు వారి మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు రావడం కూడా సహజమే.

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య గొడవ

ఇక ఈ సీజన్‌లో ఈ జంట ప్రయాణం చాలా ఒడిదొడుకుల మధ్య సాగిందనే చెప్పాలి. సీజన్ మొదట్లో వితికను గౌరవించి మాట్లాడలేదని.. మహేష్ విట్టాతో గొడవకి దిగాడు వరుణ్ సందేశ్. అయితే సీజన్ మధ్యలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. టాస్క్ విషయంలో లేదా తోటి సభ్యులతో మాట్లాడే క్రమంలో.. ఈ  భేదాలు అలా తలెత్తుతూనే ఉన్నాయి. 

మొన్నటికి మొన్న రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌ల మధ్య గొడవ జరగడానికి.. వితికే పరోక్ష కారణమనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. ఆ ఘర్షణ సమయంలోనే.. ఈ ఇద్దరికి వాగ్వాదం జరిగింది. తాజాగా బిగ్ బాస్ వీక్లి నామినేషన్ టాస్క్‌లో భాగంగా జరిగిన.. "రాళ్ళే రత్నాలు" టాస్క్‌‌లో వితిక పలు అభ్యంతరాలు లేవనెత్తింది. రాళ్ళని సేకరించే సమయంలో.. ఇతర ఇంటి సభ్యులు వితికని తాకడంతో.. ఆమె వారి తీరును తప్పుపట్టింది.

అదే సమయంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. "టాస్క్‌లో ఇలాంటివి జరగడం సహజమే. ఇటువంటివి వద్దంటే టాస్క్ ఆడటమే ఆపేయ్యాలి" అంటూ వితికకి కాస్త గట్టిగానే చెప్పాడు. దీనికి సంబంధించి ఇప్పుడే ప్రోమో కూడా విడుదలైంది. దీనితో మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ జంట ఇలా మాటలు అనుకోవడం.. మరలా తిరిగి కలిసిపోవడమే.. ఒకరకంగా ఈ సీజన్‌లో హైలైట్‌గా నిలిచే అంశం. మొత్తానికి ఈ సీజన్‌కి ఈ జంట.. ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. 

Bigg Boss Telugu 3: ఇంటిసభ్యులు రాళ్ల టాస్క్‌లో గెలిస్తేనే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటారట!

ఇక  టాస్క్‌లో మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి.. అతి తక్కువ విలువ గల రాళ్లన సంపాదించిన రాహుల్ సిప్లిగంజ్‌ని నామినేషన్స్‌లోకి పంపించడం జరిగింది. ఇక అత్యధిక విలువ గల రాళ్ళు సంపాదించిన వితిక మొదటి స్థానంలో నిలవగా.. ఆఖరి స్థానంలో మహేష్ విట్టా నిలిచాడు. ఇక ఈ టాస్క్‌‌లో కొద్దిసేపు మహేష్ విట్టా హల్చల్ చేయడం జరిగింది. "నా వద్ద ఉన్న రాళ్లు తీసుకోవడం సరికాదు" అంటూ.. "నేను ఈ ఆట ఆడను" అని చెప్పి రాళ్లు విసిరేయడం జరిగింది. తర్వాత తన మనసు మార్చుకుని.. మరలా ఆటని ఆడడం జరిగింది.

అయితే మహేష్ విట్టాకి కోపం వచ్చిన సమయంలో..  రాళ్లు విసిరేయడంతో పాటుగా.. వాటిని ఇతరులకి ఇచ్చేయడంతో.. పునర్నవికి అదనంగా ఎక్కువ విలువ గలిగిన రాళ్లు లభించాయి. దీనివల్ల ఆమెకి ఈ టాస్క్‌లో అదనపు బలం చేకూరింది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ టాస్క్.. కాస్త వైవిధ్యంగా ఉండడంతో పాటుగా.. చాలా ఆసక్తికరంగా సాగింది. ఎవరైతే ఆటలో చురుకుగా ఉంటారో.. అలాగే తెలివిగా ఆడతారో.. వారే ఈ వారం నామినేషన్స్ నుండి బయట పడతారనే విషయం తెలుస్తోంది.

చూద్దాం.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉంటారో..?  అదే సమయంలో "బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ ఫినాలే"కి సంబంధించి కూడా.. రేస్ మొదలైనట్టు ప్రకటించారు. ఈ  నేపథ్యంలో "ఇంటి సభ్యుల ఆట తీరు ఎలా ఉండబోతుంది" అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీంతో.. ఈరోజు నుండి బిగ్ బాస్ ఇంకాస్త స్పీడ్‌గా ఉండబోతుంది అని అయితే చెప్పాలి.

Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్?