వితిక & జాఫర్‌లలో ఒకరు.. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి వెళ్లిపోనున్నారా ?

వితిక & జాఫర్‌లలో ఒకరు.. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి వెళ్లిపోనున్నారా ?

"బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3" ( Bigg Boss Telugu) లో రెండవ వారం ఈరోజుతో పూర్తికానుంది. ఇక ఈరోజు అందరూ ఉత్కంఠగా ఎదురుచూసే ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళేందుకు.. 15 మందిలో 8 మంది నామినేట్ అవ్వగా.. అందులో ఒకరు ఇంటి నుండి ఈరోజు బయటకి వెళ్లనున్నారు.

బిగ్‌బాస్ తెలుగు: వరుణ్ సందేశ్ పై.. వితిక అలగడానికి అసలు కారణం ఇదేనా!

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో 8 మంది నామినేట్ అయిన సభ్యులలో.. నలుగురు సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా నాగార్జున ప్రకటించారు. ఆ సేఫ్ జోన్‌లో ఉన్న సభ్యులు - మహేష్ విట్టా, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి. అలా ఈ నలుగురు సేఫ్ జోన్‌లో ఉండగా.. ఇప్పటికి కూడా డేంజర్ జోన్‌లో ఉన్న మిగిలిన నలుగురు సభ్యులు - వితిక (Vithika), వరుణ్ సందేశ్, పునర్నవి భూపాలం, జాఫర్ ( Jaffar).

ప్రస్తుతం బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న మాక్ పోల్స్‌ను బట్టి.. అనేక విషయాలు చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంట్లో నలుగురు సభ్యుల ప్రవర్తనను భిన్న కోణాల్లో పరిశీలిస్తే.. ఈ రోజు బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్న సభ్యులు - వితిక & జాఫర్ అని చెప్పచ్చు.

వీళ్ళిద్దరే ఎందుకు అన్నది విశ్లేషిస్తే - ఇంటికి వచ్చిన నాలుగవ రోజు నుండే బయటకి వెళ్ళిపోవాలన్న ఆలోచన జాఫర్‌కి రావడం, ఇంటి సభ్యులతో కూడా "అందరూ దయచేసి నన్నే నామినేట్ చేయండి.... నేను వెళ్ళిపోతాను" అంటూ మాట్లాడడం మనం చూసాం. ఒకరకంగా తాను బయటకి వెళ్ళిపోయినా కూడా.. ఎటువంటి ఇబ్బంది లేదనే వ్యక్తి ఆయన.

ఇక వితిక విషయానికి వస్తే, ఇంటిలో చీటికి మాటికీ  సభ్యులతో గొడవపడుతూ.. వరుణ్ సందేశ్‌తో ఎవరైనా వాగ్వాదానికి దిగితే.. వారిని ఆపేందుకు ప్రయత్నించడం లేదు. పైగా తాను కూడా వాగ్వాదాన్ని పొడిగించేందుకు ఇష్టపడతుందనే విషయం క్లియర్‌గా తెలుస్తోంది.

ఇదే అంశాన్ని ఈరోజు జరిగిన "హీరో-విలన్" టాస్క్‌లో వితిక గురించి బాబా భాస్కర్ మాట్లాడారు. "భర్తకి కోపం వచ్చిన సమయంలో.. అతన్ని కంట్రోల్ చేయడం భార్య కర్తవ్యం. అలాంటిది ఎవరితోనైనా వరుణ్ సందేశ్‌కి గొడవ జరిగితే.. దానిని పరిష్కరించాల్సింది పోయి అతనిని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు" అని తెలిపారాయన. ఈ కోణం నుండి ఆలోచిస్తే.. ప్రేక్షకుల వైపు నుండి కూడా వితిక పై కాస్త వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు : ఇంటి సభ్యులని ఏడిపించిన రవికృష్ణ, బాబా భాస్కర్, శ్రీముఖి & మహేష్ విట్టా

మరి చూడాలి... ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంటి నుండి వెళ్ళిపోతారా? లేక అందరికి ట్విస్ట్ ఇస్తూ వరుణ్ సందేశ్,  పునర్నవిలలో ఒకరు ఇంటిని విడిచి పెట్టి వెళతారా? అనేది ఈ రోజు స్పష్టమవుతుంది.  

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన 'హీరో - విలన్' టాస్క్ కాస్త హాటుగా.. ఇంకాస్త కూల్ గా గడిచింది. ప్రధానంగా ఇంటి సభ్యులలో హీరో కిరీటం ఎక్కువగా బాబా భాస్కర్‌కి దక్కగా.. ఆ తరువాత అలీ కి ఎక్కువ సార్లు దక్కింది. ఇక విలన్ కిరీటం విషయానికి వస్తే, ఎక్కువ శాతం సభ్యులు తమన్నా సింహాద్రి, వరుణ్ సందేశ్‌లకి ఆ క్రెడిట్ ఇచ్చారు. దీనితో వచ్చే వారం.. తమన్నాని ఇంటి సభ్యులు కచ్చితంగా నామినేట్ చేస్తారని స్పష్టమవుతోంది.

అదే విధంగా ఇంటి సభ్యులలో ఎవరిపై ఎవరికి మంచి అభిప్రాయం ఉంది...? ఎవరికి ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి..? అన్నది కూడా ఈ టాస్క్ ద్వారా కాస్త స్పష్టమైంది. ఇక ఈ టాస్క్ వల్ల కూడా బిగ్‌బాస్ హౌస్‌లో.. రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని అనిపిస్తుంది. అయితే అన్నిసార్లు మనం ఊహించిందే జరగకపోవచ్చు, ఎందుకంటే బిగ్‌బాస్ షోకి ఉన్న ట్యాగ్ లైన్ బట్టి చూస్తే .. "ఇది బిగ్ బాస్ షో.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు".

రాక్షసుడు మూవీ రివ్యూ - థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వారి కోసం