Bigg Boss Telugu 3: ఇంటిసభ్యులు రాళ్ల టాస్క్‌లో గెలిస్తేనే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటారట!

Bigg Boss Telugu 3: ఇంటిసభ్యులు రాళ్ల టాస్క్‌లో గెలిస్తేనే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటారట!

(Bigg Boss Telugu House mates in Nomination Task)

"బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3"లో భాగంగా 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరగనుంది. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియలో ఇంటి సభ్యులు తమకి నచ్చని  వారిని నామినేట్ చేసే విధానానికి స్వస్తి పలికి..  'రాళ్లు సంపాదించుకునే' ఒక ప్రత్యేకమైన టాస్క్‌ని బిగ్ బాస్ ఇచ్చారు. 

Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్?

ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇంటి ఆవరణలోకి కొన్ని రాళ్లను బయట నుండి వేస్తారు. ఆ రాళ్ళ పై వాటి విలువను కూడా తెలియచేయడం జరుగుతుంది. ఈ టాస్క్‌లో స్టార్టింగ్ బజర్ నుండి ఎండ్ బజర్ పూర్తయ్యే వరకూ.. ఎవరి వద్ద అయితే తక్కువ విలువ గల రాళ్లు ఉంటాయో.. ఆ హౌస్ మేట్సే ఈ వారం నామినేషన్స్‌లో ఉంటారట.

దీనికి సంబంధించిన ప్రోమోని కూడా.. కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మరి ఈ టాస్క్ ప్రకారం, ఎవరైతే చురుగ్గా ఆడి, ఎక్కువ విలువ గల రాళ్లను సేకరిస్తారో.. వారే ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ అవుతారని టాక్. 

ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే..  ఎక్కువమంది ఊహించినట్టుగానే రవికృష్ణ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కానీ రవికృష్ణ మాత్రం.. తాను ఇంటి నుండి ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించనే లేదని తెలిపారు. అలాగే బాబా భాస్కర్ విషయానికి వస్తే.. అతను ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారు. బిగ్ బాస్‌లో జరిగిన నిన్న, మొన్నటి ఎపిసోడ్స్ చూస్తే, ఈ విషయం కచ్చితంగా  స్పష్టమవుతుంది.

ఇక నిన్న సండే.. ఫన్ డే కాబట్టి.. ఇంటిసభ్యుల చేత నాగార్జున రకరకాల టాస్క్‌లు చేయించారు. తొలుత హౌస్‌లో 10 మందిని.. ఇద్దరిద్దరుగా విడదీసి.. 5 టీములుగా వర్గీకరించారు. తరువాత ఈ అయిదు టీమ్స్‌తో అయిదు స్కిట్స్ చేయించడం జరిగింది. ఈ టాస్క్‌లో - మహేష్ - శివజ్యోతి, వితిక - అలీ రెజా, రవికృష్ణ - వరుణ్ సందేశ్, శ్రీముఖి - బాబా భాస్కర్ , పునర్నవి - రాహుల్ సిప్లిగంజ్‌లు స్కిట్స్ ప్రదర్శించారు. ఈ స్కిట్స్‌లో రాహుల్ సిప్లిగంజ్ & పునర్నవిలు కలిసి.. ఇంటి సభ్యుల పై రాసిన పాట అందరికీ ఎంతో ఫేవరెట్‌గా నిలిచింది. అలాగే పునర్నవి - రాహుల్‌ల జంట  చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందరికి నచ్చింది.

Bigg Boss Telugu 3: ఈ వారం నామినేషన్స్‌లో.. రాహుల్ సిప్లిగంజ్ ఉంటాడా?

ఆ తరువాత ఇంటి సభ్యుల చేత మరో డిఫరెంట్ టాస్క్ చేయించారు. హౌస్ మేట్స్ ఫోటోలతో కూడిన బోర్డుని ఇంట్లోకి పంపించారు. ఆ బోర్డు పైనున్న ఫోటోలలో ఎవరినైనా ఇద్దరిని.. ఇంటి సభ్యులు ఎంపిక చేసుకోవాలి.  తర్వాత అందులో తమకి నచ్చిన వారికి ముద్దు సింబల్ పెట్టాలి. అదేవిధంగా బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాలని కోరుకునే వారికి కత్తి గుచ్చాలి. ఈ టాస్క్‌లో ఎక్కువ మంది సభ్యులు పునర్నవి ఫోటోని కత్తితో గుచ్చడం గమనార్హం. అయితే ఇదంతా.. కాస్త ఫన్నీగానే సాగిందని చెప్పొచ్చు.
 
ఇక రవిక్రిష్ణ ఎలిమినేట్ అయ్యాక.. మిగిలిన ఇంటి సభ్యులకి ర్యాంకింగ్స్ ఇవ్వాల్సిందిగా ఆయనను నాగార్జున కోరారు. ఈ క్రమంలో తను ఆఖరి స్థానాన్ని పునర్నవికి ఇవ్వడంతో పాటు.. ఆ పై స్థానాన్ని వితికకి ఇవ్వడం జరిగింది. అయితే 9 నుండి 6 స్థానాల ర్యాంకింగ్స్ పొందిన వ్యక్తులు.. ఆ క్రమ సంఖ్య ప్రకారం అన్ని చేదు లడ్డులు తినాలి. అలాగే అయిదవ స్థానం నుండి 1వ స్థానం వరకు వచ్చిన వారు వారి క్రమ సంఖ్య ప్రకారం.. తీపి లడ్డులు తినాల్సి ఉంటుంది. అయితే రవిక్రిష్ణ ప్రకారం టాప్ 5 స్థానాల్లో చోటు దక్కించుకున్న వ్యక్తులు వీరే - శివజ్యోతి, అలీ రెజా, వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్ 

అయితే ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే సమయంలో.. రవికృష్ణ వివరించిన తీరుని.. పునర్నవితో సహా పలువురు హౌస్ మేట్స్ విమర్శించారు. అలాగే.. ఇంటిసభ్యులలో రవికృష్ణ ఎలిమినేట్ కావడం పట్ల.. కొందరు అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త వైవిధ్యంగా మారింది. మరి చూడాలి.. ఈరోజు టాస్క్ పూర్తయ్యాక  ఎవరు నామినేషన్స్‌లో ఉంటారో..

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌లకి.. క్లాస్ పీకిన నాగార్జున!