ముద్దు మధురిమలు ఆస్వాదించాలంటే.. ఇలా కిస్ చేయాల్సిందే..!

ముద్దు మధురిమలు ఆస్వాదించాలంటే.. ఇలా కిస్ చేయాల్సిందే..!

ముద్దు(Kiss).. ఒక‌ వ్య‌క్తిపై మ‌న‌కు ఉన్న ప్రేమ‌ను తెలియ‌జేసే మ‌ధుర‌మైన మార్గం. ఇది వారిపై మ‌న‌కు ఉన్న‌ ఇష్టాన్ని స్ప‌ష్టంగా తెలుపుతుంది. మ‌రి, ఇంత‌కీ ఆ ముద్దు ఎలా ఉండాలో మీకు తెలుసా?? దాన్ని ఆస్వాదిస్తూ మీ భాగస్వామి ‘నా అంత లక్కీ పర్సన్ ఈ భూమ్మీద ఇంకెవరూ లేరు’ అనుకొనేలా ఉండాలి. ఇందుకోసం ముద్దు పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే.. ఆ ముద్దును మరింత మధురంగా మార్చేయచ్చు. అవేంటంటే..


1. నెమ్మదిగా.. సున్నితంగా..


మీ భాగస్వామికి ముద్దు పెట్టాలనిపించినప్పుడు మీరే లీడ్ తీసుకోండి. నెమ్మదిగా కిస్ చేయడం మొదలుపెట్టండి. అతను మరింత కావాలనుకొనేలా.. అతనికి ముద్దు పెట్టేయండి.


2. మునిపంటితో కొరికి..మీ ముద్దుకి మరికొంత స్పైస్ జోడించండి. అదెలాగో తెలుసా? అధర చుంబనం చేస్తున్నప్పుడు అతని కింది పెదవిని మునిపంటితో సున్నితంగా కొరకండి. అలాగని గట్టిగా కొరికేయకండేం..!


3. పెదవులకే పరిమితం కావొద్దు..


ముద్దు పెదవులకే పెట్టుకోవాలని ఎవరు చెప్పారు? ముఖానికి, చెవులపై, మెడ మీద కూడా  పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల మరింత ఎక్కువ స‌మ‌యం ముద్దు పెట్టుకొంటూనే  గడిపేయచ్చు.


4. తలను కదిలిస్తూ..


7 how to kiss him to


ఎటూ కదలకుండా అలాగే ఉండి ముద్దు పెట్టుకొంటుంటే.. మీరు అసౌకర్యానికి గురవుతున్నారని మీ భాగస్వామి భావించవచ్చు. అందుకే తలను నెమ్మదిగా కదిలిస్తూ ముద్దు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు.. అధర చుంబనంలోని మధురిమలను ఆస్వాదించవచ్చు.


5. నాలుక కూడా ఉపయోగించండి


ముద్దు పెట్టుకొనేటప్పుడు నాలుకను ఉపయోగించడం వల్ల మీ ముద్దు మరో లెవెల్ కు వెళ్లిపోతుంది. నాలుకతో అతన్ని టీజ్ చేయండి. ఇంకా అతన్ని కవ్వించాలంటే... చాక్లెట్ ఉపయోగించండి.


6. చేతులనూ వాడండి


పెదవులతో ముద్దు పెట్టుకొంటాం కదా అని చేతులతో పని లేదనుకొంటున్నారేమో.. అతని మెడ, నడుము, భుజాలపై సుతారంగా కదిలించండి. ఇది అతనిలో గిలిగింతలు కలిగిస్తుంది. అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు కదా..!


7 how to kiss him


అతనికి ముద్దు పెట్టే ముందు మీరు చేయాల్సిన పని మరొకటి ఉంది. పెదవులు పొడిబారిపోకుండా ఫ్లేవర్డ్ లిప్ బామ్ పెదవులకు అప్లై చేసుకోండి. అలాగే మీ నోరు దుర్వాసన రాకుండా చూసుకోండి.


GIFs: Giphy


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ తొలిరేయి జ్ఞాప‌కాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..


కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృద‌య‌మే.. ఇవి అత‌నికి న‌చ్చే ప్రేమ‌లేఖ‌లు..


ఆమె కౌగిలిలో కరిగిపోయా.. ఈ లోకాన్నే మరిచిపోయా: మోడరన్ రోమియోల మాటలివే..!