'విక్టరీ' వెంకటేష్ ముద్దుల కూతురు ఆశ్రిత.. పెళ్లి ముచ్చట్లు మీకోసం..!

'విక్టరీ' వెంకటేష్ ముద్దుల కూతురు ఆశ్రిత.. పెళ్లి ముచ్చట్లు మీకోసం..!

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ముద్దుల కూతురు ఆశ్రిత (Aashrita) వివాహం జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్  ఛైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక రెడ్డితో ఆశ్రిత వివాహం ఈ రోజు ఘనంగా జరగడం విశేషం. ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.


రామ్ చరణ్ సతీ సమేతంగా ఈ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. నాగచైతన్య తన భార్య సమంతతో వచ్చారు. అలాగే రానా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. గతకొంతకాలం నుండీ ప్రేమించుకుంటున్న ఆశ్రిత, వినాయక్‌లు తమ పెద్దలను ఒప్పించి ఈ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఎక్కువ మంది అతిథులను పిలవకుండా.. కేవలం ఒక ప్రైవేటు ఫంక్షనుగా ఈ వేడుకను వెంకటేష్ నిర్వహించారు.


ఈ కథనం కూడా చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న.. ప్రేమ పక్షులు - ఆర్య & సాయేషా

 aashrita-engagement-ceremony


ఆశ్రిత, వినాయక్‌ల నిశ్చితార్థం ఫిబ్రవరి 6, 2019 తేదిన జరిగిన సంగతి తెలిసిందే. ఆశ్రిత ఇప్పటికే ఓ ప్రొఫెషనల్ బేకర్‌గా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బాగా పరిచితులు. ఇన్ఫినిటీ ప్లాటర్ (Infinity Platter) పేరుతో ఆమె ఓ ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ పేజీని కూడా నడుపుతున్నారు. త్వరలోనే వెంకటేష్, రామానాయుడు స్టూడియోస్‌లో ఇండస్ట్రీ మిత్రుల కోసం భారీ స్థాయిలో  తన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకొని.. రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.


ఈ కథనాన్ని కూడా చదవండి: నిక్, ప్రియాంక పెళ్లిలో.. డైమండ్ రింగ్ గెలుచుకున్న బాలీవుడ్ భామలు


ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు వెంకటేష్ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్
(సీసీఎల్) జట్టు తెలుగు వారియర్స్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నారు. అనారీ, తక్ దీర్ వాలా వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి.. ఉత్తరాది వారికి కూడా బాగా పరిచితుడైన నటుడు వెంకటేష్.


ఈ కథనం కూడా చదవండి: బాబోయ్.. పెళ్లి శుభలేఖలను ఎంపిక చేయాలంటే.. చాలా కష్టమే సుమండీ..!
 

 

 


View this post on Instagram


Congratulations Venky ! @venkateshdaggubati


A post shared by Bina Kak (@kakbina) on