బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3 లో భాగంగా నేటితో 13వ వారం పూర్తవ్వనుంది. అయితే ఈ వారం ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే – ఇంటిలో ఉన్నఏడుగురు సభ్యులు నామినేషన్స్ లో ఉండడం. మరి ఈ ఏడుగురిలో ఎవరు ఈవారం ఇంటి నుండి వెళ్లిపోనున్నారు? ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం
అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఏడుగురు సభ్యులలో ముగ్గురుని సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. ఆ ముగ్గురు – శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ & బాబా భాస్కర్. దీనితో మిగిలిన నలుగురు సభ్యులలో ఎవరు ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోతారు అన్నదాని పైన అందరి దృష్టిని నెలకొంది. మరి ఈ నలుగురిలో ఎవరు ఈవారం ఇంటి నుండి వెళ్లిపోయే ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తులు శివజ్యోతి (shivajyothi) & వితిక (vithika).
ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంటి నుండి వెళతారు అన్న చర్చ మొదలైంది. బయట ఆడియన్స్ లో కూడా ఈ వారం కచ్చితంగా ఈ ఇద్దరి ఇంటిసభ్యులలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అన్న అభిప్రాయం ఉంది. దీనికి తోడుగా నిన్న బిగ్ బాస్ లో ఉన్న హౌస్ మేట్స్ కి సంబందించిన సన్నిహితులను పిలిచి వారితో ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులలో ఫైనల్ కి వెళ్ళరని మీరు భావించే ఇద్దరు సభ్యుల పేర్లు చెప్పమని అడగగా – వారిలో ఎక్కువమంది వితిక, శివజ్యోతి & అలీ రెజా పేర్లని చెప్పడం జరిగింది.
వీరి పేర్లు చెప్పడానికి కారణాలు ఏం చెప్పారంటే – ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ (bigg boss) లోకి మళ్ళీ వచ్చాడు అనే కారణం తో అలీ రెజా ని & వరుణ్ సందేశ్ ని ప్రభావితం చేస్తున్న కారణంగా వితికని & మొన్న జరిగిన గొడవ అలాగే నామినేషన్స్ అంటే భయపడుతున్న కారణంగా శివజ్యోతి పేర్లని చెప్పడం జరిగింది.
మరి ఈ ముగ్గురి పేర్లు వారు చెప్పినప్పటికి, అందులో ఉన్న శివజ్యోతి & వితిక పేర్లు ఎక్కువగా ఎలిమినేషన్ కోసం వినపడుతున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగొచ్చు కాబట్టి, ఈ ఇద్దరిలో ఒకరు అవుతారా లేక ఊహించని వారు ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది ఈరాత్రికి తెలిసిపోతుంది. అలాగే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్న విషయంలోనూ సందేహాలు నెలకొన్నాయి.
రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!
ఇదిలావుండగా నిన్న ఎపిసోడ్ ప్రారంభంలో రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖిల మధ్య జరిగిన వివాదం గురించి కొద్దిసేపు చర్చ జరిగింది. ఆ సమయంలో బిగ్ బాస్ లోకి రాహుల్ సిప్లిగంజ్ ని తీసుకొమ్మని శ్రీముఖి రికమండ్ చేసింది అని ఆ అమ్మాయి చెప్పుకుంటుంది, అలా చెప్పిన విషయం నా వరకు వచ్చింది అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. ఆ మాట నేను గనుక చెప్పాను అని నిరూపిస్తే నేను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోవడానికి కూడా సిద్ధం అంటూ శ్రీముఖి చెప్పడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
నేను చెప్పిన మాటలు తప్పని నిరూపిస్తే నేను కూడా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను అని రాహుల్ సిప్లిగంజ్ కూడా ఛాలెంజ్ చేశాడు. అయితే ఇది కేవలం కమ్యూనికేషన్ లోపం వల్ల జరిగి ఉండొచ్చు అని నాగార్జున ఇద్దరికీ సర్ది చెప్పాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవ్వరిని కూడా ఇలా రికమండేషన్స్ తో పంపించడం జరగదు అని దానికి తాను భరోసా ఇస్తున్నాను అని నాగార్జున చెప్పడం జరిగింది. శ్రీముఖి అలా మాట్లాడిందని వరుణ్ చెప్పాడు అని రాహుల్ చెప్పగా.. వరుణ్ మాత్రం బయట రాహుల్ కి తను సపోర్టివ్ గా నిలిచింది అని మాత్రమే చెప్పింది కానీ రికమెండ్ చేసిందని కాదు అని వివరణ ఇవ్వడం విశేషం.
మొత్తానికి వీరిరువురి మధ్య చర్చ మాత్రం వాడివేడిగా జరిగింది అన్నది వాస్తవం. ఇక ఈ ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు అని తెలిసింది కాబట్టి, రాబోయే రెండు వారాలు కూడా వీరిమధ్య పోటీ ఉండబోతుంది అన్నది స్పష్టంగా తెలుస్దోంది. బిగ్ బాస్ విన్నర్ కూడా ఈ ఇద్దరిలో ఒకరే అవుతారని కూడా చాలామంది భావిస్తుండడంతో వీరిద్దరి మధ్య పరిస్థితులు ఎలా మారతాయని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!