ADVERTISEMENT
home / Celebrity Life
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం: నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం: నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

తమిళనాడులో పుట్టిన తెలుగమ్మాయి ఆమె. ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది. పదకొండేళ్ల వయసులో “పాండురంగ మహాత్యం” చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్రం “భార్గవి నిలయం” తనకు మంచి పేరు తీసుకురావడంతో.. దక్షిణాదిలో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

తెలుగు చిత్రం “రంగుల రాట్నం”లోనూ  హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. కానీ “సాక్షి ” చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చిత్ర షూటింగ్‌లోనే ఆ సినిమా కథానాయకుడు కృష్ణతో ప్రేమలో పడింది. అదే ప్రేమ పెళ్లికీ దారి తీసింది. దాదాపు 47 చిత్రాల్లో ఆయనతో కలిసి నటించింది. తర్వాత దర్శకురాలిగా కూడా మారింది. ఆమే విజయనిర్మల (Vijaya Nirmala). 

తెలుగు సినీ చరిత్రలో విజయనిర్మలది ఒక విశిష్టమైన స్థానం. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం ఆమెకే చెల్లింది. అటువంటి మేటి దర్శకురాలు ఈ రోజు గుండెపోటుతో పరమపదించడం విషాదకరం. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల, బుధవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చివరిశ్వాస విడిచారు. ఆ మేటి చలనచిత్ర దిగ్గజానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ప్రత్యేక కథనం మీకోసం

ఈ కథనం కూడా చదవండి: ‘మా’ ఎలక్షన్స్‌లో మహిళల సత్తా

ADVERTISEMENT

Vijaya Nirmala and Krishna in “Sakshi” (Movie Still)

ఫిబ్రవరి 20, 1946 తేదిన జన్మించిన విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరు గ్రామంలోనే గడిచింది. తర్వాత వారి కుటుంబం మద్రాసుకి షిఫ్ట్ అయ్యింది. తొలుత బాలనటిగా వెండితెరకు పరిచయమైనా.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రంగా “సాక్షి”ని చెప్పుకోవచ్చు. ఈ చిత్ర షూటింగ్‌లోనే ఆమెకు హీరో కృష్ణతో పరిచయమైంది.

బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని ఓ షాట్‌లో హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్త దంపతులుగా నటించాల్సి వచ్చింది. ఆ గెటప్స్‌లో కృష్ణ, విజయనిర్మల… ఇద్దరినీ చూసిన హాస్యనటుడు రాజబాబు అచ్చం భార్యా, భర్తల్లాగే ఉన్నారని హాస్యమాడారట. ఆయన ఆ మాటలన్న ఒక సంవత్సరంలోనే వారిద్దరూ నిజంగానే ఆలుమగలు కావడం విశేషం.

ADVERTISEMENT

నటుడు కృష్ణతో వివాహానికి ముందే.. విజయనిర్మలకు పెళ్లైంది. పైగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. మొదటి భర్తకు ఆమె విడాకులిచ్చి.. విజయనిర్మల మళ్లీ వివాహం చేసుకున్నారు. హీరో కృష్ణకు కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. 1969లో వీరి పెళ్లి తిరుపతిలో జరిగింది. 

ఈ కథనం కూడా చదవండి: టాలీవుడ్ మహిళా దర్శకుల గురించి ఆసక్తికర విషయాలివే..!

 

నటనా, దర్శకత్వ ప్రస్థానం

బంగారు గాజులు, ఆత్మీయులు, అల్లూరి సీతారామరాజు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, తాత మనవడు, మోసగాళ్లకు మోసగాడు, బుద్ది మంతుడు, బంట్రోతు భార్య లాంటి తెలుగు చిత్రాలు విజయనిర్మలకు ఎంతగానో పేరు తెచ్చాయి. పెళ్లయ్యాక కూడా అడపా దడపా ఆమె చిత్రాలలో నటించారు.

ADVERTISEMENT

కొంతకాలం గ్యాప్ తీసుకొని దర్శకురాలిగా కూడా తమ మార్కు సినిమాలు తీసి విజయాలు సాధించారు. ముఖ్యంగా యుద్ధనపూడి సులోచనారాణి నవల “మీనా”ను 1971లో సినిమాగా తీసిన ఘనత విజయనిర్మలకే దక్కింది. ఆ సినిమాలో స్వయానా విజయ నిర్మలే టైటిల్ రోల్ పోషించారు. 

ఆ తర్వాత పంచాయతీ, రౌడీ రంగమ్మ, శంఖుతీర్థం, సంఘం చెక్కిన శిల్పాలు, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, లంకెబిందెలు, కలెక్టర్ విజయ, సాహసమే నా ఊపిరి, అజాత శత్రువు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2009లో వచ్చిన “నేరము శిక్ష” ఆమె దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం.

ఈ కథనం కూడా చదవండి: బాలీవుడ్‌లో దీపికా రణ్‌వీర్.. మరి టాలీవుడ్‌లో..?

ADVERTISEMENT

Vijaya Nirmala (File Photo)

అవార్డులు – రివార్డులు

విజయనిర్మల చలన చిత్ర రంగానికి అందించిన సేవలకు గాను 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ప్రపంచంలోని ఏ మహిళా దర్శకురాలు కూడా చేయని విధంగా.. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి ఒక సరికొత్త రికార్డును కూడా నెలకొల్పారు విజయనిర్మల. మలయాళ భాషలో కూడా దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయనిర్మల కావడం గమనార్హం. శివాజీ గణేషన్, రజనీకాంత్ లాంటి గొప్ప స్టార్లను డైరెక్ట్ చేసిన ఘనత కూడా విజయ నిర్మలకే దక్కింది. 

అటువంటి మేటి దర్శకురాలికి ఘన నివాళి..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

27 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT