హాలీవుడ్ చిత్రం 'అల్లాదీన్'లో జీనీ పాత్రకు.. వెంకీ డబ్బింగ్..!

హాలీవుడ్ చిత్రం 'అల్లాదీన్'లో జీనీ పాత్రకు.. వెంకీ డబ్బింగ్..!

విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నొయిమీ స్కాట్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న హాలీవుడ్ చిత్రం "అల్లాదీన్" (Aladdin). అరేబియన్ నైట్స్ కథల్లో బాగా పాపులరైన అల్లాదీన్ కథ అంటే చిన్నారులకు ఎంత మక్కువో మనకు తెలియంది కాదు. ఒకప్పుడు డిస్నీ సంస్థ యానిమేటెడ్ చిత్రంగా ఈ కథను తెరకెక్కించింది.


ఇప్పుడు పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మే 24వ తేదిన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


ఇంగ్లీష్‌తో పాటు పలు ప్రపంచ భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలుగులో కూడా డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ కానుంది. తెలుగులో విడుదలవుతున్న 'అల్లాదీన్' చిత్రంలో జీనీ పాత్రకు వెంకటేష్ (Venkatesh) డబ్బింగ్ చెబుతుండగా.. హీరో వరుణ్ తేజ్ అల్లాదీన్ పాత్రకు గాత్రదానం చేయడం విశేషం. ఈ చిత్రంలో జీనీగా విల్ స్మిత్ నటిస్తుండగా.. అల్లాదీన్‌గా మీనా మసూద్ నటిస్తున్నారు.


 
 

 

 


View this post on Instagram


Check out the new poster for Disney’s #Aladdin. See it in theaters May 24.


A post shared by Disney's Aladdin (@disneyaladdin) on
ఈ సంవత్సరం విడుదలైన F2 చిత్రంలో వెంకటేష్, వరుణ్‌తేజ్ కాంబినేషన్ బాగా వర్కవుటైన సంగతి తెలిసిందే. అందుకే ఈ వీరిద్దరి వాయిస్‌ను ఉపయోగించుకొని.. తెలుగులో ఈ హాలీవుడ్ చిత్రాన్ని హిట్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు.


ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో జీనీ పాత్రకు వెంకటేష్ చెబుతున్న డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.


‘నీకు మూడు కోరికలు కోరే అవకాశం ఉంది. దీపాన్ని రుద్ది నువ్వు ఆ కోరికలు కోరడమే’ అంటూ వెంకటేష్ గొంతులో డైలాగ్ వింటుంటే.. చాలా కొత్తగా ఉంది. 'నేను ఎవర్నీ  ప్రేమలో పడేయలేను'..'ఇప్పుడు చూడాలి జనాల గోల'.. అంటూ వెంకటేష్ పలుకుతున్న డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి.


 

విల్ స్మిత్ పాత్రకు వెంకటేష్ గొంతును వినియోగించుకోవడం మంచి ప్రయత్నమే అని కూడా అంటున్నారు అభిమానులు.


'అల్లాదీన్' చిత్రం ఈ సీజన్‌లో 2డీతో పాటు 3డీ చిత్రంగా కూడా ప్రేక్షకులను అలరించనుంది. ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. ఆయన ఇప్పుడు 'వెంకీ మామ' చిత్ర షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన అక్కినేని నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


అలాగే వరుణ్ తేజ్ కూడా 'వాల్మీకి' చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. 'వాల్మీకి' చిత్రం తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్ తండా చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవలే వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ.. ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ F2 చిత్రానికి సీక్వెల్ వస్తే.. అందులో నటించడానికి సిద్ధమేనని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి


 కమల్ "భారతీయుడు" చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?


నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ "వెంకీ మామ" విశేషాలివే..!


'విక్టరీ' వెంకటేష్ ముద్దుల కూతురు ఆశ్రిత.. పెళ్లి ముచ్చట్లు మీకోసం..!