ఆ సమయంలో.. మహేష్ బాబుని కొట్టడానికి నాకు మనసు రాలేదు : విజయశాంతి

ఆ సమయంలో.. మహేష్ బాబుని కొట్టడానికి నాకు మనసు రాలేదు : విజయశాంతి

What happened when Vijaya Shanti was asked to slap Mahesh Babu ?

సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) చిత్రంతో.. దాదాపు 13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత.. మరలా కెమెరా ముందుకి వస్తున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2019 Tollywood Review : అభిమానుల అంచనాలు పెంచాయి.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి.. నటి విజయశాంతితో కలిసి పలు విశేషాలను మీడియాతో పంచుకున్నారు. 'దాదాపు 30 ఏళ్ళ తరువాత మరలా మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అని ఆమెను అడగగా తను చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"దాదాపు 30 ఏళ్ళ క్రిందట నేను మహేష్ బాబుతో నటిస్తున్నప్పుడు, అతను చాలా చిన్న పిల్లవాడు. పైగా చూడటానికి కూడా చాలా ముద్దొచ్చేవాడు. 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రం కోసం పనిచేస్తున్నప్పుడు, ఒక సన్నివేశంలో మహేష్ బాబు  చెంప చెల్లుమనిపించాలి. ఓ తల్లి కొడుకును క్రమశిక్షణలో పెట్టే సీన్ అది.

అయితే నా ముందు నిలబడిన మహేష్ బాబుని చూస్తే మాత్రం అస్సలు కొట్టాలనిపించలేదు. అలా కొట్టలేకపోవడంతోనే దాదాపు ఇరవైకి పైగా టేకులు అయిపోయాయి. ఆ సినిమాకి  కృష్ణ  గారు  హీరో. దర్శకుడు కూడా ఆయనే. తను ఒకింత అసహనానికి గురై - "శాంతి, బాబుని కొడతావా? లేక ఈ రోజుకి ప్యాకప్ చెప్పేయమంటావా?" అని నిర్మొహమాటంగా అనేశారు.

అప్పుడు మహేష్ బాబు తనంతట తానే వచ్చి "పర్వాలేదాంటీ! మీరు కొట్టండి" అన్నాడు. ఇక అప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో, నా మనసు చంపుకుని మరీ.. ఆ సన్నివేశం కోసం మహేష్ బాబుని కొట్టాల్సి వచ్చింది. అటువంటిది ఇప్పుడు 30 ఏళ్ళ తరువాత కూడా.. తనతో కలిసి నటిస్తున్నప్పుడు, తాను ఒక సూపర్ స్టార్ అనే భావనను కలిగించకుండా నాతో చాలా మర్యాదగా వ్యవహరించాడు" అని తెలిపారు విజయశాంతి.

కొత్త కథలకే.. ప్రేక్షకుల ఓటు : 2019 టాప్ టెన్ టాలీవుడ్ చిత్రాలివే..!

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ప్రొఫెసర్ ఝాన్సీ పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారు. ఈమెకి, మహేష్ బాబుకి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని.. అసలు ఇది చాలా గొప్ప కాంబినేషన్" అని తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 5 పాటలు విడుదలకాగా.. అవన్నీ బాగానే ప్రజాదరణ పొందాయి. జనవరి 5 తేదిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి సంబంధించి ఓ సూపర్ మెగా ఈవెంట్ ఒకటి.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. 

ఇక ఈ సంక్రాంతి స్పెషల్‌‌గా విడుదల అవుతున్న ఈ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం పై అభిమానులకు భారీ ఆశలే ఉన్నాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi).. గత ఏడాది సంక్రాంతికి 'F2' లాంటి గొప్ప హిట్ చిత్రాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి కూడా ఒక పెద్ద హిట్ కొడతాడని ట్రేడ్ వర్గాలు చెప్పడం గమనార్హం.

Tollywood Best Songs 2019 : ప్రేక్షకుల మదిని దోచిన.. 20 పసందైన తెలుగు పాటలు మీకోసం ..!

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.